https://oktelugu.com/

Bigg Boss Telugu 8: రీ ఎంట్రీ కోసం సోనియా బిగ్ బాస్ టీంని ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా..? ఈమెకి పొగరు ఇంకా తగ్గాలా!

బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ఆమె రెమ్యూనరేషన్ భారీ గా డిమాండ్ చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు. ఆమె హౌస్ లోకి మొదటిసారి ఎంట్రీ ఇచ్చినప్పుడు వారానికి 3 లక్షల రూపాయిలు ఇవ్వడానికి బిగ్ బాస్ టీం అంగీకరించింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 15, 2024 / 07:26 AM IST

    Bigg Boss Telugu 8(111)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కేవలం నాలుగు వారాలు హౌస్ లో కొనసాగి, బిగ్ బాస్ హిస్టరీ లోనే ఎవరికీ రానంత నెగటివిటీ ని మూటగట్టుకొని బయటకి వెళ్లిన కంటెస్టెంట్ సోనియా. బయటకి వెళ్లిన తర్వాత ఈమె చేసిన రచ్చ మామూలుది కాదు. లోపల జరిగింది జరిగినట్టు చూపించకుండా తనని బిగ్ బాస్ టీం కావాలని నెగటివ్ గా చూపించారని, 30 ఏళ్లుగా నేను కష్టపడి సంపాదించుకున్న పేరుని నాశనం చేసారని, నాగార్జున కి హోస్టింగ్ చేయడం రాలేదని ఇలా ఎన్నో మాటలను మాట్లాడింది. అయినప్పటికీ కూడా ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం అవకాశం కల్పించిందని సోషల్ మీడియా లో గత కోద్దీరోజులుగా ఒక ప్రచారం సాగుతుంది. సోనియా నెగటివ్ అయినప్పటికీ కూడా, బోలెడంత కంటెంట్ ఇస్తుండడంతో బిగ్ బాస్ టీం ఆమెని మళ్ళీ హౌస్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని టాక్.

    కానీ బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ఆమె రెమ్యూనరేషన్ భారీ గా డిమాండ్ చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు. ఆమె హౌస్ లోకి మొదటిసారి ఎంట్రీ ఇచ్చినప్పుడు వారానికి 3 లక్షల రూపాయిలు ఇవ్వడానికి బిగ్ బాస్ టీం అంగీకరించింది. కానీ ఇప్పుడు రీ ఎంట్రీ కోసం ఆమె దాదాపుగా వారానికి 4 లక్షల 50 వేల రూపాయిలను డిమాండ్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. దీంతో బిగ్ బాస్ టీం పునరాలోచనలో పడ్డారట. ఎందుకంటే ఈ సీజన్ లో అసలు సిసలు ట్విస్టులు, సరైన టాస్కులు ఈ వారం నుండే మొదలు కాబోతున్నాయి. వాటికి మంచి రెస్పాన్స్ వస్తే 119 రోజుల పాటు ఈ సీజన్ ని కొనసాగించే ఆలోచనలో ఉన్నారట బిగ్ బాస్ టీం. అందుకే భారీ రెమ్యూనరేషన్స్ ని చెల్లించి, పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్స్ లాగా తీసుకొచ్చారు.

    వాళ్ళకే బడ్జెట్ భారీగా పెరిగిపోయింది, ఇప్పుడు సోనియా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే ఈ సీజన్ బడ్జెట్ లిమిట్ దాటిపోతుందని బిగ్ బాస్ టీం భావించిందట. దీంతో నిన్న మొన్నటి వరకు కచ్చితంగా సోనియా రీ ఎంట్రీ ఉంటుందని బలంగా వినిపించిన వార్త ఇప్పుడు వినపడడం లేదు. దీనిపై క్లారిటీ ఈ వారం లోనే రాబోతుంది. ఈ వీకెండ్ ఎపిసోడ్ లో డబుల్ ఎలిమినేషన్ ని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఒకవేళ సోనియా రీ ఎంట్రీ ఉంటే కచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, లేకపోతే కేవలం ఒక్కరే ఎలిమినేట్ అవుతారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఈ వీకెండ్ ఎపిసోడ్ ద్వారానే ఆమె హౌస్ లోకి వస్తుంది. సోనియా హౌస్ లోకి అడుగుపెడితే కచ్చితంగా అనేక సమీకరణాలు మారిపోతాయి, కంటెంట్ కావాల్సినంత వచ్చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో కూడా ఆమె రీ ఎంట్రీ పై పరోక్షంగా హింట్స్ రీసెంట్ గానే ఇచ్చింది. చూడాలి మరి ఈ వీకెండ్ ఏమి జరగబోతుంది అనేది.