Bigg Boss Telugu 8: నభీల్ కి దారుణమైన శిక్ష విధించిన బిగ్ బాస్.. ఇక సీజన్ మొత్తం అవి లేకుండా ఉండాల్సిందే!

ఈ సీజన్ మొత్తం నభీల్ హౌస్ లో ఉన్నన్ని రోజులు స్వీట్స్, చాక్లెట్స్ వంటివి తినకూడదు, జ్యూస్ త్రాగకూడదు, అలాగే హౌస్ లో లభించే ఏ లగ్జరీ ఫుడ్ ని కూడా నభీల్ తినేందుకు వీలు లేదు అని అంటాడు బిగ్ బాస్. తన కోసం కాకుండా హౌస్ మేట్స్ అందరి కోసం అలోచించి సీజన్ మొత్తం ఇలాంటి శిక్ష తీసుకున్నదంటే నభీల్ జనాల దృష్టిలో ఏ రేంజ్ కి ఎడిపోయాడో ఊహించుకోవచ్చు.

Written By: Vicky, Updated On : October 15, 2024 7:43 am

Bigg Boss Telugu 8(112)

Follow us on

Bigg Boss Telugu 8: నేటి ఎపిసోడ్ నభీల్ గ్రాఫ్ ని ఆకాశం అంత ఎత్తుకి తీసుకెళ్లబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిన్న జరిగిన నామినేషన్స్ కేవలం సగం మాత్రమే, నేటి ఎపిసోడ్ లో మిగతా సగం నామినేషన్స్ ని టెలికాస్ట్ చేస్తారు. నిన్న ఎపిసోడ్ అయ్యాక చివర్లో వేసిన ప్రోమోలో నభీల్, గౌతమ్ కి మధ్య పెద్ద గొడవ జరగడం మీరంతా గమనించే ఉంటారు. తన సేఫ్ గేమ్ ఆడుతున్నడని నభీల్ అనడంతో మనస్తాపానికి గురైన గౌతమ్, నభీల్ కి నామినేషన్ వేస్తాడు. అప్పుడు నభీల్ దానిని వాదిస్తుండగా, గౌతమ్ ‘నేను ఎక్కడ సేఫ్ గేమ్ ఆడానో చెప్పు’ అంటూ గట్టిగా అరుస్తాడు. దానికి నభీల్ కూడా ‘ఓయ్’ అంటూ గొంతు బాగా పైకి లేపుతాడు. వాస్తవానికి గౌతమ్ నిజంగానే సేఫ్ గేమ్ ఆడాడు. బాల్స్ టాస్క్ లో హరితేజ మణికంఠ ని టార్గెట్ చేయమని గౌతమ్ కి చెప్తుంది. కానీ గౌతమ్ వాడికి బయట ఇప్పటికే సానుభూతి పెరిగిపోయింది, ఇప్పుడు నేను వాడిని టార్గెట్ చేస్తే, పెద్ద రాద్ధాంతం చేసి, సీన్ క్రియేట్ చేసి మళ్ళీ సానుభూతి పొందుతాడు అని చెప్తాడు.

ఆ తర్వాత గేమ్ ఆడే ముందు నాకు ఎవరి మీద బాల్స్ వేయాలని లేదు, ఈ గేమ్ నేను ఆడను అని కెమెరాలకు చెప్తాడు. మణికంఠ ని టార్గెట్ చేయకపోతే, తన సొంత క్లాన్ లో ఉన్న వాళ్లపై టార్గెట్ చేయాలి, అలా చేస్తే సొంత క్లాన్ కి వెన్నుపోటు పొడిచాడు లాంటి ట్యాగ్ వస్తుంది అని భయపడి అసలు గేమ్ ఆడకుండా సైలెంట్ గా కూర్చున్నాడు. ఇది కచ్చితంగా సేఫ్ గేమ్, నభీల్ దీనిని బయట పెట్టి గౌతమ్ పరువు తీస్తాడు. ఈ నామినేషన్ బ్లాక్ మొత్తం నభీల్ కి సూపర్ పాజిటివ్ అయ్యింది. ఇక ఆ తర్వాత నభీల్ కి బిగ్ బాస్ ఒక దారుణమైన శిక్ష విధిస్తాడు. వీకెండ్ ఎపిసోడ్ లో నభీల్ ని ఇన్ఫినిటీ రూమ్ లోకి పిలిచి నీకు కావాల్సిన కోరిక కోరుకోమని, అది హౌస్ కోసమైనా, నీ కోసమైనా అవ్వొచ్చు, నీ ఇష్టం అని, దానికి మూల్యంగా ఏమి చెల్లించాలో బిగ్ బాస్ చెప్తాడు అని చెప్తాడు నాగార్జున. నభీల్ హౌస్ మేట్స్ అందరికీ అన్ లిమిటెడ్ ఫుడ్ కావాలని అంటాడు. నాగార్జున అందుకు ఒప్పుకుంటాడు. అయితే ఈ కోరికకు మూల్యంగా బిగ్ బాస్ నభీల్ కి పెద్ద శిక్ష విధించాడు.

అదేమిటంటే ఈ సీజన్ మొత్తం నభీల్ హౌస్ లో ఉన్నన్ని రోజులు స్వీట్స్, చాక్లెట్స్ వంటివి తినకూడదు, జ్యూస్ త్రాగకూడదు, అలాగే హౌస్ లో లభించే ఏ లగ్జరీ ఫుడ్ ని కూడా నభీల్ తినేందుకు వీలు లేదు అని అంటాడు బిగ్ బాస్. తన కోసం కాకుండా హౌస్ మేట్స్ అందరి కోసం అలోచించి సీజన్ మొత్తం ఇలాంటి శిక్ష తీసుకున్నదంటే నభీల్ జనాల దృష్టిలో ఏ రేంజ్ కి ఎడిపోయాడో ఊహించుకోవచ్చు. ప్రేరణ మీద ఆయన పగ తగ్గించుకుంటే టైటిల్ విన్నర్ అతనే అవ్వొచ్చు, ఎందుకంటే నిఖిల్ గేమ్ మొత్తం పడిపోయింది, నిన్నటి నామినేషన్స్ ఎపిసోడ్ లో కూడా ఆయన పాయింట్స్ తేలిపోయాయి, దీంతో ఆయన మూడవ స్థానానికి పడిపోయాడు, కాబట్టి నభీల్ కి టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.