Homeక్రీడలుMS Dhoni: ధోనీ ఫీల్డింగ్ సెటప్ ను కాదనే ఒకే ఒక్క బౌలర్ అతనే..!

MS Dhoni: ధోనీ ఫీల్డింగ్ సెటప్ ను కాదనే ఒకే ఒక్క బౌలర్ అతనే..!

MS Dhoni: ప్రపంచ క్రికెట్ లో మహేంద్రసింగ్ ధోనిది ప్రత్యేక స్థానం. కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా ఎన్నో రికార్డులను ధోని సృష్టించాడు. ధోని మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఫీల్డింగుల్లో మార్పులు చేస్తూ.. విజయం సాధించేదిగా ప్రణాళికలు అనుసరిస్తూ ఉంటాడు. బౌలర్ సామర్థ్యానికి అనుగుణంగా ఫీల్డింగ్ సెటప్ చేయడంలో ధోనిది ప్రత్యేక స్థానం. అయితే, అటువంటి ధోనీ పెట్టే ఫీల్డింగ్ సెటప్ ను ఒక బౌలర్ పూర్తిగా మార్చేస్తాడంట. ఈ విషయాన్ని స్వయంగా ధోనీనే పేర్కొనడం విశేషం.

ఇండియన్ క్రికెట్ లో అయినా, ఐపీఎల్ లో అయినా ధోని ఒకసారి ఫీల్డింగ్ సెట్ చేస్తే దానిలో ఎటువంటి మార్పులు ఉండవు. బౌలర్ ఎవరైనా ధోని సెట్ చేసిన ఫీల్డింగును కొనసాగిస్తారు. ఏ బౌలర్ కూడా దానికి అభ్యంతరం చెప్పడు. కానీ ఓ మ్యాచ్ లో దీపక్ చాహార్ ఫీల్డింగ్ మార్చాల్సిందిగా కోరితే.. బౌలర్ ను మార్చేస్తా అంటూ ధోని బెదిరించడం అప్పట్లో తెగ వైరల్ అయింది.

ఐపీఎల్ లో అపారమైన అనుభవం ఉన్న ధోని..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మహేంద్ర సింగ్ ధోనీకి అపారమైన అనుభవం ఉంది. 15 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతూ.. నాలుగు టైటిల్స్ ను చెన్నై జట్టుకి గెలిపించి పెట్టాడు ధోని. అయితే అప్పట్లో దీపక్ చాహర్ కి తెలియదని, అభిమానులు మహేంద్రసింగ్ ధోనీకే సపోర్ట్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన ఓ సీనియర్ బౌలర్ మాత్రం.. ధోని ఫీల్డింగ్ సెట్టింగ్ పూర్తిగా మార్చేస్తాడట. అతను మరెవరో కాదు బ్రావో. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్నాడు డీజే బ్రావో. ఐపీఎల్ లో 183 వికెట్లు తీసిన బ్రావో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కు బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ కు ఆడిన బ్రావో.. ఆ తరువాత చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ఆడాడు. మహికి అత్యంత ఆప్తుడిగా పేరుగాంచిన బ్రావో.. ఐపీఎల్ నుంచి ప్లేయర్ గా తప్పుకోగానే చెన్నై జట్టు బౌలింగ్ కోచిగా బాధ్యతలు తీసుకున్నాడు.

తాను సెట్ చేసే ఫీల్డింగ్ ని ఒప్పుకోడు బ్రావో..

‘బ్రావో ఒక్కడే నేను సెట్ చేసిన ఫీల్డింగ్ ని అస్సలు ఒప్పుకోడు. అతన్ని ఇక్కడా.. ఇతన్ని అక్కడా అని మొత్తం మార్చేస్తాడు. నేను ఏమీ అనలేను. ఎందుకంటే బ్రావోకి నాకంటే ఎక్కువ టి20 అనుభవం ఉంది. అందుకే తనకు నచ్చినట్టుగా ఫీల్డ్ సెట్ చేస్తాను’ అని మహేంద్రసింగ్ ధోని తాజాగా కామెంట్ చేశాడు. 2023 సీజన్ తో మహేంద్రసింగ్ ధోని కూడా ఐపీఎల్ నుంచి తప్పుకోబోతున్నాడు. ఆటగాడిగా రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ధోని.. చెన్నై సూపర్ కింగ్స్ కి బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. చెన్నై తో పాటు సౌత్ ఆఫ్రికా t20 లీగ్, మేజర్ టి20 లీగ్ వంటి టోర్నీల్లో సూపర్ కింగ్స్ జట్టుకు కోచ్ గా వ్యవహరించనున్నట్లు చెబుతున్నారు.

Exit mobile version