Bigg Boss Telugu 8: గంగవ్వ ‘ఆస్కార్’ యాక్టింగ్ కి వణికిపోయిన రోహిణి..ప్లానింగ్ చేసిన అవినాష్, తేజా కూడా పరార్!

టేస్టీ తేజా, అవినాష్ ఆమెకి ఎలా చేయాలో ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ తర్వాత కాసేపటికి హౌస్ లో లైట్స్ ఆఫ్ అవుతాయి. అందరూ పడుకొని మంచిగా నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో గంగవ్వ లివింగ్ రూమ్ లోకి వచ్చి కూర్చొని దెయ్యం లాగా అరవడం ప్రారంభిస్తుంది. దెబ్బకు హౌస్ మేట్స్ అందరూ హడలిపోయి పైకి లేస్తారు.

Written By: Vicky, Updated On : October 24, 2024 8:56 am

Bigg Boss Telugu 8(154)

Follow us on

Bigg Boss Telugu 8: నిన్న రాత్రి బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ చేసిన ఆస్కార్ యాక్టింగ్ కి హౌస్ మేట్స్ అందరూ ఎలా వణికిపోయారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అసలు ఏమి జరిగిందంటే ముందుగా టేస్టీ తేజా ,అవినాష్ గార్డెన్ లో కూర్చొని బిగ్ బాస్ కి గంగవ్వ తో ప్రాంక్ చేయించబోతున్నట్టు చెప్తారు. ఆ తర్వాత గంగవ్వ దగ్గరకి వెళ్లి ఈ ప్రాంక్ గురించి చెప్తారు. ఆమె కూడా చేయడానికి ఒప్పుకుంటుంది. టేస్టీ తేజా, అవినాష్ ఆమెకి ఎలా చేయాలో ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ తర్వాత కాసేపటికి హౌస్ లో లైట్స్ ఆఫ్ అవుతాయి. అందరూ పడుకొని మంచిగా నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో గంగవ్వ లివింగ్ రూమ్ లోకి వచ్చి కూర్చొని దెయ్యం లాగా అరవడం ప్రారంభిస్తుంది. దెబ్బకు హౌస్ మేట్స్ అందరూ హడలిపోయి పైకి లేస్తారు. గంగవ్వ దగ్గరకి వచ్చి ఆమె కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు.

కానీ ఆమె అందరిని పక్కకి తోసేస్తుంది. దెయ్యం పట్టిన మనిషిలాగ పెద్దగా అరుస్తూ అందరినీ వణికిపోయేలా చేస్తుంది. అయితే గౌతమ్ ఇదంతా ప్రాంక్ ఏమో అని ముందుగానే పసిగట్టి మెహబూబ్ తో అంటాడు. ప్రాంక్ చేస్తే కాసేపు చేయగలరు, ఇన్ని గంటలసేపు ప్రాంక్ ఎలా చేయగలరు అని అంటాడు మెహబూబ్. నిజంగానే ఆమెకు దెయ్యం పట్టిందా?, చాలామంది రాత్రులు నిద్రపోతున్న సమయంలో వాళ్లకి తెలియకుండానే పిచ్చి కలలు కంటూ ఇష్టమొచ్చినట్టు అరుస్తూ ఉంటారు. గంగవ్వ పరిస్థితి కూడా అదేనా అని హరితేజ సందేహిస్తుంది. ఇక రోహిణి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అవ్వకి పూనకాలు వచ్చినప్పుడు ముందుగా ధైర్యం చేసి ఆమెనే గంగవ్వ వద్దకు వస్తుంది. గంగవ్వ పక్కకి నెట్టేస్తుంది. ఆ తర్వాత చాలావరకు ఆమెని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. చివరికి ఇక నావల్ల కాదు అంటూ పక్కకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈమె గంగవ్వకి భయపడడం మొదలు పెడుతుంది. ఎట్టకేలకు ఎలాగో టేస్టీ తేజా, అవినాష్ గంగవ్వ ని లోపలకి తీసుకెళ్లి పడుకోబెడుతారు. పడుకున్న తర్వాత కూడా ఆమె అరవడం మొదలు పెడుతుంది. దీంతో రోహిణి భయంతో వణికిపోయి లివింగ్ రూమ్ లోని సోఫా వద్ద దుప్పటి కప్పుకొని భయపడుతూ పడుకుంటుంది.

ఇది చూసినప్పుడు చాలా నవ్వు వస్తాది. అయితే ఆ తర్వాత టేస్టీ తేజా, అవినాష్ వాష్ రూమ్ వద్దకు వెళ్లి పగలబడి నవ్వుకుంటారు. గంగవ్వ ఏంటి అలా జీవించేసింది. ప్లాన్ చేసిన మనకే కారిపోయింది అని టేస్టీ తేజా అవినాష్ కి చెప్పుకొని నవ్వుకుంటాడు. అప్పుడు అవినాష్ కెమెరా తో మాట్లాడుతూ ‘ఈ ప్రాంక్ కి ప్లానింగ్ మొత్తం ఈ టేస్టీ తేజ గాడే, నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని అంటాడు. అయితే ఇదంతా ప్రాంక్ అనే విషయం హౌస్ మేట్స్ ఎవ్వరికి తెలియదు. ఈ వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున ఇది ప్రాంక్ అని చెప్పిన తర్వాత హౌస్ మేట్స్ రియాక్షన్స్ ఎలా ఉంటుందో చూడాలి. గంగవ్వ, అవినాష్, తేజ పై భారీగా వచ్చే వారం నామినేషన్స్ పడే అవకాశాలు ఉన్నాయి.