Bigg Boss Telugu 8: ఈ సీజన్ ‘బిగ్ బాస్ 8’ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, రన్నర్ గా నిల్చిన గౌతమ్ కృష్ణ, బిగ్ బాస్ హిస్టరీ లోనే చరిత్ర సృష్టించాడు అనే చెప్పాలి. కేవలం తెలుగు మాత్రమే కాదు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్స్ లో కూడా ఒక వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ఫినాలే వరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ, రన్నర్ రేంజ్ లో ఎవ్వరూ కాలేకపోయారు. వాస్తవానికి సోషల్ మీడియా లో నెటిజెన్స్ మొత్తం గౌతమ్ విన్నర్ అయ్యాడని, స్టార్ మా ఛానల్ వాళ్ళ సీరియల్స్ లో పని చేసేవాళ్ళని విన్నర్ చెయ్యాలని అనుకున్నారు కాబట్టి నిఖిల్ ని విన్నర్ చేసారని సోషల్ మీడియా లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ టీం మొదటి నుండి గౌతమ్ కి అన్యాయం చేస్తూనే వచ్చిందని అంటున్నారు.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో గౌతమ్ మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారింది. ఆయన మాట్లాడుతూ ‘జనాలకు బిగ్ బాస్ టీం వాళ్ళు ఏమి ఎడిటింగ్ చేసి జనాలకు చూపించారో నాకు తెలియదు కానీ, ఫినాలే లో జరిగిన సంఘటనలు మొత్తం ఎడిట్ చేసి టెలికాస్ట్ చేసాడు. నేను ఓడిపోయినందుకు బాధతో తల దించుకున్నప్పుడు రామ్ చరణ్ అన్నయ్య నాకు చాలా ధైర్యం చెప్పాడు. మా అమ్మ నీకు పెద్ద ఫ్యాన్ అని, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఆమె గౌతమ్ విన్నర్ అవుతాడని చెప్పిందని, నువ్వు తెలుగు ప్రేక్షకులకు ఆ రేంజ్ లో కనెక్ట్ అయ్యావని, చాలా మంచి భవిష్యత్తు ఉందని చెప్పాడు. ఇవేమి టీవీ టెలికాస్ట్ లో చూపించలేదు. అంతే కాకుండా వైల్డ్ కార్డు గా అడుగుపెట్టి రన్నరప్ గా నిలిచి చరిత్ర సృష్టించావు శబాష్ అంటూ నాగార్జున గారు పొగిడారు. కానీ అవేమి టెలికాస్ట్ లో చూపించలేదు’ అని చెప్పుకొచ్చాడు గౌతమ్.
మొదటి నుండి బిగ్ బాస్ టీం గౌతమ్ పట్ల ఇలాగే వ్యవహరిస్తూ వచ్చింది. అతను చిన్న తప్పు చేసిన నాగార్జున చేత ఎపిసోడ్ మొత్తం తిట్టించేవాళ్ళు. అదే తప్పు వేరే కంటెస్టెంట్స్ చేస్తే ఈ స్థాయి కోటింగ్ ఉండేది కాదు. గత సీజన్ లో కూడా గౌతమ్ పట్ల ఇలాగే ప్రవర్తించారు. అతని పట్ల ఇంత ద్వేషంతో బిగ్ బాస్ టీం వ్యవహరించడం జనాలకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని, ఇక విన్నర్ విషయంలో కూడా మోసం జరగలేదు అనడానికి ఆధారాలు ఏమిటి అంటూ గౌతమ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గౌతమ్ ని కూడా ఇంటర్వ్యూ లో గమనిస్తే అతన్ని రన్నర్ గా ప్రకటించినప్పుడు బిగ్ బాస్ టీం పై చాలా అసంతృప్తితో ఉన్నట్టుగా అనిపించింది. నాగార్జున హోస్టింగ్ పై ఆయన నబీల్ తో హౌస్ లో ఉన్నప్పుడే అసంతృప్తి తో మాట్లాడడం మనమంతా చూసాము.