Nayani Pavani Elimination: బిగ్ బాస్ షో లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరు ఊహించలేరు. పైగా ఉల్టా పుల్టా అంటూ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఆరో వారం నయని పావని ని ఎలిమినేట్ చేసి పెద్ద షాక్ ఇచ్చారు. వాస్తవానికి నయని కి చాలా అన్యాయం జరిగింది. అశ్విని ,పూజ మూర్తి, శోభా కూడా లీస్ట్ ఓటింగ్ తో ఉన్నారు. ఇక శోభా ఎలిమినేట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీన్ని బట్టి అర్థం అవుతుంది జనాలు ఓట్లతో ఎలిమినేషన్ కు సంబంధం లేదు అని.
మొదటి ఐదు వారాలు ఆడియన్స్ ఓట్లు వేసి నిర్ణయించిన ప్రకారం ఎలిమినేషన్ జరిగింది. ఆరో వారం జరిగిన ఎలిమినేషన్ మాత్రం పూర్తిగా ఆడియన్స్ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగింది. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నయని ఎలిమినేషన్ మీద గీతూ,యాంకర్ శివ వంటి వారు స్పందించారు. అది తప్పుడు నిర్ణయం అన్నారు. బిగ్ బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ కూడా నయని కి అండగా నిలబడ్డాడు.
దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేసాడు. నయని విషయంలో జరిగింది చూస్తే బాధగా అనిపిస్తుంది.. ఆమెకు ఇలాంటి పరిస్థితి రావాల్సింది కాదు.. ఇది షో కి అతి పెద్ద నష్టం. షో మీద ఉన్న నమ్మకం,క్రెడిబిలిటీ అంతా పోయింది. ఓటింగ్స్ ద్వారా ఎలిమినేషన్ జరగదని ఇప్పటికైనా జనాలకి అర్థమై ఉంటుంది. ఎవరో ఒకరు అన్ని సీజన్ల ఓటింగ్,ఎలిమినేషన్ల మీద పిల్ వేయాలి అంటూ అర్జున్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు.
నయని ఉన్నది ఒక్క వారమే అయినప్పటికీ అందరి మనసులు గెలుచుకుంది. హౌస్ లో అందరితో కలిసి పోయింది. ముక్కు సూటిగా మాట్లాడుతూ,గేమ్ పరంగా కూడా ఏమాత్రం తగ్గకుండా ఆడింది. అటు హౌస్ లో వాళ్ళని ఇటు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఆమె ఎలిమినేట్ అవ్వడంతో అందరూ ఎమోషనల్ అయ్యారు. నయని కూడా భోరున ఏడ్చింది. ఆమె బాధను చూసిన నెటిజన్స్ బిగ్ బాస్ టీమ్ ని ఓ రేంజ్ లో విమర్శిస్తున్నారు.