https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ 8′ బడ్జెట్ 75 కోట్లు..కానీ నాలుగు వారాల్లో వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ప్రతీ సీజన్ కి బిగ్ బాస్ నిర్వాహకులు బడ్జెట్ విషయం లో అసలు వెనకడుగు వేసేవారు కాదు. కానీ ఈ సీజన్ లో మాత్రం బడ్జెట్ విషయం లో చాలా లిమిటెడ్ గా పోతున్నారు. కారణం కంటెస్టెంట్స్ కి భారీ మొత్తం లో రెమ్యూనరేషన్స్ ఇవ్వడం వల్లే అని అంటున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 29, 2024 / 08:53 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 :  హిందీ బిగ్ బాస్ తర్వాత ఇండియా లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చింది మన తెలుగు బిగ్ బాస్ కి మాత్రమే. ఈ కాన్సెప్ట్ మనకి కొత్త కాబట్టి మొదటి సీజన్ సమయం లో ఆడియన్స్ కి పెద్దగా అర్థం అయ్యేది కాదు. ఆ తర్వాత ఎపిసోడ్స్ గడిచేకొద్దీ ఈ ఆసక్తిగా చూడడం మానేశారు. ఎన్టీఆర్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హోస్టింగ్ చేయడం వల్ల కూడా ఆడియన్స్ ఆ రియాలిటీ షో కి బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. అలా సీజన్ 1 సూపర్ హిట్ అవ్వడం, ఆ తర్వాత వచ్చిన ప్రతీ సీజన్ ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ రావడం తో 7 సీజన్లు పూర్తి చేసుకొని ఇప్పుడు 8 వ సీజన్ లోకి అడుగుపెట్టింది. అయితే ప్రతీ సీజన్ కి బిగ్ బాస్ నిర్వాహకులు బడ్జెట్ విషయం లో అసలు వెనకడుగు వేసేవారు కాదు. కానీ ఈ సీజన్ లో మాత్రం బడ్జెట్ విషయం లో చాలా లిమిటెడ్ గా పోతున్నారు. కారణం కంటెస్టెంట్స్ కి భారీ మొత్తం లో రెమ్యూనరేషన్స్ ఇవ్వడం వల్లే అని అంటున్నారు.

    ఈ సీజన్ మొత్తానికి 75 కోట్ల రూపాయిల బడ్జెట్ ని అనుకున్నారట. ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. గత సీజన్ కోసం 125 కోట్ల రూపాయిల బడ్జెట్ ని కేటాయించారు. ఈ రియాలిటీ షో నడపడానికి వందల మంది పని చేస్తూ ఉంటారు. ఒక్క పీసీఆర్ టీం ని మైంటైన్ చేసేందుకే బిగ్ బాస్ యాజమాన్యం కి 10 కోట్ల రూపాయిల ఖర్చు అవుతుందట. ఇక హోస్ట్ గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జునకు సీజన్ మొత్తానికి కలిపి 15 నుండి 20 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తారట. ఇక హౌస్ లోపల కంటెస్టెంట్స్ కి అవసరమయ్యే ఆహారం, వాళ్ళ కోసం డిజైన్ చేసే టాస్కులు, వాటిని ఎడిటింగ్ చేసే టీం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇలా అన్నిటికి కలుపుకొని 75 కోట్ల రూపాయిలు ఈ సీజన్ కి ఖర్చు చేశారట.

    టీవీ టెలికాస్ట్ లో మధ్యలో వచ్చే ప్రముఖ బ్రాండ్ కంపెనీల ద్వారా వచ్చే యాడ్స్ తో పాటుగా, హాట్ స్టార్ లైవ్ టెలికాస్ట్ ద్వారా ఈ సీజన్ లో కేవలం నాలుగు వారాల్లోనే 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్టు తెలుస్తుంది. వచ్చే వారం వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయి. అప్పటి నుండి సీజన్ మరింత రసవత్తరంగా సాగుతుంది. కాబట్టి ఓవరాల్ గా సీజన్ ముగిసే సమయానికి 400 కోట్ల రూపాయిలు టీవీ + డిజిటల్ టెలికాస్ట్ ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇది బిగ్ బాస్ సీజన్ 7 కంటే బంపర్ లాభాలు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి రాబోయే రోజుల్లో టాస్కులు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో, ఆడియన్స్ కి ఏ స్థాయి ఎంటర్టైన్మెంట్ అందబోతుందో చూడాలి.