Homeబాలీవుడ్Sonu Sood : రాజకీయాల్లోకి వస్తా .. క్లారిటీ ఇచ్చిన కలియుగ కర్ణుడు !

Sonu Sood : రాజకీయాల్లోకి వస్తా .. క్లారిటీ ఇచ్చిన కలియుగ కర్ణుడు !


Sonu Sood :  సోనూసూద్
‌..  కలియుగ కర్ణుడు అంటూ   నెటిజన్లు ఒక బిరుదు కూడా ఇచ్చారు.   ఆ మధ్య   సోనూకి  ఒక  విగ్రహం  ఏర్పాటు చేసి పూజలు కూడా  జరిపించారు. మొత్తానికి సోనూ జనంలోకి బాగా వెళ్ళాడు.  అందుకే,  మరో ఐదేళ్లపాటు సమాజ సేవపై దృష్టి పెట్టి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ నటుడు సోనూసూద్ వెల్లడించారు. తన ఆలోచనలతో సారూప్యత ఉన్న పార్టీలో చేరతానని తెలిపారు. ఈ పదవికి నువ్వే అర్హుడివని అందరూ అనేస్థాయికి ఎదిగాక తప్పకుండా వస్తానని చెప్పుకొచ్చారు. 

Sonu Sood
Sonu Sood

పంజాబ్‌లో కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ తరఫున మోగా నుంచి పోటీ చేస్తున్న సోదరి మాళవికకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.  ఏది ఏమైనా కరోనా భారత దేశంలో తన ప్రతాపాన్ని చూపించడం  మొదలుపెట్టినప్పటి నుండీ  సోనూసూద్ పేరు మారుమ్రోగిపోతుంది.  ప్రజలకు ఏ కష్టం వచ్చినా సోనూసూద్ వైపు చూస్తున్నారు. అయితే,  సాధారణ పౌరులే కాదు.. ఈ కష్ట  సమయంలో అవసరం రాగానే  సెలబ్రిటీలు కూడా  ఇప్పుడు  సోనూసూద్  వైపే చూశారు. 

అతని  ద్వారా సాయం పొందారు.  అందుకే   సినిమా సెట్స్ లో మెగాస్టార్, మోహన్ లాల్  లాంటి స్టార్స్  కూడా   శాలువా కప్పి  సోనూను ప్రత్యేకంగా  సన్మానించారు.  మొత్తానికి కరోనా ఆపద్బాంధవుడిగా సోనూ చేసిన సేవలు,  సాయాలు  ఎంత చెప్పుకున్నా తక్కువే.  సాయం అనే పదానికి  సోనూసూద్ పర్యాయపదం అయిపోయాడు.  

mumbai muncipal corporation issues notice to sonusood

ఏది ఏమైనా పేదలతో పాటు డబ్బు ఉన్నవారికి కూడా సోనూసూద్ ఇలా సాయం చేస్తుండటం,  ప్రముఖులు సైతం  కరోనా  కష్ట కాలాన్ని దాటలేక  సోను సూద్ ను సాయం కోరడం సోనూసుద్ కి మాత్రమే సాధ్యమైన  ఘనమైన ఘనతే ఇది.

Soonu Sood Birthday

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

3 COMMENTS

  1. […] Kajal Agarwal: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గర్భవతి, ఈ హీరోయిన్ మాత్రం తన కడుపును దాచడానికి ఇన్నాళ్లు నానాపాట్లు పడుతూ తెగ కష్టపడింది. అయితే, ఇప్పుడు దాచినా దాగేలా లేదు కాజల్ బేబీ బంప్. అందుకే, గర్భవతిగా ఉన్న కాజల్ అగర్వాల్ బేబీ బంప్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్ లో కాజల్ అగర్వాల్ కూర్చున్న ఓ ఫోటోలో బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫోటోకు పెద్ద ఎత్తున లైక్స్ వస్తున్నాయి. […]

  2. […] Nandamuri Balakrishna:  నటసింహం నందమూరి బాలకృష్ణతో క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, బన్నీలతో సినిమాలు పూర్తైన తర్వాత 2023లో బాలయ్య-కొరటాల ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని.. ఇప్పటికే కొరటాల, బాలయ్య కోసం కథ కూడా రెడీ చేశాడని తెలుస్తోంది. ఎంతైనా హీరోల ఇమేజ్‌లను బట్టి కథలు రాయడంలో కొరటాల శివకి మంచి అనుభవం ఉంది. మరి బాలయ్య కోసం ఎలాంటి కథ రాశాడో చూడాలి. […]

Comments are closed.

Exit mobile version