Bigg Boss shocking Condition For Udaya Bhanu: బిగ్ బాస్ సీజన్ 6 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి ఐదు సీజన్లు సూపర్ సక్సెస్ అవ్వడం, బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా ఆకట్టుకోవడంతో.. ఇప్పుడు అందరి దృష్టి ‘సీజన్ 6’ పై పడింది. అందుకే, బిగ్ బాస్ అభిమానులు సీజన్ 6 కోసం వెర్రెక్కిపోయి ఉన్నారు. డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ మెనేజ్ మెంట్ కూడా ప్రస్తుతం సీజన్ 6 పనులను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ఇప్పటికే కొందరు కంటెస్టెంట్స్ ను కూడా ఎంపిక చేశారు.
ఈ ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ‘యాంకర్ ఉదయభాను’ కూడా ఒకరు. టాప్ ప్రయారిటీ లిస్ట్ లో ఆమె మెయిన్ కంటెస్టెంట్ కూడా. ఈ విషయంలోనే భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. బిగ్ బాస్ షో అంటే.. పూర్తి డ్రామా. లోపల పగ, ద్వేషం రగులుతున్నా, పైకి మాత్రం నవ్వుతూ ప్రేమగా మాట్లాడాలి. ఉదయభాను ఏమో ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే చెప్పేసే స్వభావం ఉన్న వ్యక్తి. కాబట్టి.. ఉదయభాను షోలో సెట్ అవ్వకపోవచ్చు అంటూ నెగిటివ్ టాక్ నడుస్తోంది.

అందుకే, బిగ్ బాస్ తెలివిగా ఆమెకు ఒక క్రేజీ కండీషన్ పెట్టాడు. ఈ మేరకు ఉదయభాను చేత అగ్రిమెంట్ కూడా రాయించుకున్నాడు. హౌస్ లో వారిద్దరితో సర్దుకుపోవాలి అంటూ ఉదయభానుకు బిగ్ బాస్ కండీషన్ పెట్టారు. ఇంతకీ ఎవరు ఆ ఇద్దరు అని ఆలోచిస్తున్నారా ?, వారి పేర్లు ‘భూమి ఆరాధ్య, యువ నక్షత్రా’.
Also Read: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు పెరుగుతున్న ఇమేజ్.. కారణమేంటి?
ఎవరు ఈ అమ్మాయిలు ?, బిగ్ బాస్.. ఉదయభానుతో వీళ్లకు ఎందుకు లింక్ పెట్టాడు..?, ఎందుకంటే.. వీరిద్దరూ ఉదయభాను కూతుర్లు. ‘భూమి ఆరాధ్య, యువ నక్షత్రా’ ఇద్దరు కవల పిల్లలు. 2016 లో వీరు జన్మించారు. ఇంతకీ మెయిన్ టాపిక్ ఏమిటంటే.. ఈ సారి, బిగ్ బాస్ ‘హౌస్ లో’ మదర్ సెంటిమెంట్ ను హైలైట్ చేయడానికి ప్లాన్ చేశాడట.

ఈ క్రమంలోనే ఉదయభాను తన ఇద్దరి కూతుర్లతో హౌస్ లోకి వెళ్ళాలని, వారితో హౌస్ లో ఏ కష్టం వచ్చినా సర్దుకుపోవాలని కండీషన్ పెట్టాడట. ముఖ్యంగా కూతుర్లు కోసం లేనిపోని త్యాగాలు చేయకూడదు అని, అలాగే ఇంట్లో ఎలా ఉంటారో.. అలానే హౌస్ లోపల కూడా ఉండాలని.. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకూడదు అని’ బిగ్ బాస్ షరతులు పెట్టాడట. మరి హౌస్ లో ఉదయభాను ఏ రేంజ్ అమ్మ ప్రేమ చూపిస్తోందో చూడాలి.
Also Read: Tollywood : థియేటర్ కు ఎందుకు రావడం లేదు? తప్పు ప్రేక్షకులది కాదు.. టాలీవుడ్ దే..!