Bigg Boss Telugu 8: వచ్చే వారం నుండి నామినేషన్స్ విషయంలో నిఖిల్ మాస్టర్ ప్లాన్..ప్రేరణ ని మాత్రం వదలను అంటున్న విష్ణు ప్రియ!

ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ వెర్సస్ స్మార్ట్ ఛార్జర్స్ టాస్క్ లో నిఖిల్ తన క్లాన్ కోసం ఏ రేంజ్ లో కష్టపడ్డాడో మనమంతా చూసాము. ఫిజికల్ గా అతనికి చాలా దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా అద్భుతంగా ఆడాడు. ఈ వారం కూడా అదే చేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే యష్మీ, ప్రేరణ మధ్య చిన్న గొడవ జరుగుతుంది.

Written By: Vicky, Updated On : October 24, 2024 8:50 am

Bigg Boss Telugu 8(153)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ‘ది టాస్క్ కింగ్’ అని పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నిఖిల్ అని చెప్పొచ్చు. నిఖిల్ తో తలపడే ఏ కంటెస్టెంట్ అయినా ఓడిపోవాల్సిందే. అలా టాస్కులలో ఇతను విజృంభిస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు హౌస్ లో ఆడిన టాస్కులు అన్నిట్లో నిఖిల్ కి 99% స్ట్రైక్ రేట్ ఉంది. బిగ్ బాస్ హిస్టరీ లో ఈ రేంజ్ స్ట్రైక్ రేట్ ఎవరికీ లేదు అని చెప్పొచ్చు. అంతే కాదు, నాలుగు సార్లు చీఫ్ గా నిలిచి సరికొత్త రికార్డుని నెలకొల్పాడు. ఈ రికార్డుని ఇప్పటి వరకు హౌస్ లో ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోవడం గమనార్హం. ఇవన్నీ పక్కన పెడితే నిఖిల్ లో ఉన్న లీడర్ షిప్ లక్షణాలు హౌస్ లో ఎవరికీ లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతను చీఫ్ అయినా అవ్వకపోయిన తన క్లాన్ ని కాపాడుకునేందుకు చాలా కష్టపడతాడు.

ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ వెర్సస్ స్మార్ట్ ఛార్జర్స్ టాస్క్ లో నిఖిల్ తన క్లాన్ కోసం ఏ రేంజ్ లో కష్టపడ్డాడో మనమంతా చూసాము. ఫిజికల్ గా అతనికి చాలా దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా అద్భుతంగా ఆడాడు. ఈ వారం కూడా అదే చేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే యష్మీ, ప్రేరణ మధ్య చిన్న గొడవ జరుగుతుంది. ఈ గొడవని సర్దుతూ నిఖిల్ క్లాన్ మొత్తాన్ని కూర్చోబెట్టి మాట్లాడుతాడు. ‘ప్రతీ వారం మన క్లాన్ నుండే ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి, ఈ వారం నుండి మాత్రం మనలో ఎవ్వరూ కూడా ఒకరి మీద ఒకరు నామినేషన్ వేసుకోవద్దు. ఇలా మీ మధ్య ఏదైనా గొడవలు జరిగితే ప్రైవేట్ గా చూసుకోండి, రాయల్ క్లాన్ కి తెలిసేలా చేసుకోవద్దు. అలా చేసి వాళ్లకు మనం నామినేషన్ పాయింట్స్ ఇచ్చి వెర్రి వాళ్ళం లాగ మిగిలిపోతున్నాము. ఇక నుండి అలా జరగడానికి వీలు లేదు. కప్పు కొడితే మన ఆరు మందిలో ఎవరో ఒకరు కొట్టాలి. వాళ్ళను నేను కప్పుని ముట్టుకోనివ్వను’ అని నిఖిల్ అంటాడు.

దీనికి అందరూ ఒప్పుకుంటారు. పృథ్వీ కూడా తనకి ప్రేరణతో ఉన్న గొడవలన్నీ పక్కన పెట్టి, ఇక నుండి నేను మన క్లాన్ సబ్యులకు నామినేషన్స్ వేయను, ఇది నేను మీ అందరికీ ఇస్తున్న మాట అని అంటాడు. కానీ విష్ణు ప్రియ మాత్రం ప్రేరణతో ప్యాచప్ అవ్వడానికి ఇష్టపడడు.నేను మాత్రం మన క్లాన్ లో ఒకరిపై వచ్చే వారం నామినేషన్ వేయాలి, నా దగ్గర కొన్ని పాయింట్స్ మిగిలిపోయాయి, అవి జనాలకు తెలిసేలా చెప్పాలి అని అంటుంది విష్ణు ప్రియ. ఆమె పరోక్షంగా ప్రేరణ కి నామినేషన్ వేస్తాను అని చెప్పకనే చెప్పేసింది. ఇదంతా పక్కన పెడితే ఓజీ క్లాన్ ఇలా మాట్లాడుకొని అందరూ ఒక తాటి పైకి వచ్చిన తర్వాత తదుపరి లెవెల్స్ లో విజృభించి ఆడారు. రాయల్ క్లాన్ సభ్యులను ప్రతీ లెవెల్ లో ఆడిస్తూ టాపర్లుగా నిలిచారు. ఈ వారం ఓజీ క్లాన్ నుండి ఎవరో ఒకరు మెగా చీఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఎవరు మెగా చీఫ్ అవుతారు అనేది. హౌస్ ఇలా ఒక తాటిపై నిలబడి రాయల్స్ పై లీడ్ చూపించడానికి ప్రధాన కారణం నిఖిల్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.