https://oktelugu.com/

HBD Ariyana: అరియానా బర్త్ డే వేడుకలు.. ‘బిగ్‌బాస్’ టీం సర్ ప్రైజ్..!

HBD Ariyana: బిగ్ బాస్ బ్యూటీ అరియా గ్లోరీ జన్మదినం జనవరి 25. హైదరాబాద్ కు చెందిన ఈ బ్యూటీ యాంకర్ గా, బిగ్ బాస్-4 కంటెస్టెంట్ గా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. ఈ బిగ్ బాస్ బ్యూటీ 2022 జనవరి 25 నాటికి 29ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టనుంది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. బిగ్ బాస్ బ్యూటీ పుట్టిన రోజు సందర్బంగా గతేడాది ‘బిగ్ బాస్’ టీం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 25, 2022 / 12:05 AM IST
    Follow us on

    HBD Ariyana: బిగ్ బాస్ బ్యూటీ అరియా గ్లోరీ జన్మదినం జనవరి 25. హైదరాబాద్ కు చెందిన ఈ బ్యూటీ యాంకర్ గా, బిగ్ బాస్-4 కంటెస్టెంట్ గా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. ఈ బిగ్ బాస్ బ్యూటీ 2022 జనవరి 25 నాటికి 29ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టనుంది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.

    HBD Ariyana

    బిగ్ బాస్ బ్యూటీ పుట్టిన రోజు సందర్బంగా గతేడాది ‘బిగ్ బాస్’ టీం సందడి చేసింది. వీరికి అరియానా ఘనంగా పార్టీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెల్సిందే. ఇక ఈ ఏడాది కూడా బిగ్ బాస్-4 కంటెస్టెంట్స్ ఆమె బర్త్ డే వేడుకల కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు.

    HBD Ariyana

    యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అరియానా ‘బిగ్ బాస్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన అందచందాలు, టాలెంట్ తో యూత్ లో క్రేజ్ పెంచుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో సిన్సియర్ గా ఉంటునే అరియానా మగవాళ్లను ఆటపట్టించేంది. అలాగే తనకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులను విజయవంతం పూర్తి చేయడంతో ఆ సీజన్లో ఆమె టాప్-5లో నిలిచింది.

    HBD Ariyana

    బుల్లితెరపై వ్యాఖ్యాతగా పలు టెలివిజన్ షోలు చేసిన ఈ భామ ‘బిగ్ బాస్’ తర్వాత రూట్ మార్చేసింది. రాజ్ తరుణ్ నటించిన ‘అనుభవించు రాజా’లో అరియానా ఓ స్పెషల్ రోల్ చేసింది. ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో మళ్లీ బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది.

    వరుసగా సినిమాలు చేస్తూనే సెలబ్రెటీస్ తో స్పెషల్ ఇంటర్వ్యూలు చేస్తూ అభిమానులను అలరింపజేస్తోంది. ఇటీవల ఆర్జీవీతో కలిసి జిమ్ లో అరియానా చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాను షేక్ చేసింది. అలాగే అవినాష్ తో కలిసి కామెడీ స్టార్స్ కార్యక్రమం చేస్తోంది.

    సోషల్ మీడియాలో అరియా నిత్యం యాక్టివ్ గా ఉంటారు. హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా రోజురోజుకు భారీగా పెరిగిపోతుంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా మనమూ శుభాకాంక్షలు చెబుదాం..

    Tags