Bigg Boss Telugu 5: బిగ్ బాస్ ఆరో వారంలోకి చేరుకుంది. సోమవారం వచ్చిందంటే చాలు రచ్చ రంబోలా అవుతుంది. హౌస్ లో నామినేషన్ల ప్రక్రియ చినిగి చాటవుతోంది. గొడవలు, కొట్లాటలు, ఆగ్రహ జ్వాలలు.. ఇలా కొట్టుకోవడం ఒకటే తక్కువ అన్నట్టుగా సాగుతోంది. హౌస్ లో ఎమోషన్స్ పీక్ స్టేజ్ కి చేరుకుంటుండగా.. ప్రేక్షకులకు మాత్రం కావాల్సినంత మజా పంచుతోంది.

బిగ్ బాస్ లో అన్నింటికంటే పెద్ద టాస్క్ నామినేషన్స్. బాగా ఆడినా, ఆడకపోయినా.. నవ్వించినా.. నవ్వించకపోయినా.. ఏ చిన్న తప్పు చేసినా.. చేయకున్నా సరే కంటెస్టెంట్లు కారణాలు చూపి నామినేట్ చేయాల్సి ఉంటుంది. హౌస్ లోని అందరూ దీన్ని భరించాల్సిందే. ఎప్పుడో ఒకప్పుడు నామినేట్ కావాల్సిందే. ప్రతి సోమవారం దీన్ని చేపడతారు. అదే రోజు హౌస్ రసాభాసగా సాగుతుంది.
ఇప్పటికే ఐదుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం నుండి ఇప్పటివరకు గాను సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా ఎలిమినేట్ అయిన సంగతి తెల్సిందే. ఇక ఆరో వారం నామినేషన్ ప్రక్రియ రానే వచ్చేసింది. ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ లో ఉన్న హౌస్ మేట్స్ సంఖ్య మరింత పెరిగింది. నాలుగో వారానికి గాను ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అవ్వగా, ఐదో వారానికి గాను తొమ్మిది మంది సభ్యులు నామినేట్ అవ్వగా, తాజాగా ఆరో వారానికి గాని అత్యధికం గా పది మంది నామినేట్ అయ్యారు.
ప్రతి సోమవారానికి ఇలా నామినేట్ అయ్యే హౌస్ మేట్స్ సంఖ్య పెరుగుతూ పోతుంటే కచ్చితం గా వచ్చే వారంలో కెప్టెన్ మినహాయించి ప్రతి ఒక్క హౌస్ మేట్ కచ్చితం నామినేషన్స్ లో నిలుస్తాడనటం లో ఎటువంటి సందేహం లేదు. అయితే తాజా గా జరుగుతున్న లీకుల ప్రక్రియలో ఆరో వారానికి గాను నామినేట్ అయిన హౌస్ మేట్స్ ఎవరో ముందుగానే తెలిసిపోయింది. మానస్,సన్నీ, శ్రీరామ చంద్ర, ప్రియాంకా సింగ్, శ్వేతా వర్మ, జెస్సీ, యాంకర్ రవి, సిరి హనుమంతు, విశ్వ, లోబో ఆరో వారానికి బిగ్ హౌస్ నుండి బయటకు వెళ్లే ఎలిమినేషన్ ప్రక్రియ లో నామినేట్ అయ్యారు. మరి ఆరో వారంలో బిగ్ బాస్ హౌస్ ని ఎవరి విడిచి వెళ్తారో అనే విషయం తెలుసుకోవాలంటే వచ్చే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే.