Ramarao on Duty movie twitter review : మాస్ మహారాజ రవితేజను సరిగ్గా వాడుకోవాలే కానీ ‘క్రాక్’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సొంతమవుతుంది. రవితేజలోని మాస్, యాక్షన్, కామెడీని బాగా ప్రెజెంట్ చేస్తే బొమ్మ సూపర్ హిట్ అవుతుంది. కిక్, క్రాక్ , రాజా ది గ్రేట్ లాంటి మంచి చిత్రాలను చేయవచ్చు. తాజాగా అలాంటి చిత్రమే వచ్చింది. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ చిత్రం జులై 29న ఈరోజు రిలీజ్ అయ్యింది. వేణు తొట్టెంపూడి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. రజిషా, దివ్యాంశ హీరోయిన్లుగా చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, ట్రైలర్ ఆకట్టుకుంది. రవితేజ పవర్ ఫుల్ డైలాగ్స్ అభిమానులను అలరించింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ ప్రీమియర్స్ పడిపోగా.. చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ లో తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

రవితేజ ఈ సినిమాలో ‘డిప్యూటీ కలెక్టర్’గా ఈ సినిమాలో విశ్వరూపం చూపించాడని ప్రేక్షకులు అంటున్నారు. న్యాయం కోసం ఎంతకైనా తెగించే పవర్ ఫుల్ పాత్రలో రవితేజ నటన హైలెట్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ లో రవితేజ లుక్, మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని చెబుతున్నారు.
ఇక పాటలు యావరేజ్ అని.. బ్రాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సూపర్ అంటున్నారు. శరత్ మండవ తొలి సినిమా అయితే డైరెక్షన్ బాగా చేశాడని అంటున్నారు. రవితేజను చాలా బాగా చూపించాడని కొనియాడుతున్నారు. కొన్ని డైలాగ్స్ గూస్ బాంబ్స్ తెప్పిస్తాయని అంటున్నారు.
ఇక సినిమాలో ఇంటర్వెల్ అదిరిపోయిందని అంటున్నారు. ఫస్ట్ టు గుడ్ అంటూ ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు. రవితేజ మాస్ అవతార్ లో అదిరిపోయాడని అంటున్నారు. సెకండాఫ్ లో మలుపులు.. ట్విస్టులతో స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉందని అంటున్నారు.
ఇక క్లైమాక్స్ సీన్లు ఓ రేంజ్ లో ఉన్నాయని కితాబిస్తున్నారు. ట్విట్టర్ లో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండడంతో మాస్ మహారాజా ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. రవితేజకు హైఓల్టేజ్ మాస్ ప్యాకేజీ ఈ మూవీ అంటూ ప్రేక్షకులు ట్విట్టర్ లో హోరెత్తిస్తున్నారు.
ఇక చాలా మంది ఈ మూవీకి 3, 3.5 చొప్పున రేటింగులు ఇవ్వడం విశేషం. ట్రెండ్ చూస్తుంటే రవితేజకు మరో హిట్ దక్కిందని చెప్పవచ్చు. తొలి రోజు తర్వాత మాత్రమే ఈ సినిమా హిట్, ఫ్లాప్ అన్నది తేలుతుంది.
Recommended Videos