https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ 8 ప్రేక్షకులకు పండుగ లాంటి వార్త..సంబరాల్లో హౌస్ మేట్స్..ఇక ప్రశాంతంగా ఉండొచ్చు!

గత వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఈమెను ప్రేక్షకులు చాలా కసిగా ఆమె ఎలిమినేట్ అయ్యేందుకు ఎలాంటి పనులు చేయాలో, అలాంటి పనులు చేసి ఎట్టకేలకు ఆమెని బయటకి పంపారు. సోనియా ఎలిమినేషన్ నిఖిల్ ఫ్యాన్స్ కి ఒక పండగే అని చెప్పొచ్చు. ఈమెతో హౌస్ లో విడదీయలేని బంధం పెట్టుకున్నాడు నిఖిల్.

Written By:
  • Vicky
  • , Updated On : September 29, 2024 / 08:46 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 :  బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మరియు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన క్షణం ఎట్టకేలకు రానే వచ్చింది. కంటెస్టెంట్స్ మీద నోరు పారేసుకుంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం, హౌస్ లో చాకు లాంటి కుర్రాళ్లను తనకు బానిసలు లాగా చేసుకొని గేమ్ ఆడుతూ వాళ్ళ గ్రాఫ్ ని రోజురోజుకు తగ్గించుకుంటూ పోవడం, ఇలా ఒక్కటా రెండా భూతద్దం వేసి వెతికినా ఒక్క మంచి లక్షణం కూడా కనిపించని కంటెస్టెంట్ సోనియా ఎట్టకేలకు బిగ్ బాస్ ని వదిలేసింది. గత వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఈమెను ప్రేక్షకులు చాలా కసిగా ఆమె ఎలిమినేట్ అయ్యేందుకు ఎలాంటి పనులు చేయాలో, అలాంటి పనులు చేసి ఎట్టకేలకు ఆమెని బయటకి పంపారు. సోనియా ఎలిమినేషన్ నిఖిల్ ఫ్యాన్స్ కి ఒక పండగే అని చెప్పొచ్చు. ఈమెతో హౌస్ లో విడదీయలేని బంధం పెట్టుకున్నాడు నిఖిల్.

    అందువల్ల ఆమె ఎలా చెప్తే అలా చేసేవాడు. పేరుకు చీఫ్ కానీ, నిర్ణయాలు మొత్తం సోనియావే. అవతల క్లాన్ లో కంటెస్టెంట్స్ అందరికీ సరిసమానంగా టాస్కులు ఆడే అవకాశాలు వచ్చేవి. కానీ నిఖిల్ క్లాన్ లో కేవలం నిఖిల్, సోనియా,పృథ్వీ కి తప్ప ఎవరికీ కూడా టాస్కులు ఆడే అవకాశాలు కలగలేదు. అలా మిగిలిన వాళ్ళను తొక్కిపారేసేందుకు ప్రయత్నం చేసేది సోనియా. దీని వల్ల నిఖిల్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరికీ దూరం అయ్యాడు. ఎవరూ కూడా ఇతని క్లాన్ లోకి రావడానికి ఇష్టపడలేదు. వేరే గత్యంతరం లేక అతని క్లాన్ లోకి వెళ్లాల్సిన వచ్చిన కంటెస్టెంట్స్ ‘అబ్బా! వీడి క్లాన్ లోకి పోవాలా?..ఏమి పాపం చేసాము రా బాబు!’ అని అనుకుంటూ వచ్చిన వారే. టైటిల్ విన్నర్ అయ్యేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్న నిఖిల్ రోజురోజుకి దిగజారిపోతుండడం ఆయన అభిమానులకు కూడా నచ్చలేదు. సోనియా ఎలిమినేట్ అవ్వాలని బలంగా కోరుకున్నారు. ఏ దేవుడికి మొక్కుకున్నారో తెలియదు కానీ సోనియా ఎట్టకేలకు ఎలిమినేట్ అయ్యింది. అయితే సోనియా అక్కని బిగ్ బాస్ టీం వారు అంత తేలికగా పంపించరు, ఎదో ఒక మెలిక పెడతారేమో అని మనకి ఎదో ఒక మూల అనిపించి ఉండొచ్చు,అది నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎలిమినేషన్ రౌండ్ లోకి మణికంఠ, సోనియా వస్తారు. హౌస్ లో కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా సోనియా ఎలిమినేషన్ జరిగిందని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం. అంటే ఆమెను సీక్రెట్ రూమ్ లోకి పంపే అవకాశం ఉంది, అలాగే వచ్చే వారం వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా మళ్ళీ ఆమె చేత రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. నామినేషన్స్ లో అందరికంటే తక్కువ ఓటింగ్ వచ్చింది మాత్రం సోనియా కి మాత్రమే. కానీ ఆమె నుండి బోలెడంత కంటెంట్ రావడం తో బిగ్ బాస్ టీం ఇలాంటి ప్లాన్ వేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి అయితే ఆమె ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకి వెళ్ళిపోయింది, దీనికి ప్రేక్షకులు సంబరాలు చేసుకోవచ్చు.