Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో తనకు ఇచ్చిన ప్రతీ టాస్కులోను వంద కి 200 శాతం అద్భుతమైన ఎఫోర్ట్స్ పెట్టే కంటెస్టెంట్స్ లో ఒకరు ప్రేరణ. ఈమె టాస్కులు ఆడే విధానం చూసి ఆడియన్స్ ఈమెకు లేడీ టైగర్ అనే బిరుదు ఇచ్చారు. అయితే ప్రేరణ ని చూసినప్పుడల్లా ఎందుకో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఆమెను తొక్కే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూసే ఆడియన్స్ కి అర్థం అవుతుంది. గడిచిన రెండు వారాల్లో ఆమెకు పప్పీల బొమ్మలను పట్టుకొని పరిగెత్తే టాస్క్ తప్ప, మరో టాస్కుని ఇవ్వలేకపోయారు క్లాన్ చీఫ్స్. ఆ ఒక్క టాస్కుతోనే ప్రేరణ తన సత్తా చాటింది. చివరి వరకు మగవాళ్ళతో సమానంగా పరుగులు తీసి చీఫ్ కంటెండర్ అయ్యేందుకు ప్రాణం పెట్టి ఆడింది. ఆరోజు ఆమెకు పీరియడ్స్ అవ్వడం వల్ల ఆరోగ్య పరంగా చాలా బలహీనంగా ఉన్నింది.
అయినప్పటికీ కూడా తన గేమ్ కి ఆరోగ్యం బాగాలేకపోవడం బలహీనం కాదు అని బలంగా నమ్మి టాస్కులో ఇచ్చి పారేసింది. ఇది ఇలా ఉండగా నిన్న బిగ్ బాస్ ఇచ్చిన హోటల్ టాస్క్ లో ప్రేరణ హోటల్ కి మతిమరపు మ్యానేజర్ రోల్ ని ఇస్తాడు. ఈ టాస్క్ లో ఆమె తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ ఒక్కరు కూడా ఆమె మాట వినడం లేదు. హోటల్ కి మ్యానేజర్ ఏ పని చెప్తే ఆ పని మ్యానేజర్ క్రింద ఉన్నవాళ్లు చేయాలి. కానీ ప్రేరణ చెప్పిన మాటలను ఒక్కరు కూడా లెక్క చేయరు. దీనికి ప్రేరణ కాస్త అసహనం కి గురి అయ్యింది. నా మాట ఒక్కరు కూడా వినడం లేదంటూ మెగా చీఫ్ నబీల్ కి చెప్తుంది. అతను కూడా పెద్దగా పట్టించుకోడు. దీంతో ప్రేరణ తన నుండి వంద శాతం ఇవ్వలేకపోయింది. అప్పటికీ కూడా టేస్టీ తేజా తో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసింది, కొంతమేరకు సక్సెస్ అయ్యింది కానీ, పూర్తి స్థాయిలో నవ్వు రాలేదు.
అలా టాస్క్ బాగా పెర్ఫర్మ్ చేయాలనుకున్న ప్రేరణ మధ్యలోనే విఫలమైంది. ఈ విషయం పై వీకెండ్ ఎపిసోడ్స్ లో అక్కినేని నాగార్జున హౌస్ మేట్స్ ని కచ్చితంగా మందలించాల్సి ఉంటుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ ఇచ్చిన రోల్స్ ని దాటి అతిగా చేసే హక్కు ఎవరికీ లేదు, కానీ ప్రేరణ విషయం లో హౌస్ మేట్స్ ఆ చిన్న పొరపాటు చేసారు అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా ఈ వారం ప్రేరణ గ్రాఫ్ అమాంతంగా పెరిగే పరిస్థితులు ఏమి రాలేదనే చెప్పాలి. కానీ ఆమె గ్రాఫ్ పెరగకపోయిన తగ్గే పరిస్థితులు కూడా రాలేదు. రాబోయే రోజుల్లో ఆమె టాస్కులు ఎలా ఆడబోతుందో చూడాలి.