https://oktelugu.com/

Priyanka Jain: ప్రియుడితో పెళ్లిపై మాట మార్చేసిన ప్రియాంక… హౌస్లో చేసిన రొమాన్స్ అంతా వేస్టేనా?

బిగ్ బాస్ కి రాకముందు ప్రియాంక స్టార్ మా లో సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయింది. మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించింది.

Written By:
  • NARESH
  • , Updated On : December 24, 2023 / 06:10 PM IST

    Priyanka Jain

    Follow us on

    Priyanka Jain: బిగ్ బాస్ సీజన్ 7 బ్యూటీ ప్రియాంక జైన్ సీరియల్ యాక్టర్ శివ్ కుమార్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ వీక్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు శివ కుమార్ . అయితే ప్రియాంక పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని శివని అడిగింది. నువ్వు బయటకు రాగానే చేసుకుందాం అంటూ ఆయన అన్నారు. కానీ ఇప్పుడు ఎవరైనా పెళ్లి టాపిక్ తెస్తే ఇద్దరూ మాట మార్చేస్తున్నారు. తాజాగా ప్రియాంకను నెటిజన్స్ పెళ్లి గురించి అడిగితే మాట మార్చేసింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    బిగ్ బాస్ కి రాకముందు ప్రియాంక స్టార్ మా లో సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయింది. మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించింది. మౌనరాగం సీరియల్ లో ప్రియుడు శివ్ కుమార్ తో కలిసి నటించింది. ఆ సమయంలో అతనితో ప్రేమలో పడింది. చాలా కాలంగా వాళ్ళు ప్రేమలో ఉన్నారు. ఈ జంట యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. అందులో వారి లైఫ్ స్టైల్ కి సంబంధించిన కొన్ని వీడియోలు పెడుతుంటారు.

    సీరియల్స్ వల్ల వచ్చిన ఫేమ్ తో ప్రియాంక బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. హౌస్ లో మొదటి నుంచి సాఫ్ట్ నేచర్ తో ఉన్న ప్రియాంక జైన్ ఆడియన్స్ తో మంచి మెప్పు పొందింది. బిగ్ బాస్ హౌస్ లో అబ్బాయలకు ధీటుగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలిచింది. టాస్కుల్లో, నామినేషన్స్ లో విజృంభించి టాప్ 5 వరకు చేరుకున్న ఏకైక లేడీ కంటెస్టెంట్ గా ప్రియాంక నిలిచింది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ప్రియాంక కోసం వచ్చిన ఆమె ప్రియుడు శివ్ కుమార్ అమితమైన ప్రేమను కురిపించాడు.

    నువ్వు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాగానే పెళ్లి చేసుకుందాం అని ప్రియాంక తో చెప్పాడు. అప్పట్లో ఆ వీడియో వైరల్ గా మారింది. అయితే తాజాగా ప్రియాంక తన సోషల్ మీడియాలో అకౌంట్ లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఆ సమయంలో ఓ నెటిజన్ పెళ్లి ఎప్పుడు అని ప్రియాంక ను అడిగారు. దీంతో ‘ ఈ ప్రశ్న మీరు శివ ని అడగాలి .. నన్ను కాదు అని బదులిచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం నా చేతిలో ఏమీ లేదు అని షాక్ ఇచ్చింది. ఆయన ఎప్పుడు అంటే అప్పుడు నేను పెళ్ళికి రెడీ అని చెప్పుకొచ్చింది.