https://oktelugu.com/

Bigg Boss Telugu 8: హోటల్ టాస్క్ లో అదరగొట్టేసిన యష్మీ..మణికంఠ ని ఆడేసుకున్న రోహిణి..అవినాష్ కామెడీ టైమింగ్ అదుర్స్!

యష్మీ చాలా కామెడీ గా డ్యాన్స్ వేసి అవినాష్ ని సైతం నవ్వేలా చేస్తుంది. ముందుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా మఫ్టీ లో వచ్చిన హరి తేజ వద్ద కాస్త టిప్ తీసుకున్న యష్మీ, ఆ తర్వాత గౌతమ్ కి మసాజ్ చేసి మరికొంత టిప్ తీసుకుంటుంది. చివరికి మహారాణి అసిస్టెంట్ దగ్గర కూడా కామెడీ చేసి టిప్పులు అందుకుంది. ఆ తర్వాత గంగవ్వ తో కామెడీ చేస్తుంది యష్మీ. ఆమె దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె వద్ద గౌతమ్, టేస్టీ తేజా కూర్చొని ఉంటారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 10, 2024 / 11:28 AM IST

    Bigg Boss Telugu 8(102)

    Follow us on

    Bigg Boss Telugu 8: ప్రతీ సీజన్ లో బిగ్ బాస్ హోటల్ టాస్క్ ఎంతో ఫన్నీ గా, మంచి ఎంటర్టైన్మెంట్ అందించి, ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్వించింది. కానీ ఈ సీజన్ లో మాత్రం ఈ టాస్క్ డిజాస్టర్ గా, చాలా బోరింగ్ గా అనిపించింది. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ సరైన రోల్స్ ఇవ్వలేదని చూసే ఆడియన్స్ కి అనిపించింది. అయితే ఈ టాస్కులో కాస్తో కూస్తో తమ వంతు ఎంటర్టైన్మెంట్ పంచేందుకు యష్మీ అవినాష్, రోహిణి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ముందుగా యష్మీ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది అనే చెప్పాలి. హోటల్ లోకి వచ్చే ప్రతీ ఒక్కరి మూతిని టిష్యూ పేపర్ తో తుడుస్తూ టిప్స్ అడుగుతుంది. ఇది చాలా ఫన్నీ గా అనిపించింది. ఇక అవినాష్ సూపర్ స్టార్ గా తన ప్రేమికురాలితో ఎంటర్ అవుతాడు. యష్మీ ఇక్కడ కూడా అవినాష్ తో కామెడీ చేసే ప్రయత్నం చేస్తుంది. అవినాష్ టిప్ కావాలంటే డ్యాన్స్ వేయాలి అని యష్మీ ని అడుగుతాడు.

    యష్మీ చాలా కామెడీ గా డ్యాన్స్ వేసి అవినాష్ ని సైతం నవ్వేలా చేస్తుంది. ముందుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా మఫ్టీ లో వచ్చిన హరి తేజ వద్ద కాస్త టిప్ తీసుకున్న యష్మీ, ఆ తర్వాత గౌతమ్ కి మసాజ్ చేసి మరికొంత టిప్ తీసుకుంటుంది. చివరికి మహారాణి అసిస్టెంట్ దగ్గర కూడా కామెడీ చేసి టిప్పులు అందుకుంది. ఆ తర్వాత గంగవ్వ తో కామెడీ చేస్తుంది యష్మీ. ఆమె దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె వద్ద గౌతమ్, టేస్టీ తేజా కూర్చొని ఉంటారు. మా వాళ్ళని పెళ్లి చేసుకుంటావా అని గంగవ్వ యష్మీ ని అడగగా టిప్ ఇస్తే చేసుకుంటా అని అంటుంది. ఇక యష్మీ తర్వాత ఈ టాస్క్ లో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది అవినాష్, రోహిణి అని చెప్పొచ్చు. ఈ టాస్కు ప్రారంభం అయ్యే ముందు కూడా బిగ్ బాస్ అవినాష్ కి బిగ్ బాస్ ని ఇమిటేట్ చేయమని ఒక టాస్క్ ఇస్తాడు. అవినాష్ బిగ్ బాస్ గొంతు ని ఇమిటేట్ చేసి బిగ్ బాస్ ని సంతృప్తి పరుస్తాడు. దీనికి బిగ్ బాస్ రివార్డుగా మరో ఉప్పు ప్యాకెట్ ని ఇస్తాడు.

    ఇక తర్వాత హోటల్ టాస్కు లో రోహిణి అవినాష్ కి లవర్ గా నటిస్తూ తన యాస భాషతో ఫుల్లుగా నవ్వించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ మణికంఠ కాస్త క్యారక్టర్ నుండి బయటకి వచ్చి రోహిణి పై కామెంట్స్ వేస్తాడు. దీనికి రోహిణి చాలా సీరియస్ అయ్యినట్టు మనకి ప్రోమో లో చూపించారు. ఈ ప్రోమో ని చూసి పెద్ద గోవ అవ్వుద్దేమో అనుకున్నారు ఆడియన్స్, మణికంఠ కూడా రోహిణికి వచ్చిన కోపాన్ని చూసి భయపడిపోతాడు. ఆ తర్వాత అది కేవలం కామెడీ కోసమే అని మణికంఠ ని ఆడుకుంటుంది. అలా వీళ్ళ ముగ్గురు తప్ప హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ నుండి ఆశించిన స్థాయిలో పెర్ఫార్మన్స్ ఇవ్వలేదనే చెప్పాలి.