https://oktelugu.com/

Big Boss Shivaji : అల్లు అర్జున్ ని నాలో చూసుకోవడం కరెక్ట్ కాదు అంటూ బిగ్ బాస్ శివాజీ షాకింగ్ కామెంట్స్!

రీసెంట్ గా ఇంద్ర చిత్రం రీ రిలీజ్ అయ్యినప్పుడు ఈ సన్నివేశం రాగానే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఎందుకంటే ఈ క్యారక్టర్ ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ కి పోలి ఉంది అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తూ ట్రోల్ల్స్ చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 30, 2024 / 09:47 PM IST

    Big Boss Shivaji

    Follow us on

    Big Boss Shivaji : ఉన్నది ఉన్నట్టుగా నిర్మొహమాటంగా మాట్లాడే మనస్తత్వం ఉన్న హీరోలలో ఒకరు శివాజీ. హీరో గా క్యారక్టర్ ఆర్టిస్టుగా 96 సినిమాల్లో నటించిన ఆయన, అత్యధిక శాతం సక్సెస్ రేట్ ని చూసిన ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఈయన క్యారక్టర్ రోల్స్ వేసిన సినిమాలన్నీ దాదాపుగా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘ఇంద్ర’ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇందులో శివాజీ గిరి అనే క్యారక్టర్ చేసాడు. చిరంజీవి దగ్గర నమ్మకస్తుడిగా పనిచేస్తూ, అతని మరదలిని ప్రేమించిన శివాజీ, పెళ్లి పీటలు ఎక్కి తాళి కట్టేసమయానికి తన నిజస్వరూపం చూపించి విలన్ గ్యాంగ్ లో కలిసిపోయే సీన్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.

    రీసెంట్ గా ఇంద్ర చిత్రం రీ రిలీజ్ అయ్యినప్పుడు ఈ సన్నివేశం రాగానే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఎందుకంటే ఈ క్యారక్టర్ ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ కి పోలి ఉంది అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తూ ట్రోల్ల్స్ చేస్తున్నారు. ఈ సన్నివేశం వచ్చినప్పుడు థియేటర్స్ లో అల్లు అర్జున్ ని అసభ్యంగా మెగా అభిమానులు వెక్కిరించడం, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మేమంతా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన శివాజీని యాంకర్ ఈ ట్రోల్ల్స్ ప్రస్తావన తీసుకొచ్చి, ఇంద్ర లో మీ క్యారక్టర్ ని అల్లు అర్జున్ కి ఉదహరిస్తున్నారు, దీనిపై మీ స్పందన ఏమిటి అని శివాజీ ని అడగగా ‘అది ముమ్మాటికీ చాలా తప్పు. అయినా వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో మనం తల దూర్చడం కరెక్ట్ కాదు’ అంటూ సమాధానం ఇచ్చాడు.

    అంతే కాకుండా గత ఎన్నికలలో మీరు ఎందుకు ఎమ్మెల్యే గా పోటీ చెయ్యలేదు అని శివాజీ ని యాంకర్ అడగగా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘నా దగ్గర ఎమ్మెల్యే గా పోటీ చేసేంత డబ్బు లేదు, అందుకే ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చెయ్యలేదు’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. శివాజీ సినిమాల్లో సంపాదించిన క్రేజ్ కంటే, బిగ్ బాస్ షో ద్వారా సంపాదించిన క్రేజ్ చాలా ఎక్కువ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బిగ్ బాస్ సీజన్ 7 అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణమైన నలుగురు కంటెస్టెంట్స్ లో మొదటి కంటెస్టెంట్ శివాజీ. ఆయన మైండ్ గేమ్ కి సెల్యూట్ చెయ్యని వారంటూ ఎవ్వరు లేరు, బిగ్ బాస్ చరిత్రలోనే ఈ స్థాయిలో ఇప్పటి వరకు ఎవరు మైండ్ గేమ్ ఆడలేదు. ఈ షో ఇచ్చిన క్రేజ్ తో శివాజీకి సినిమాల్లో ఆఫర్లు బాగా వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన హౌస్ నుండి బయటకి రాగానే విడుదలైన ’90s’ అనే వెబ్ సిరీస్ పెద్ద హిట్ అయ్యింది.