https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బిగ్ బాస్ టీం..అభయ్ రూల్స్ బ్రేక్ చేసిన పట్టించుకోని నాగార్జున..అందుకు సాక్ష్యాలు ఇవే!

చేతికి వాచీ పెట్టుకున్నాడంటే, లోపల మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించట్లేదని గ్యారంటీ ఏమిటి?, అసలు అవసరం పడినప్పుడల్లా హౌస్ నుండి బయటకి కంటెస్టెంట్స్ వెళ్లి రారు అని గ్యారంటీ ఏమిటి? అంటూ నెటిజెన్స్ ప్రశ్నలు సంధిస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 17, 2024 / 04:19 PM IST

    Bigg Boss 8 Telugu(40)

    Follow us on

    Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ప్రపంచం లోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోస్ లో ఒకటి, ఈ షో లో జరిగే సంఘటనలు మొత్తం స్క్రిప్టెడ్ కాదు, సహజంగా జరిగేవే అని అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఇది ఒక స్క్రిప్టెడ్ షో అని, చాలా వరకు బిగ్ బాస్ టీం చెప్పినట్టే హౌస్ మేట్స్ నడుచుకుంటారని, ఆడియన్స్ ని రియాలిటీ షో అంటూ మోసం చేస్తున్నారు అని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే హౌస్ నుండి బయటకి వచ్చిన కంటెస్టెంట్స్ ని ఇదే విషయాన్నీ అడగగా అలాంటిది ఏమి లేదు, బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన రియాలిటీ షో, ఒక్క అంశం కూడా స్క్రిప్టెడ్ గా జరగలేదు అని శివాజీ లాంటి కంటెస్టెంట్స్ కూడా చెప్పారు. వాళ్ళు చెప్పింది నిజమో కాదో కాసేపు పక్కన పెడితే, సీజన్ 8 లో బిగ్ బాస్ టీం లేటెస్ట్ గా ఒక అంశం లో అడ్డంగా దొరికిపోయింది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ కి ఫోన్ వాడేందుకు వీలు లేదు, టీవీ ఎంటర్టైన్మెంట్ ఉండదు, కనీసం టైం ఎంత అనేది కూడా తెలియదు, వాచీలు ఉండవు ఇలా ఎంతో కఠినమైన రూల్స్ ఉంటాయని మనకి సీజన్ 1 నుండే తెలుసు. కానీ ఈ సీజన్ లో హౌస్ లో అభయ్ అనే కంటెస్టెంట్ చేతికి వాచీ తగిలించుకోవడం ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు. గత వీకెండ్ ఎపిసోడ్ లో అభయ్ ఇలా అడ్డంగా దొరికిపోయాడు.

    చేతికి వాచీ పెట్టుకున్నాడంటే, లోపల మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించట్లేదని గ్యారంటీ ఏమిటి?, అసలు అవసరం పడినప్పుడల్లా హౌస్ నుండి బయటకి కంటెస్టెంట్స్ వెళ్లి రారు అని గ్యారంటీ ఏమిటి? అంటూ నెటిజెన్స్ ప్రశ్నలు సంధిస్తున్నారు. బిగ్ బాస్ టీం అడ్డంగా దొరికిపోయిందని, ఏ సీజన్ లో కూడా ఇలా రెడ్ హ్యాండెడ్ గా దొరకలేదని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.గత వారం శేఖర్ బాషా ని ఎలిమినేట్ చేసినప్పుడే జనాలకు అనుమానం వచ్చింది. ఇది పూర్తి గా స్క్రిప్ట్ ప్రకారమే షో నడుస్తుంది అని, ఇప్పుడు ఈ చిన్న అంశం తో మరోసారి రెడ్ హ్యాండెడ్ గా దొరకడం తో నెటిజెన్స్ ఇది నూటికి నూరు శాతం స్క్రిప్టెడ్ షో అని అంటున్నారు. లేదా కేవలం కొంతమంది కంటెస్టెంట్స్ కి స్పెషల్ అనుమతులు ఇచ్చారేమో, వారిలో అభయ్ ఉండొచ్చు అని కూడా అంటున్నారు.

    ఈ రెండు కాకుండా అభయ్ కావాలని వాచీ ని ధరించడం, దానిని అక్కినేని నాగార్జున, బిగ్ బాస్ టీం గమనించి ఉండకపోయుండొచ్చు అని కూడా అనుకుంటున్నారు నెటిజెన్స్. ఇది ఇలా ఉండగా ఈ వారం అభయ్ నామినేషన్స్ లో ఉన్నాడు, ఇప్పటికే ఆయన డేంజర్ జోన్ లో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ రూల్స్ ని ఈ స్థాయిలో బ్రేక్ చేసిన తర్వాత ఆయనని ప్రేక్షకులు హౌస్ లో కొనసాగించడం కష్టమే అని అంటున్నారు.