https://oktelugu.com/

Sri Reddy: పవన్ కల్యాణ్‌ ఒప్పుకుంటే అతనితో పడుకుంటా.. శ్రీరెడ్డి దారుణమైన మాటలు..!

ఈ పరిణామం నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. శ్రీరెడ్డి అడపాదడపా చిత్రాల్లో నటించినా ఆమెకు బ్రేక్ రాలేదు. సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్స్, ఫొటోలతో వార్తల్లో నిలుస్తుంది. కారణం ఉన్నా లేకున్నా శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీ మీద విరుచుకుపడుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : October 27, 2023 / 03:04 PM IST

    Sri Reddy

    Follow us on

    Sri Reddy: శ్రీరెడ్డి టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఈమె పేరిట ఉన్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. టాలీవుడ్ ప్రముఖుల మీద శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. కొన్ని ప్రైవేటు ఫోటోలు, చాట్స్ లీక్ చేసింది. దగ్గుబాటి రామానాయుడు చిన్న కుమారుడు అభిరామ్ తో సన్నిహితంగా దిగిన ఫోటోలు షేర్ చేసింది. అప్పట్లో ఇవి సంచలనం రేపాయి. ఇక మా సభ్యత్వం, అవకాశాలు కావాలంటూ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసింది.

    ఈ పరిణామం నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. శ్రీరెడ్డి అడపాదడపా చిత్రాల్లో నటించినా ఆమెకు బ్రేక్ రాలేదు. సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్స్, ఫొటోలతో వార్తల్లో నిలుస్తుంది. కారణం ఉన్నా లేకున్నా శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీ మీద విరుచుకుపడుతుంది. దారుణమైన విమర్శలు గుప్పిస్తుంది. వైసీపీ సానుభూతిపరురాలిగా శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ మీద కూడా పలుమార్లు విమర్శలు చేసింది.

    అయితే శ్రీరెడ్డి కొన్ని అసభ్యకర కామెంట్స్ కూడా చేసింది. పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే ఆయనతో బెడ్ షేర్ చేసుంటా వంటి కామెంట్స్ చేసింది. శ్రీరెడ్డి కామెంట్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. కామెంట్స్ రూపంలో ఆమెకు కౌంటర్లు ఇస్తున్నారు. బూతులతో రెచ్చిపోతున్నారు. అయినా శ్రీరెడ్డి తన తీరు మార్చుకోదు. అదే విధంగా మాట్లాడుతుంది.

    శ్రీరెడ్డిని ఒకప్పటిలా జనాలు పట్టించుకోవడం లేదు. ఆమె చెన్నైలో సెటిల్ అయ్యింది. ఆ మధ్య యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వంటల వీడియోలు చేసింది. శ్రీరెడ్డి కుకింగ్ వీడియోలకు ఒకింత ఆదరణ దక్కింది. తన ఫేస్ బుక్ అకౌంట్స్ లో హాట్ హాట్ ఫోటోలు, కామెంట్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. శ్రీరెడ్డి వల్గర్ కామెంట్స్, ఫోటోలను ఇష్టపడేవారు ఫాలో అవుతూ ఉంటారు.