https://oktelugu.com/

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 .. గెలుపు ఎవరిది..?

వరల్డ్‌ రియాల్టీ బిగ్గెస్ట్‌ షో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 క్లైమాక్స్‌కు చేరింది. నేటితో ఫైనల్‌ విన్నర్‌‌ ఎవరో తేలిపోనుంది. ఇండియన్‌ స్మాల్‌ స్క్రీన్‌ హిస్టరీలో ఈ రోజు బిగ్‌డే కానుంది. గతేడాది సీజన్‌ 3తో ఫైనల్‌ రోజు భారీ టీఆర్పీ రికార్డు సెట్‌ చేసింది. ఈ రోజు జరుగనున్న ఫైనల్‌ కూడా ఏ మేరకు టీఆర్పీని తీసుకొస్తుందోనని అందరిలోనూ ఆసక్తిగా ఉంది. మరోవైపు విన్నర్ ఎవరా అన్న టాక్ రసవత్తరంగా మారింది. Also Read: చిన్న […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 20, 2020 / 10:52 AM IST
    Follow us on


    వరల్డ్‌ రియాల్టీ బిగ్గెస్ట్‌ షో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 క్లైమాక్స్‌కు చేరింది. నేటితో ఫైనల్‌ విన్నర్‌‌ ఎవరో తేలిపోనుంది. ఇండియన్‌ స్మాల్‌ స్క్రీన్‌ హిస్టరీలో ఈ రోజు బిగ్‌డే కానుంది. గతేడాది సీజన్‌ 3తో ఫైనల్‌ రోజు భారీ టీఆర్పీ రికార్డు సెట్‌ చేసింది. ఈ రోజు జరుగనున్న ఫైనల్‌ కూడా ఏ మేరకు టీఆర్పీని తీసుకొస్తుందోనని అందరిలోనూ ఆసక్తిగా ఉంది. మరోవైపు విన్నర్ ఎవరా అన్న టాక్ రసవత్తరంగా మారింది.

    Also Read: చిన్న సినిమాకు పెద్ద గౌరవం

    ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ అభిమానులు తమ అభిమాన వ్యక్తే విన్నర్ అని ఫిక్స్ అయిపోయారు. అయితే మరికొంత మంది మాత్రం తమ కంటెస్టెంట్ కు చివరి రెండు వారాల్లో పెరిగిన గ్రాఫ్ చూసి వాళ్లే విన్నర్ అనుకుంటే పొరపాటే అని చెప్పాలి. ఎందుకంటే వారి కన్నా ముందే మరికొందరు చాలా స్ట్రాంగ్ ఓటింగ్ తో ఇప్పటి వరకు నిలుస్తూ వచ్చారు.

    మరి వారిని కూడా ఈ చివరి నిమిషంలో గ్రాఫ్ పెంచుకున్న వారు దాటేశారు. ఇవన్నీ ఊహించేసుకోవడం గాల్లో లెక్కలు వేసుకోడం వంటిదే అని చెప్పాలి. మరి ఈ మధ్య కాలంలో ఎవరెవరికి గ్రాఫ్ పెరిగిందో తెలిసిందే. బహుశా వారు టాప్ 3 స్థానాల్లో ఉండొచ్చు ఏమో కాని టైటిల్ విన్నింగ్ వరకు అయితే కష్టమే అని చెప్పాలి.

    Also Read: కేజీఎఫ్ 2 అప్డేట్: అభిమానులకి డిసెంబర్‌ 21న గుడ్ న్యూస్

    ఈ రోజు 6 గంటల నుంచే ఫైనల్‌ ప్రారంభం కానుంది. ఫైనల్‌ లిస్టులో ఐదుగురు మిగిలిపోయారు. మరోవైపు అభిమానులు కూడా ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. తమ కంటెస్టెంట్‌కు మిస్డ్‌ కాల్స్‌ ఎక్కువగా ఉన్నాయని.. తమ అభిమాన కంటెస్టెంట్‌కు ఓటింగ్‌ ఎక్కువగా ఉందంటూ అంచనాల్లో మునిగిపోయారు. ఏది ఏమైనా మరి కొన్ని గంటల్లో మాత్రం విన్నర్‌‌ ఎవరనేది తెలియనుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్