అయితే ఈ కార్యక్రమంల పాల్గొనేందుకు కొందరి పేర్లు వినిపించినా తరువాత వారిని ఎందుకో తీసుకోలేదు. వర్షిణి సౌందరరాజన్, ఇషాచావ్లా, నవ్య స్వామి, సురేఖ వాణి పేర్లు వినిపించాయి. కానీ తుది జాబితాలో వారి పేర్లు కనిపించలేదు. వీరే కాకుండా ఇంకొందరి పేర్లు కూడా గల్లంతు కావడం తెలిసిందే. ఇందులో ఇషాచావ్లా కు మాత్రం కరోనా పాజిటివ్ రావడంతో ఆమెను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. కానీ మిగతా వారిని మాత్రం ఎందుకు తీసుకోలేదో తెలియడం లేదు.
అయితే గత సీజన్లకు నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా వ్యవహరించారు. దీనికి కూడా ఆయనే బాధ్యత తీసుకున్నారు. మూడు, నాలుగు సీజన్లు విజయవంతంగా నడిచినా ప్రస్తుతం ఐదో సీజన్ మాత్రం హాట్ గా మారింది. గత సీజన్ కు నాగార్జున రూ.8 కోట్ల మేర పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ కు మాత్రం రూ.9 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
కంటెస్టెట్లలో వ్యాఖ్యాత రవి కూడా పారితోషికం అత్యధికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. రవికి (Ravi) కూడా వారానికి రూ.7 నుంచి 10 లక్షల మధ్య రెమ్యూనరేషన్ తీసుకునేందుకు నిర్వాహకులు సిద్ధమైనట్లు చెబుతున్నారు. దీంతో బిగ్ బాస్ కార్యక్రమం మరో విజయవంతమైన షో గా మారే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరులు ద్వారా జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా నాగార్జున సైతం బిగ్ బాస్ ద్వారా తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.