https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ‘గంగవ్వ’ కి గుండెపోటు రావడానికి కారణాలు ఇవేనా..రేటింగ్స్ కోసం బిగ్ బాస్ టీం ఇంతలా దిగజారిపోయిందా!

ఈ సీజన్ లో మాత్రం నామినేషన్ ఎపిసోడ్స్ ని చూస్తే నవ్వు రాక తప్పదు. ఎందుకంటే ఎవరి దగ్గర కూడా పాయింట్స్ దొరకడం లేదు. కంటెస్టెంట్స్ నుండి ఏదైనా కంటెంట్ వస్తేనే కదా పాయింట్స్ దొరకడానికి. ఇలా ప్రతీ వారం ఈ సీజన్ గ్రాఫ్ ని తగ్గించుకుంటూ సీజన్ 6 కంటే పెద్ద డిజాస్టర్ సీజన్ అయ్యే దిశగా అడుగులు వేస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 22, 2024 / 03:59 PM IST

    Bigg Boss Telugu 8(145)

    Follow us on

    Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 దాదాపుగా అట్టర్ ఫ్లాప్ అయ్యినట్టే అనుకోవాలి. గత సీజన్ ఎంత దమ్ము గా ఉండిందో, ఏ రేంజ్ టాస్కులు ఉండేవో, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండేదో మన అందరికీ తెలిసిందే. మంచి కంటెంట్ రావడంతో టీఆర్పీ రేటింగ్స్ రికార్డు స్థాయిలో వచ్చింది. అంత పెద్ద సూపర్ హిట్ సీజన్ తర్వాత, కొత్త సీజన్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సీజన్ అసలు ఏమాత్రం నడవట్లేదు. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఊదరగొట్టారు. కానీ కనీస స్థాయి ఎంటర్టైన్మెంట్ కూడా అందడం లేదు. ఇక టాస్కుల కోసం గత సీజన్ లో వాడిన ప్రాపర్టీస్ ని ఉపయోగించి అవే టాస్కులు నిర్వహిస్తున్నారు. ఇక చూసే ఆడియన్స్ కి ఏమి కిక్ ఉంటుంది. గత సీజన్ లో నామినేషన్ ఎపిసోడ్స్ ఒక రేంజ్ లో ఉండేవి.

    ఈ సీజన్ లో మాత్రం నామినేషన్ ఎపిసోడ్స్ ని చూస్తే నవ్వు రాక తప్పదు. ఎందుకంటే ఎవరి దగ్గర కూడా పాయింట్స్ దొరకడం లేదు. కంటెస్టెంట్స్ నుండి ఏదైనా కంటెంట్ వస్తేనే కదా పాయింట్స్ దొరకడానికి. ఇలా ప్రతీ వారం ఈ సీజన్ గ్రాఫ్ ని తగ్గించుకుంటూ సీజన్ 6 కంటే పెద్ద డిజాస్టర్ సీజన్ అయ్యే దిశగా అడుగులు వేస్తుంది. ఇదంతా పక్కన పెడితే టీఆర్ఫీ రేటింగ్స్ పాతాళ లోకంలోకి పడిపోవడంతో, బిగ్ బాస్ టీం ఒక దరిద్రమైన ప్రాంక్ తో మన ముందుకొచ్చింది. గంగవ్వ ని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిపించి ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తాడు. గుండెపోటు వచ్చినట్టు నటించి, హౌస్ మేట్స్ అందరినీ ఫూల్ చేయాలని చెప్తాడు. గంగవ్వ చేస్తుంది, హౌస్ మేట్స్ అందరూ కంగారు పడ్డారు, వాళ్లకు నోటి నుండి మాట రాలేదు. బిగ్ బాస్ హౌస్ లోకి వైద్యులు కూడా వచ్చేసారు. తీరా చూస్తే అదంతా ప్రాంక్ అట.

    ఇలాంటి సున్నితమైన అంశాల మీద ఎవరైనా ప్రాంక్ చేస్తారా అసలు..?, గంగవ్వ ముసలావిడ, ఒకవేళ ఆమెకు నిజంగా గుండెపోటు వచ్చినా హౌస్ మేట్స్ పట్టించుకోని సందర్భం వస్తే ఏమిటి పరిస్థితి?, బిగ్ బాస్ టీం కి బుద్ధి ఉందా అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. విష్ణు ప్రియ అయితే పాపం గంగవ్వ కి తన వల్లే గుండెపోటు వచ్చిందేమో అని ఆమెకి నిజంగా గుండెపోటు వచ్చినంత పని అయ్యింది. ఈ ఎపిసోడ్ ఈరోజు లేదా రేపు టెలికాస్ట్ అవ్వొచ్చు అట. ఇదంతా పక్కన పెడితే నిన్న జరిగిన నామినేషన్స్, ఈరోజు కూడా జరగబోతుంది. ఎప్పుడో రెండవ వారం, మూడవ వారం లో దొరికిన నామినేషన్స్ పాయింట్స్ తోనే ఇప్పటికీ ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటున్నారు. ఇలా పసలేని నామినేషన్స్ కోసం రెండు ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేయడం గమనార్హం. ఇలా అన్ని యాంగిల్స్ లోనూ ఈ సీజన్ డిజాస్టర్ అయ్యింది.