Bigg Boss Telugu 8: మూడవ వారంలో మగవాళ్ళతో సమానంగా గేమ్స్ ఆడి ప్రేక్షకుల చేత ఆడపులి అని అనిపించుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది యష్మీ మాత్రమే. ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో ఈమె చెప్పే పాయింట్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇంత క్లారిటీ తో హౌస్ లో ఏ కంటెస్టెంట్ కూడా గేమ్ ఆడలేరేమో అని అనిపించేలా తన పాయింట్ గురించి చెప్తుంది యష్మీ. సోనియా ఈరోజు నామినేషన్స్ లోకి వచ్చి ఎలిమినేట్ అవ్వడానికి కారణమే యష్మీ. ఆమె లేవదీసిన పాయింట్స్ గన్ షాట్స్ లాగా పేలాయి. ఆడియన్స్ ఎలా అయితే సోనియా గురించి అనుకుంటున్నారో, బయటకి వెళ్లి చూసొచ్చిన ఆమె లాగా మాట్లాడింది యష్మీ. ఆమె ధైర్యానికి అందరూ ఫిదా అయిపోయారు. అయితే ఎప్పుడైతే ఆమె నిఖిల్ క్లాన్ లోకి వెళ్లిందో అప్పటి నుండి తన గ్రాఫ్ నెమ్మదిగా డౌన్ అవుతున్నట్టుగా అనిపించింది. అంతే కాదు నిఖిల్ క్లాన్ లోకి వెళ్లిన తర్వాత సోనియా విషయం లో పూర్తిగా ప్లేట్ తిప్పేసింది. ఆదివారం ఎపిసోడ్ లో ఆమె ఇచ్చిన ఈ మాస్టర్ స్ట్రోక్ కి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి మాత్రమే కాదు, ఆమెని విపరీతంగా సపోర్ట్ చేసిన ఆడియన్స్ కూడా షాక్ కి గురయ్యారు.
చాలా నిజాయితీగా మాట్లాడే అమ్మాయి అనుకుంటే , అకస్మాత్తుగా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చిందేంటి అని అనుకున్నారు. ఆమె మాట్లాడుతూ ‘హౌస్ లో అందరూ సోనియా ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిఖిల్, పృథ్వీ ఆమెని తమ సోదరిగా అనుకున్నారు. ఆ చనువుతో ఆమె కొన్ని సలహాలు ఇస్తుంది. ఆ సలహాలను పాటించాలా వద్దా అనేది వీళ్లిద్దరి నిర్ణయం, అందులో సోనియా తప్పు ఏమి లేదని ఆ క్లాన్ లోకి వెళ్లిన తర్వాత నాకు అర్థం అయ్యింది’ అని నాగార్జునకు చెప్పుకొచ్చింది. ప్రతీ విషయాన్ని అంత క్షుణ్ణంగా పరిశీలించే యష్మీ, ఆమె చెప్పిన మాటలు వినకపోతే ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అనేది గమనించలేదా అని హాట్ స్టార్ లో లైవ్ చూసిన ఆడియన్స్ అడుగుతున్న ప్రశ్న.
ఇలా ఈ రేంజ్ లో ప్లేట్ తిప్పడం సోనియా ఎప్పుడూ చేయలేదు, చాలా బలంగా ఎదుటి వ్యక్తిని డామినేట్ చేసే గుణం ఉన్న అమ్మాయి కానీ, ఇలా అవసరానికి తగ్గట్టు మారిపోయే గుణం కాదు, యష్మీ కంటే సోనియానే బెటర్ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు ఇన్ని రోజులు సోనియా నిఖిల్ కి హౌస్ లో గాడ్ ఫాదర్ లాగా ఉంటూ వచ్చింది, ఇప్పుడు ఆమె స్థానాన్ని యష్మీ తీసుకోబోతుందా అంటే అవుననే అంటున్నారు నెటిజెన్స్. ఎంత ఫైర్ బ్రాండ్ లాగా ఈమె కనిపించిన, ఈమెకు నిఖిల్ అంటే చాలా ఇష్టం. అనేక సందర్భాలలో హౌస్ మేట్స్ కి కూడా చెప్పింది. నిఖిల్ కోసమే ఆమె తన క్లాన్ ని కూడా మార్చుకుంది అని అందరూ అనుకుంటున్నారు.