Bigg Boss Telugu 8: ఓజీ క్లాన్ ని ఒంటి చేత్తో గెలిపించిన నిఖిల్,పృథ్వీ..అదేమీ ఆట అండీ బాబోయ్..దెబ్బకి పారిపోయిన రాయల్ క్లాన్ సభ్యులు!

ముఖ్యంగా ఫిజికల్ టాస్కులలో వీళ్లిద్దరి ఆట తీరుని చూసి అవతల వ్యక్తి వణికిపోవాల్సిందే. ఆ రేంజ్ లో ఆడుతారు. అయితే గత రెండు వారాలుగా కొన్ని కారణాల వల్ల రాయల్ క్లాన్ కి సంబంధించిన వాళ్ళే మెగా చీఫ్ అవుతూ వచ్చారు. హౌస్ కి మొట్టమొదటి మెగా చీఫ్ గా నబీల్ నిలుస్తాడు. వైల్డ్ కార్డ్స్ గా అడుగుపెట్టిన రాయల్స్ కి కూడా ఆయనే మెగా చీఫ్ గా వ్యవహరించాడు.

Written By: Vicky, Updated On : October 24, 2024 9:02 am

Bigg Boss Telugu 8(155)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు పరంగా చూస్తే నిఖిల్, పృథ్వీ కి పోటీని ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఫిజికల్ టాస్కులలో వీళ్లిద్దరి ఆట తీరుని చూసి అవతల వ్యక్తి వణికిపోవాల్సిందే. ఆ రేంజ్ లో ఆడుతారు. అయితే గత రెండు వారాలుగా కొన్ని కారణాల వల్ల రాయల్ క్లాన్ కి సంబంధించిన వాళ్ళే మెగా చీఫ్ అవుతూ వచ్చారు. హౌస్ కి మొట్టమొదటి మెగా చీఫ్ గా నబీల్ నిలుస్తాడు. వైల్డ్ కార్డ్స్ గా అడుగుపెట్టిన రాయల్స్ కి కూడా ఆయనే మెగా చీఫ్ గా వ్యవహరించాడు. ఆ వారంలో జరిగిన మెగా చీఫ్ టాస్కులలో మెహబూబ్ రాయల్ క్లాన్ నుండి గెలిచి, మెగా చీఫ్ అవుతాడు.ఆ తర్వాతి వారం లో గౌతమ్ ఒంటి చేతితో 12 మందిని ఓడించి మెగా చీఫ్ అవుతాడు, అయితే ఆ టాస్కులో నిఖిల్, పృథ్వీ లేకపోవడం గమనించాల్సిన విషయం, వాళ్లిద్దరూ ఉండుంటే టాస్కు మరోలా ఉండేది, గౌతమ్ అంత తేలికగా మెగా చీఫ్ అయ్యేవాడు కాదు.

ఇలా వరుసగా ఓజీ క్లాన్ కి సంబంధించిన వాళ్ళు ఎలిమినేట్ అవ్వడం, రాయల్ క్లాన్ వాళ్ళు వరుసగా చీఫ్స్ అవ్వడం నిఖిల్ కి అసలు నచ్చలేదు. అందుకే ఆయన తన ఓజీ క్లాన్ మొత్తాన్ని మోటివేట్ చేసి ఇక నుండి మనలో మనం నామినేషన్స్ వేసుకోకూడదు, అందరం కలిసి కట్టుగా ఆడాలి, కప్ కొడితే మన క్లాన్ వాళ్ళే కొట్టాలి. ఈ సీజన్ మనది, మొదటి వారం నుండి ఎన్నో కష్టాలు పడి ఇంత దూరం వచ్చాము అని అంటాడు. నిఖిల్ మాటలకు అందరూ ఏకీభవిస్తారు. వాటర్ టాస్క్ లో ఓడిపోయిన తర్వాత, రెండవ లెవెల్ లోని బస్తాల టాస్క్ లో నిఖిల్, పృథ్వీ రాయల్ క్లాన్ మొత్తానికి చుక్కలు చూపించారు అనే చెప్పాలి. వీళ్లిద్దరి విశ్వరూపం చూసి రాయల్ క్లాన్ సభ్యులు భయపడిపోయారు.

ముఖ్యంగా పృథ్వీ ని ప్రతీ వారం నామినేట్ చేస్తూ ఓవర్ టార్గెట్ చేసిన అవినాష్, రోహిణి ‘ఏందిరా వీడు ఇలా ఆడుతున్నాడు’ అని నోరెళ్ళబెట్టి చూసారు. మొత్తం ఆరు లెవెల్స్ ఈ మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ లో ఉండగా, ఓజీ క్లాన్ మూడు లెవెల్స్ గెలవగా, రాయల్స్ క్లాన్ కేవలం ఒక్క లెవెల్ మాత్రమే గెలిచింది. ఇంకా రెండు లెవెల్స్ ఉన్నాయి, ఈ రెండు లెవెల్స్ లో ఓజీ క్లాన్ ఒక్క లెవెల్ గెలిచినా టాస్క్ మొత్తం గెలిచినట్టే. ఒకవేళ రాయల్ క్లాన్ మిగిలిన ఆ రెండు లెవల్స్ గెలిస్తే డ్రా అవుతుంది. అప్పుడు బిగ్ బాస్ విజేత నిర్ణయించేందుకు మళ్ళీ ఇంకో టాస్క్ ఇస్తాడు. అలా జరుగుతుందా లేదా ఓజీ క్లాన్ మిగిలిన రెండు లెవెల్స్ గెలుస్తుందా అనేది చూడాలి. ఈరోజు ఎపిసోడ్ మొత్తం మంచి ఫైర్ మీద నడుస్తుంది.