https://oktelugu.com/

Bigg Boss Telugu 8: సంచాలక్ గా యష్మీ ఫెయిల్ అయ్యిందా..విష్ణుప్రియ కష్టం మొత్తం బూడిదపాలు అయిందిగా!

తాళాలు వివిధ స్థానాల్లో పెడుతాడు బిగ్ బాస్. ముందుగా గోడ ఉంటుంది. ఆ గోడని బద్దలు కొట్టి ఒక తాళం అందుకోవాలి, ఆ తర్వాత హౌస్ లోపల యాక్షన్ రూమ్ లో కుండలు ఉంటాయి. వాటిని బద్దలు కొడితే అందులో కూడా ఒక తాళం ఉంటుంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 7, 2024 / 08:41 AM IST

    Bigg Boss Telugu 8(208)

    Follow us on

    Bigg Boss Telugu 8: నిన్న జరిగిన కీ టాస్క్ లో పృథ్వీ, విష్ణు ప్రియ ఎంత చక్కగా ఆడారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా విష్ణు ప్రియ అయితే చాలా ఫైర్ తో ఆడింది. కానీ ఆమె కష్టానికి తగ్గ ఫలితం యష్మీ కారణంగా దక్కలేదు. సంచాలక్ గా యష్మీ మరోసారి వైఫల్యం అయ్యిందా?, కావాలని ఆమె ఉద్దేశపూర్వకంగానే విష్ణు ని ఓడించి పృథ్వీ గెలిపించిందా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. టాస్క్ వివరాల్లోకి వెళ్తే మూడు గడ్డితో నింపి తాళాలు వేసి ఉన్న బాక్సులు ఉంటాయి. ఆ బాక్సులలో కంటెండర్ అనే బోర్డు ఉంటుంది. ఎవరైతే ఆ బాక్సులు ఓపెన్ చేసి కంటెండర్ బోర్డుని అందుకుంటారో వాళ్ళు రేస్ లో ముందుకెళ్తారు. తాళాలు వివిధ స్థానాల్లో పెడుతాడు బిగ్ బాస్. ముందుగా గోడ ఉంటుంది. ఆ గోడని బద్దలు కొట్టి ఒక తాళం అందుకోవాలి, ఆ తర్వాత హౌస్ లోపల యాక్షన్ రూమ్ లో కుండలు ఉంటాయి. వాటిని బద్దలు కొడితే అందులో కూడా ఒక తాళం ఉంటుంది.

    ఇక చివరికి ఇసుక బాక్స్ లు ఉంటాయి, అందులో కూడా ఒక తాళం ఉంటుంది. వీటిలో ముఖ్యంగా కుండలో ఉండే తాళాలను వెతికి పట్టుకోవడం కష్టం. ఇక్కడ పృథ్వీ విష్ణుప్రియ ని తెలివిగా బోల్తా కొట్టిస్తాడు. రూల్స్ ప్రకారం ఒక తాళం పనిచేయకపోతే, ఆ తాళాన్ని గార్డెన్ వద్దనే పారేయాలి, కానీ పృథ్వీ తానూ ఓపెన్ చేసిన బాక్స్ కి సంబంధించిన తాళాన్ని తనతో పాటు యాక్షన్ రూమ్ లోకి తీసుకెళ్లి విష్ణు ప్రియ కి కనపడే విధంగా పడేస్తాడు. యష్మీ తో పాటు మరో సంచాలక్ గా వ్యవహరిస్తున్న నభీల్ నాకు తాళం కనిపించింది అనగానే విష్ణు ప్రియ పృథ్వీ పడేసిన తాళాన్ని తీసుకొని బాక్స్ తెరిచేందుకు గార్డెన్ ప్రాంతానికి పరుగులు తీసింది. పాపం అక్కడ ఆమె చాలాసేపటి వరకు బాక్స్ లు తెరవడానికి ప్రయత్నం చేసినా ఒక్కటి కూడా తెరుచుకోదు, ఎందుకంటే అది అప్పటికే ఉపయోగించిన తాళం కాబట్టి. ఇలా విష్ణు ని తెలివైన స్ట్రాటజీ తో బురిడీ కొట్టించాడు పృథ్వీ.

    ఆ తర్వాత విష్ణు మళ్ళీ లోపలకు వెళ్లి తాళాలను వెతుకుతుంది. అప్పుడే సంచాలక్ యష్మీ కూడా లోపలకు వస్తుంది. ఆమె తాళాలు కనిపించడంతో, ఇక్కడ తాళాలు ఉన్నాయి అని ఇద్దరికీ హింట్ ఇస్తుంది. విష్ణు ఎక్కడా అని చూస్తుండగా, పృథ్వీ యష్మీ కళ్ళను చూసి తాళాలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి తీసుకొని వెళ్ళాడు. గార్డెన్ ప్రాంతం లో ఆ బాక్స్ తెరవగానే అందులో కంటెండర్ బోర్డు ఉంటుంది, అలా పృథ్వీ తన కంటెండర్ షిప్ ని పదిలపర్చుకున్నాడు. అయితే ఇక్కడ యష్మీ చేసిన పొరపాటు ఏమిటి అంటే, ఇద్దరికీ తాళాలు నాకు కనిపించాయి అని హింట్ ఇవ్వడమే. సంచాలక్ గా అది ఆమె డ్యూటీ కాదు, అనవసరంగా ఆమె ఆ హింట్ ఇవ్వడం వల్ల పృథ్వీ పసిగట్టి టాస్క్ గెలిచేసాడు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా యష్మీ చేయకపోయినా, రోహిణి, టేస్టీ తేజ మాత్రం విష్ణు కి లేనిపోనివి ఎక్కించేసారు.