Bigg Boss Telugu 6: Arjun- Sri Satya: బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన నాటి నుండి ఎవరో ఒకరిని లైన్లో పెట్టడమే పనిగా పెట్టుకున్నాడు అర్జున్ కళ్యాణ్. ముఖ్యంగా శ్రీసత్యను లక్ష్యం చేసుకున్నాడు. ఎలాగైనా ఆమెను ముగ్గులో దించి రొమాన్స్ చేయాలనేది మనోడి తపన. దాని కోసం గేమ్ కూడా పక్కన పెట్టి ఆమె సేవల్లో తరిస్తున్నాడు. హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ అర్జున్ పై చేస్తున్న ఏకైక కంప్లైంట్ అదే. శ్రీసత్య కోసం గేమ్ కూడా ఆడటం లేదని ఒకసారి అందరూ ఓట్లు వేసి జైలుకు కూడా పంపించారు. అయినా మనోడి తీరు మారడం లేదు. తాజా టాస్క్ లో మళ్ళీ శ్రీసత్యకు ఫేవర్ చేయడానికి ట్రై చేశాడు.

ప్రస్తుతం హౌస్ లో బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ జరుగుతుంది. ఒకరి ఎమోషన్స్ హౌస్లో ఉన్న అందరు కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ ముడిపెట్టాడు. గార్డెన్ ఏరియాలో బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ ఛార్జ్ జీరో కాకుండా కంటెస్టెంట్స్ గేమ్ ఆడాలి. ఒకవేళ జీరో అయితే గేమ్ ఆగిపోతుంది. కన్ఫెషన్ రూమ్ కి ఒక్కొక్క కంటెస్టెంట్ ని బిగ్ బాస్ పిలుస్తాడు. వాళ్ళ ముందు మూడు ఆప్షన్స్ ఉంచుతాడు. కుటుంబ సభ్యులతో ఆడియో, వీడియో కాల్ మాట్లాడాలంటే ఎక్కువ శాతం బ్యాటరీ కోల్పోతారు. ఫుడ్ వంటి ఆప్షన్ ఎంచుకుంటే తక్కువ పెర్సెంటేజ్ బ్యాటరీ ఖర్చు అవుతుంది.
ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్నా, వాళ్ళ సందేశాలు పొందాలన్నా బ్యాటరీ రీజార్జ్ అవసరం. ఉదాహరణకు బ్యాటరీ 30 పర్సెంట్ ఉందనుకుంటే.. 10వ కంటెస్టెంట్ ఆ మొత్తం వాడేస్తే బ్యాటరీ నిల్ అవుతుంది. గేమ్ ఆగిపోతుంది. 11వ కంటెస్టెంట్ తన కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కోల్పోతాడు. ఈ టాస్క్ లో భాగంగా అర్జున్ ని కన్ఫెషన్ రూమ్ కి బిగ్ బాస్ పిలిచాడు.

బ్యాటరీ 80 శాతం ఉండగా… 35 శాతం కోల్పోయే వీడియో కాల్ ఆప్షన్ అర్జున్ ఎంచుకున్నాడు. ట్విస్ట్ ఏమిటంటే ఆ వీడియో కాల్ అవకాశం శ్రీసత్యకు ఇవ్వాలని బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేశాడు. శ్రీసత్య అమ్మ గురించి బాగా దిగులు పడుతుంది. నేను ఎంచుకున్న వీడియో కాల్ ఆప్షన్ శ్రీసత్య కుటుంబ సభ్యలతో మాట్లాడేందుకు ఇవ్వాలన్నాడు. బయటికొచ్చి అదే విషయం శ్రీసత్యకు చెప్పగానే ఆమె అసహనం వ్యక్తం చేసింది. బిగ్ బాస్ ఇంకా టైట్ చేస్తాడు, నువ్వు అలా చెప్పకూడదని చెప్పింది. అర్జున్ తీరు చూసిన జనాలు వీడేంట్రా బాబు శ్రీసత్య కోసమే బ్రతికేస్తున్నాడు. జీవితంలో ఆడాళ్ళనే చూడనట్లు అని ఏకిపారేస్తున్నారు. శ్రీసత్య కోసం నీ గేమ్ పాడు చేసుకోకని ఎంత చెప్పినా అర్జున్ అదే చేస్తున్నాడు.