https://oktelugu.com/

Sri Satya: ప్యాంటు విప్పేసి కెమెరా ముందుకు… చూపించడంతో తెగించిన బిగ్ బాస్ శ్రీసత్య

ప్రస్తుతం సీరియల్స్ వదిలేసిన శ్రీసత్య బుల్లితెర షోలకు పరిమితమయ్యారు. మొన్నటి వరకు బిగ్ బాస్ జోడీలో సందడి చేసింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తో బీబీ జోడి డాన్స్ రియాలిటీ షో స్టార్ మాలో ప్రసారమైంది. అందులో శ్రీసత్య పాల్గొన్నారు.

Written By:
  • Shiva
  • , Updated On : April 26, 2023 / 06:51 PM IST
    Follow us on

    Sri Satya: బిగ్ బాస్ సీజన్ 6 అట్టర్ ప్లాప్. కనీస టీఆర్పీ రాలేదు. హోస్ట్ నాగార్జున తీవ్ర విమర్శలు ఎదుర్కోనున్నారు. షో కూడా పస లేకుండా సాగిందని ఆడియన్స్ అభిప్రాయపడ్డారు. ఈ షోతో కొందరు నటులు వెలుగులోకి వచ్చారు. సీరియల్ నటి శ్రీసత్య ఫేమ్ రాబట్టారు. చెప్పాలంటే ఈమె ఎక్కువ నెగిటివిటీ ఫేస్ చేసింది. శ్రీసత్యకు నెటిజెన్స్ స్నేక్ అని పేరు పెట్టారు. తన ప్రయోజనాల కోసం ఇతర కంటెస్టెంట్స్ కి తెలిగివిగా వాడేసిందనే అపవాదు ఉంది. కంటెస్టెంట్ అర్జున్ శ్రీసత్యను ఆరాధించాడు. ఆమె కోసం హౌస్ కి వచ్చినట్లు ప్రవర్తించాడు.

    వాడుకున్నన్ని రోజులు తెలివిగా వాడుకుని అతని ఎలిమినేషన్ కి కారణమైంది. అర్జున్ కళ్యాణ్ కొద్ది వారాలకే బ్యాగ్ సర్దాల్సి వచ్చింది. అర్జున్ హౌస్లో ఉన్నంత వరకు నాకు ప్రేమలు నచ్చవని చెప్పింది. అతడు ఎలిమినేట్ అయ్యాక శ్రీహాన్ కి దగ్గరైంది. శ్రీహాన్-శ్రీసత్య స్నేహితులమని చెప్పుకుంటూ రొమాన్స్ చేశారు. శ్రీసత్య స్నేహం శ్రీహాన్ లో విపరీతమైన మార్పు తెచ్చింది. అతనిపై ఆడియన్స్ లో నెగిటివిటీకి కారణమైంది. హౌస్లోకి సిరి ఎంట్రీ ఇచ్చి శ్రీహాన్ ని సెట్ చేసింది.

    అప్పటి నుండి శ్రీసత్య విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు శ్రీహాన్. అందుకే ఫైనల్ కి వెళ్ళాడు. ఆల్మోస్ట్ టైటిల్ అందుకున్నంత పని చేశాడు. శ్రీసత్యను ఎలిమినేట్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. ఫైనల్ కి వెళ్లిన శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చింది. శ్రీసత్య ఎంత నెగిటివిటీ ఫేస్ చేసినా ఆమెకంటూ కొందరు అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో శ్రీసత్యకు సప్పోర్ట్ గా నిలబడ్డారు.

    ప్రస్తుతం సీరియల్స్ వదిలేసిన శ్రీసత్య బుల్లితెర షోలకు పరిమితమయ్యారు. మొన్నటి వరకు బిగ్ బాస్ జోడీలో సందడి చేసింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తో బీబీ జోడి డాన్స్ రియాలిటీ షో స్టార్ మాలో ప్రసారమైంది. అందులో శ్రీసత్య పాల్గొన్నారు. మెహబూబ్ కి జోడీగా ఆమె చేశారు. బీబీ జోడిని చాలా సీరియస్ గా తీసుకున్నారు మెహబూబ్-శ్రీసత్య. కఠినమైన పాటలు ఎంచుకొని అద్భుతమైన కాస్ట్యూమ్స్, సెటప్ ఏర్పాటు చేసుకునేవాళ్ళు. డాన్స్ విషయంలో కూడా గొప్ప ప్రదర్శన ఇచ్చేవారు.

    బీబీ జోడి టైటిల్ శ్రీసత్య-మెహబూబ్ లదే అనిపించింది. అనూహ్యంగా ఈ జోడి ఫైనల్ కి కూడా వెళ్లలేకపోయారు. సూర్య-ఫైమా టీమ్ టైటిల్ గెలిచి రూ. 25 లక్షలు సొంతం చేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో శ్రీసత్య పోస్ట్స్ అల్లాడిస్తుంది. బోల్డ్ అండ్ గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. తాజాగా ప్యాంటు లేకుండా కెమెరా ముందు థైస్ షో చేసింది. శ్రీసత్య హాట్ ఫోటో ఇంటర్నెట్ ని షేక్ చేసింది. గ్లామర్ తో తన పాపులారిటీ పెంచుకుంటూ పోతున్నారు.