https://oktelugu.com/

Devi Sri Prasad: ‘పుష్ప 2 : ది రూల్’ నుండి దేవిశ్రీ ప్రసాద్ అవుట్..డైరెక్టర్ సుకుమార్ తో విబేధాలు..అసలు ఏమైందంటే!

నాన్నకు ప్రేమతో సినిమా విడుదలకు రెండు రోజుల ముందు కూడా ఆయన షూటింగ్ చేస్తూనే ఉన్నాడు. పుష్ప పార్ట్ 1 కూడా ఇంతే, చివరి నిమిషం వరకు పని పూర్తి అవ్వలేదు. దీంతో గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తి అవ్వని కంటెంట్ తోనే విడుదల చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 7, 2024 / 08:38 AM IST

    Devi Sri Prasad

    Follow us on

    Devi Sri Prasad: అభిమానులతో పాటు కోట్లాది మంది సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ సినిమాలలో ఒకటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : రూల్’. ఆగష్టు 15 న విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం బోలెడంత వర్క్ పెండింగ్ లో ఉండడంతో డిసెంబర్ 6 కి వాయిదా వేశారు. ఆ తర్వాత నిర్మాతలు ఒకరోజు ముందుకి ఈ సినిమాని జరిపి డిసెంబర్ 5 న విడుదల చేయబోతున్నట్టు రీసెంట్ గానే అధికారిక ప్రకటన చేసారు. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. ఐటెం సాంగ్ ని వచ్చే వారం షూటింగ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. అయితే సుకుమార్ కి ఎందుకో ఈ క్లైమాక్స్ నచ్చలేదట, దానిని రీ షూట్ చేయాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. ప్రొమోషన్స్ కి సిద్ధం అవుతున్న సమయంలో ఈ రీ షూట్స్ ఏంటి అని నిర్మాతలతో పాటు, అల్లు అర్జున్ కూడా సుకుమార్ మీద అసహనం చూపించారట, కానీ సుకుమార్ మాత్రం అసలు తగ్గడం లేదు, రీ షూట్ చేయాల్సిందే అని పట్టుబడుతున్నాడట.

    ఇది ఆయనకి కొత్తేమి కాదు, నాన్నకు ప్రేమతో సినిమా విడుదలకు రెండు రోజుల ముందు కూడా ఆయన షూటింగ్ చేస్తూనే ఉన్నాడు. పుష్ప పార్ట్ 1 కూడా ఇంతే, చివరి నిమిషం వరకు పని పూర్తి అవ్వలేదు. దీంతో గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తి అవ్వని కంటెంట్ తోనే విడుదల చేసారు. ఈ సినిమాకి మొదట్లో నెగటివ్ టాక్ రావడానికి కారణాలలో ఇది కూడా ఒకటి. ఇప్పుడు ‘పుష్ప 2’ విషయంలో కూడా అదే రిపీట్ చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేసిన దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. ఆయన ఇచ్చిన పాటలే తీసుకుంటున్నారు కానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి మాత్రం ఆయన్ని ఈ సినిమా నుండి తప్పించేశారట. కారణం దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఒక్క బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్ కూడా సుకుమార్ కి నచ్చకపోవడమే.

    అంతే కాకుండా ఆయన సరైన సమయానికి పని పూర్తి చేయట్లేదట. దీంతో తీవ్రమైన అసహనంపై గురైన సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ ని తప్పించి , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం థమన్ ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ తో సుకుమార్ కి ఉన్న బంధం ఇప్పటిది కాదు. ఆర్య సినిమా తో మొదలైన వీళ్లిద్దరి సినీ ప్రయాణం ‘పుష్ప2’ వరకు చేరింది. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఫలితాలతో తో సంబంధం లేకుండా ఆడియో పరంగా బంపర్ హిట్ అయ్యాయి. అలాంటి కాంబినేషన్ కి ఇక తెరపడినట్టేనా అంటే అవుననే చెప్పొచ్చు. ఒక ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ సినిమా నుండి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తనని తప్పించి, థమన్ ని తీసుకోవడం అంటే కచ్చితంగా దేవిశ్రీప్రసాద్ ని అవమానించినట్టే కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఈసారి దేవిశ్రీ ప్రసాద్ రాకపోవచ్చు. సరిగ్గా సినిమాకి నెల రోజుల ముందు ఈ మార్పు కచ్చితంగా ఫైనల్ ఔట్పుట్ మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. నెల రోజుల లోపు థమన్ అయినా ‘ది బెస్ట్’ బ్యాక్ గ్రౌండ్స్ ట్రాక్స్ ఎలా ఇవ్వగలడు చెప్పండి!..రాధే శ్యామ్ కి కూడా చివరి నిమిషం లో ఇలాగే చేసారు, ఫలితం ఏమిటో మన అందరికీ తెలిసిందే, ఇప్పుడు ‘పుష్ప 2’ కూడా అలాంటి సందర్భమే రిపీట్ అయ్యింది, మరి ఫలితం రిపీట్ అవుతుందో లేదో చూడాలి.