https://oktelugu.com/

తెలంగాణ టీడీపీ పగ్గాలు ఆ హీరో చేతికంట.. నిజమేనా..?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయింది. బాబు సిద్ధాంతాలతో ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయింది. ఏదో ఒకరిద్దరు లీడర్లు తప్ప చెప్పుకోడానికి పెద్దగా క్యాడర్‌‌ అంటూ ఏమీ లేదు. ఇటీవలే ఏపీకి కొత్త అధ్యక్షుడిని నియమించిన పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అ క్రమంలోనే తాజాగా సినీ నటుడు నారా రోమిత్‌ విడుదల చేసిన ఓ వీడియో హల్‌చల్‌ అయింది. Also Read: […]

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2020 / 02:27 PM IST
    Follow us on

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయింది. బాబు సిద్ధాంతాలతో ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయింది. ఏదో ఒకరిద్దరు లీడర్లు తప్ప చెప్పుకోడానికి పెద్దగా క్యాడర్‌‌ అంటూ ఏమీ లేదు. ఇటీవలే ఏపీకి కొత్త అధ్యక్షుడిని నియమించిన పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అ క్రమంలోనే తాజాగా సినీ నటుడు నారా రోమిత్‌ విడుదల చేసిన ఓ వీడియో హల్‌చల్‌ అయింది.

    Also Read: తెలంగాణ మళ్లీ టాప్.. గొప్ప విజయం

    నారా రోహిత్‌ త్వరలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని మార్చాలంటూ ఇప్పటికే పలువురు తెలంగాణ రాష్ట్ర నాయకులు అధినేత దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నారా రోహిత్‌ విడుదల చేసిన వీడియో ఇప్పుడు చర్చకు దారితీసింది.

    ‘హాయ్‌.. నేను మీ నారా రోహిత్‌. అక్టోబర్‌‌ 2 గాంధీ జయంతి సందర్భంగా ఉదయం 11 గంటలకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం ఓ మెగా బ్లడ్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నాం. మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ తగిన కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ క్యాంప్‌ను విజయవంతం చేయాలని కోరుతున్నాను’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు.

    Also Read: దుబ్బాకలో పార్టీల దూకుడు.. బరిలో వీరే?

    ఈ వీడియోపై అప్పుడే నెటిజన్లు స్పందించారు. టీటీడీపీ పగ్గాలను నారా రోమిత్‌ చేపట్టబోతున్నట్లు ట్రోల్‌ చేస్తున్నారు. నారా రోహిత్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున ఏపీలో ప్రచారం చేశారు. సమయం దొరికినప్పుడల్లా.. అవకాశాన్ని బట్టి రోహిత్‌ పార్టీ తరఫున స్పందిస్తూనే ఉంటారు. అయితే.. తాజాగా పెట్టిన వీడియోలో అర్థం పరమార్థం ఏంటనేది తేలకుండా ఉంది. రోహిత్‌ కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు అంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతున్న ఈ వ్యాఖ్యలను కూడా ఇప్పటివరకు ఖండించలేదు. వాటిపై స్పందించనూ లేదు.