Bigg Boss Telugu 8 : పాత్రికేయుడు అంటే రాయాలి. విషయం లోతుల్లోకి వెళ్లాలి. తనకు తెలిసిన సమాచారాన్ని క్రోడీకరించుకొని.. ఉన్న విషయంలో నిజాన్ని మాత్రమే చెప్పగలగాలి. నేటి సోషల్ మీడియా రోజుల్లో ఇలాంటి లక్షణాలు చాలామంది పాత్రికేయులకు లేకున్నప్పటికీ.. ఉన్నవారిలో కొద్దో గొప్పో రాసేవారు ఉన్నారు. అలాంటివారిని అభినందించాలి. ప్రోత్సహించాలి. అంతేతప్ప రాసింది తప్పు.. రాయడమే తప్పు.. అనే ఏడుపు గొట్టు రాతలు రాయకూడదు. కౌంటర్లు అసలే ఇవ్వకూడదు.
స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ మొదలైంది. ఆదివారం కంటెస్టెంట్లను హీరో నాగార్జున పరిచయం చేస్తూ షో మొదలుపెట్టాడు. ఒక్కొక్కరి గురించి వివరించుకుంటూ వెళ్లిపోయాడు. మా టీవీ చూస్తున్నవారికి, హాట్ స్టార్ లో వీక్షిస్తున్న వారికి కంటెస్టెంట్ ల గురించి తెలుస్తుంది. మరి ఆ షో మిస్ అయినవారి సంగతేంటి.. స్మార్ట్ ఫోన్ లో హాట్ స్టార్ యాప్ లేనివారి సంగతేంటి.. అలాంటి వారి బాధను తీర్చేందుకు..వెబ్ సైట్ లు బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి రాసుకుంటూ వచ్చాయి. వారికి తెలిసిన విషయాలకు కాస్త మసాలా జోడించి పబ్లిష్ చేశాయి. ఇందులో ఓకే తెలుగు అనే వెబ్ సైట్ కూడా ఉంది. పైగా నిన్న బిగ్ బాస్ ట్రెండింగ్ లో కొనసాగింది. వెబ్ సైట్ లకు గూగుల్ ఆదాయమే ప్రధాన వనరు. గూగుల్ ట్రెండ్స్ లో ఉన్న విషయాలకే వ్యూయర్ షిప్ లభిస్తుంది. అందువల్లే చాలా వరకు వెబ్ సైట్ లు బిగ్ బాస్ షో కు ప్రాధాన్యం ఇచ్చాయి. కేవలం వెబ్ మీడియా మాత్రమే కాదు, ప్రధాన మీడియా కూడా బిగ్ బాస్ షో ప్రారంభ వార్తలకు ప్రయారిటీ ఇచ్చింది.. షో మొదలైంది కాబట్టి ప్రేక్షకులకు కంటెస్టెంట్ ల గురించి మరింత లోతైన విషయాలు తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది.. ఇందులో తప్పు పట్టడానికి కూడా ఏమీ లేదు. కాకపోతే వెబ్ సైట్ లలో ఇలాంటి విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఇది ఓ వెబ్ సైట్ నిర్వాహకుడికి తప్పుగా అనిపించింది. ‘‘ఓకే తెలుగు’’ రాసిన ఒక కంటెంట్ స్క్రీన్ షాట్ తీసి.. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి.. తన ఏడుపును అందులో ప్రదర్శించాడు.
రంధ్రాన్వేషణ
సహజంగానే ఆ వెబ్సైట్ నిర్వాహకుడు ప్రతి దాన్ని సూక్ష్మంగా చూస్తాడు. రంధ్రాన్వేషణ చేస్తాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రతి దాన్ని నెగెటివిటీ కోణంలో చూసే క్యారెక్టర్ అతడిది. వాస్తవానికి ఒక పాత్రికేయుడికి అలాంటి లక్షణాలు కచ్చితంగా ఉండాలి. కానీ, ఎదుటి వాళ్ళు రాసింది మొత్తం తప్పు అనడమే ఇక్కడ పెద్ద తప్పు. ఒకవేళ అది తప్పు అనుకున్నప్పుడు.. నిజమేమిటో చెప్పాలి కదా. ఒప్పు ఏమిటో వివరించాలి కదా.. అలాంటి ప్రయత్నం చేయనప్పుడు ఎదుటివారి రాతల మీద ఏడవడం దేనికి. పైగా ‘‘ఓకే తెలుగు’’ రాసిన దాంట్లో తప్పు లేదు. మణికంఠ అనే కంటెస్టెంట్ జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రధానంగా వివరిస్తూ ఆ కథనాన్ని పబ్లిష్ చేసింది. ఆ కథనానికి హైయెస్ట్ వ్యూయర్షిప్ కూడా లభించింది .. అందులో వాస్తవం ఉంటేనే కదా ఆ స్థాయిలో వ్యూయర్షిప్ వచ్చింది. ఆ మాత్రం సోయిలేని ఆ వెబ్సైట్ నిర్వాహకుడు తన ఏడుపును మొత్తం అక్కడే ప్రదర్శించాడు.. ఇలాంటివారు రాయలేరు. రాసిన వాళ్లను ఓర్వలేరు. పైగా వాళ్ల మీద పడి ఏడుస్తుంటారు..
సాధారణ జర్నలిజం లాగా ఉండదు
వెబ్ జర్నలిజంలో కంటెంట్ కు ఎంత విలువ ఉంటుందో.. కంటెంట్ క్రియేట్ చేసేవారికి కూడా అంతే విలువ ఉంటుంది. పైగా వెబ్ జర్నలిజం అనేది సాధారణ జర్నలిజం లాగా ఉండదు. అందుకే సాధారణ జర్నలిజం చేసిన వారు.. వెబ్ జర్నలిజంలో రాణించలేరు. అయితే ఆ వెబ్సైట్ నిర్వాహకుడు సాధారణ జర్నలిజం నుంచి వచ్చినట్టున్నాడు. అందుకే ఇలాంటి ఏడుపుగొట్టు రాతలు రాస్తున్నాడు.. విషయ పరిజ్ఞానం లేనప్పుడు.. విషయం మీద అవగాహన లేనప్పుడు.. విషయం రాసే వాళ్ళ మీద గౌరవం లేనప్పుడు ఇలాంటి ఏడుపు గొట్టు ప్రతిస్పందనలే వ్యక్తం అవుతుంటాయి. పాపం ఆ వెబ్సైట్ నిర్వాహకుడు కూడా ఈ ఏడుపు గొట్టు బాపతు కాబట్టి.. అలాంటి ఏడుపులనే ప్రదర్శిస్తున్నాడు. ఇలాంటి వాళ్ల ఏడుపుల వల్ల ‘‘ఓకే తెలుగు’’ వచ్చిన ఇబ్బంది లేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళ ఏడుపులే మాకు శ్రీరామరక్ష. అర్థమైన వాళ్లకు అర్థం చేసుకున్నంత.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Bigg boss telugu 8 counter to top website editor who criticized ok telugu analysis
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com