Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. ఎనిమిదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ రేస్ లో గత రెండు రోజులుగా కంటెస్టెంట్స్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. సమయానుసారంగా బిగ్ బాస్ నిర్వహించిన టాస్కుల్లో గెలిచిన వారు కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలుస్తారు. తాజా ప్రోమోలో బిగ్ బాస్ కెప్టెన్సీ రేస్ లో భాగంగా కంటెండర్స్ గా నిలిచిన ప్రియాంక,శోభా శెట్టి,గౌతమ్,పల్లవి ప్రశాంత్,సందీప్ మాస్టర్ లకు ఆఖరి టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
‘ మిర్చి చాలా హాట్’ అని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.ఇందులో భాగంగా మిగిలిన ఇంటి సభ్యులు కెప్టెన్సీ కంటెండర్స్ లో నుంచి ఎవరు కెప్టెన్ అవుతారు అని నిర్ణయించాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పారు. అయితే ముందుగా అమర్ దీప్ ప్రశాంత్ మెడలో మిర్చి మాల వేశాడు. నువ్వు నామినేషన్స్ లో లెవ్వు కాబట్టి నామినేషన్స్ లో ఉన్న వారికి నీకంటే కెప్టెన్సీ చాలా అవసరం అని అమర్ చెప్పాడు. దానికి ప్రశాంత్ ‘నాకు వేస్తే వాళ్ళు సేవ్ అవుతారు అంటే కచ్చితంగా వేయించుకుంట’ కానీ అలా జరగదు కదా అన్న అని ప్రశాంత్ అన్నాడు.
ఆ తర్వాత భోలే, ప్రియాంక తో ‘ఇక్కడున్న ఐదుగురిలో నాకు నువ్వు వీక్ అనిపిస్తున్నావు అని అన్నాడు.మిర్చి దండ తీసుకెళ్లి ప్రియాంకకు వేశాడు భోలే. ఇక రతిక శోభా పేరు చెప్పింది. నువ్వు కెప్టెన్ అయితే బ్యాలెన్స్డ్ గా ఉండలేవు అని రతిక అనగానే శోభా రెచ్చిపోయింది. ఇద్దరు కాసేపు వాదించుకున్నారు.
తేజ ,ప్రశాంత్ ని నామినేట్ చేశాడు. తర్వాత యావర్,శోభా పేరు చెప్పడంతో శోభా ‘నీ లాగా బక్వాస్ రీజన్ చెప్పడం నాకు రాదు’ అంటూ యావర్ తో గొడవకి దిగింది. నువ్వు పిచ్చోడు అంటూ రెచ్చగొట్టింది.దీంతో యావర్ అలా అనకు అని అన్నాడు. కానీ శోభా మాత్రం బీపీ వచ్చిన దానిలా అరిచించింది. నేను అంటా మళ్ళీ మళ్ళీ అంటా అని రెచ్చిపోయింది. దాంతో యావర్ శోభా పైకి వెళ్లి ‘నేను పిచ్చోడా పిచ్చోడా అంటూ అరిచాడు. శోభా ఏ మాత్రం తగ్గకుండా యావర్ తో వాదించింది. మరి ఇంటి కెప్టెన్ ఎవరు అయ్యారో చూడాలి.
