Prabhas: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన తర్వాత ఒక సినిమా చేయడానికి వాళ్ళ స్టార్ డమ్ కి ఉన్న క్యాలిక్యులేషన్స్ అన్నింటిని చూసుకొని ఆ సినిమా చేయడానికి ఒప్పుకుంటారు. నిజానికి ఒక సినిమా సక్సెస్ అనేది ఆ సినిమాలో చేసిన హీరో ఎవరు అనేదాని మీద ఎక్కువ గా డిపెండ్ అయి ఉంటుంది.ఒక సినిమా ఒక ప్రేక్షకుడికి నచ్చాలి అంటే ముందు ఆ సినిమాలో ఉన్న హీరో ప్రేక్షకుడికి నచ్చాలి.
అందువల్ల ప్రతి హీరో కూడా వాళ్ళ అభిమానులను దృష్టిలో ఉంచుకొని సినిమాలు చేస్తారు. ఇక అందులో భాగం గానే సినిమాల్లో కొన్ని సీన్లు చేయడానికి ప్రతి ఒక్క స్టార్ హీరో కూడా ఇబ్బంది పడతాడు. కానీ ప్రభాస్ లాంటి హీరో మాత్రం ఏ సీన్ అయిన ఈ మాత్రం ఇబ్బంది పడకుండా అసలు స్టార్ డమ్ గురించి ఆలోచించకుండా సినిమాలు చేస్తూ ఉంటాడు అనేది ఆయన ఇప్పటికే చాలాసార్లు చేసి చూపించాడు. ఇక సలార్ సినిమాలో ప్రభాస్ తో పాటు నటించిన మరో హీరో అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగులో పెద్దగా ఎవ్వరికి తెలీదు గానీ మలయాళం ఇండస్ట్రీలో ఆయన ఒక మంచి హీరోగా గుర్తింపుని సంపాదించుకున్నాడు.
పృథ్వీరాజ్ సుకుమారన్ కి కూడా కొన్ని ఎలివేషన్ సీన్లను ప్రశాంత్ నీల్ రాసుకున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలో వేరే స్టార్ హీరో అయితే పక్కనున్న పృథ్వి రాజ్ సుకుమారన్ కి ఎలివేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇద్దరిలో ప్రభాస్ పాన్ ఇండియా హీరో కాబట్టి తానొక్కడికి మాత్రమే ఎలివేషన్స్ ఇస్తే సరిపోద్ది అని మిగతా హీరోలు చెప్తుంటారు. కానీ ప్రభాస్ మాత్రం అలాంటి బేషజాలకు పోకుండా ప్రశాంత్ నీల్ సినిమాని ఎలా తీయాలనుకుంటున్నారో అలా తీయండి అని ప్రశాంత్ నీల్ కి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి ఈ సినిమాను తీయించినట్టుగా తెలుస్తుంది.
అందుకే ఈ సినిమాలో పృథ్వి రాజ్ సుకుమారన్ చేసిన కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కి ప్రభాస్ క్లాప్స్ కొట్టడం, విజిల్ కూడా వేయడం లాంటివి చేశాడు. మరి ప్రభాస్ లాంటి హీరో అయితే ఇలా చేశాడు కానీ మిగతా వేరే ఏ హీరో అయినా కూడా ఇలా చేసేవాడు కాదు అంటూ ప్రభాస్ చేసిన పనికి ఆయన్ని మెచ్చుకుంటూ పోస్ట్ లు పెడుతున్నారు…