https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: అమర్ ని చితక్కొట్టిన హౌస్ మేట్స్… బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి! వీడియో వైరల్!

శ్రీముఖి ట్రూత్ ఆర్ డేర్ కూడా ఆడించింది. ఈ గేమ్ లో అశ్విని శ్రీని పెళ్లి చేసుకుంటానని యావర్ చెప్పడంతో కంటెస్టెంట్స్ గట్టిగా నవ్వేశారు. యావర్ సిగ్గుతో మెలికలు తిరిగాడు.

Written By:
  • NARESH
  • , Updated On : December 16, 2023 / 04:58 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ప్రేక్షకులు ఫినాలే మూడ్ లో ఉన్నారు. విన్నర్ ఎవరంటే ఉత్కంఠ నడుస్తుంది. కంటెస్టెంట్స్ మాత్రం టెన్షన్ వదిలేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కారణం శనివారం నాడు కంటెస్టెంట్స్ మధ్య ఫన్నీ గేమ్స్ నిర్వహిస్తున్నాడు బిగ్ బాస్. స్టార్ యాంకర్ శ్రీముఖి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె త్వరలో ప్రారంభం కానున్న స్టార్ సింగర్ షోని ప్రోమోట్ చేసింది. కంటెస్టెంట్స్ కి సింగింగ్ ఆడిషన్స్ నిర్వహించింది. ఇది ఫన్నీ టాస్క్ ప్రశాంత్, ఇందులో నువ్వు గెలిస్తే హగ్ ఇస్తా? ఓడిపోతే టైట్ హగ్ ఇస్తా? అని క్రేజీ ఆఫర్ ఇచ్చింది.

    శ్రీముఖి ట్రూత్ ఆర్ డేర్ కూడా ఆడించింది. ఈ గేమ్ లో అశ్విని శ్రీని పెళ్లి చేసుకుంటానని యావర్ చెప్పడంతో కంటెస్టెంట్స్ గట్టిగా నవ్వేశారు. యావర్ సిగ్గుతో మెలికలు తిరిగాడు. అలాగే శ్రీముఖి కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడించి హౌస్ వీడింది. ఇంకా నేటి ఎపిసోడ్లో క్యారెక్టర్స్ ఛేంజ్ గేమ్ కూడా ఆడించాడు బిగ్ బాస్. హౌస్లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల్లో ఉన్న కంటెస్టెంట్స్ ని ఇతర కంటెస్టెంట్స్ ఇమిటేట్ చేసి చూపించాలి. టవర్ టాస్క్ లో అమర్ ప్రవర్తనను అర్జున్ ఇమిటేట్ చేసి చూపించాడు.

    అర్జున్ రైతుబిడ్డ ప్రశాంత్ ని కూడా ఇమిటేట్ చేశాడు. శివాజీని ప్రియాంక ఇమిటేట్ చేయడం ఫన్నీగా అనిపించింది. టాప్ 6 కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ నిర్వహించిన మరో గేమ్ ఎవరు కొట్టారో చెప్పాలి. కళ్ళకు గంతలు కట్టుకుని, హెల్మెంట్ పెట్టుకుని ఒక కంటెస్టెంట్ గార్డెన్ ఏరియాలో ఉన్న కుర్చీలో కూర్చోవాలి. మిగతా కంటెస్టెంట్ సాఫ్ట్ స్టిక్ తో తలపై కొట్టాలి. ఎవరు కొట్టారో చెప్పాలి.

    ఈ గేమ్ లో అమర్ ని పిచ్చ కొట్టుడు కొట్టారు. చాలా సేపు అమర్ సరైన సమాధానం చెప్పలేకపోయాడు. ఎట్టకేలకు యావర్ ని గుర్తించాడు. దాంతో యావర్ కుర్చీలో కూర్చోవాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ కంటెస్టెంట్స్ కొట్టే ఈ టాస్క్ నిర్వహించలేదు. దీంతో ప్రేక్షకులు ఆసక్తిగా గమనించారు. ఇక ఆదివారం ఎపిసోడ్ కలర్ఫుల్ గా సాగనుందని సమాచారం ఎలిమినేటైన కంటెస్టెంట్స్ తో పాటు కొందరు హీరోయిన్స్ అదిరిపోయే స్టేజ్ పెర్ఫార్మన్స్ లు ఇవ్వనున్నారట.