బిగ్ బాస్-4 బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. 16మంది కంటెస్టులతో బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభమైంది. అయితే ఇందులో పెద్దగా సెలబ్రెటీలెవరూ లేకపోవడంతో ప్రేక్షకులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అయితే బిగ్ బాస్-4లో ప్రత్యేక కంటెస్టెంట్ గా గంగవ్వ పాల్గొంది. అందరి కంటే పెద్ద వయస్సురాలిగా గంగవ్వ పాల్గొనడం షోకే హైలెట్ గా నిలిచింది.
Also Read: ఎంటట్మైనెంట్ పక్కా.. సెట్స్ పైకి మారుతి-రవితేజ కాంబో..!
బిగ్ బాస్ హౌస్ లోకి ఆమె అడుగుపెట్టినపుడే హోస్ట్ నాగార్జున కంటెస్టులందరికీ పలు సూచనలు చేశారు. గంగవ్వను కంటెస్టుంతా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు. దీంతో కంటెస్టులంతా పోటీపడి ఆమెను మంచిగా ఉండేందుకు యత్నించారు. ఈక్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వకు మాటకు ఎదురులేకుండా పోయింది. తొలి రెండు వారాలు కూడా బిగ్ బాస్ ప్రేక్షకులను గంగవ్వే ఎక్కువగా ఆకట్టుకుంది.
Also Read: నందమూరి హీరోలు ఇక ఎప్పుడు మారతారో ?
ఆ తర్వాత ఆమె అనారోగ్యం పాలవడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతానంటూ ప్రాధేయపడింది. అయితే బిగ్ బాస్ ఆమెకు చికిత్స చేయించడంతో మళ్లీ హుషారుగా షోలో పాల్గొంది. ఈ షో అందరికీ కంటే ఎక్కువగా ఆమెకే ఓట్లు రావడం గమనర్హం. అయితే తాజాగా ఆమె మరోసారి అనారోగ్యం బారిన పడింది. దీంతో హౌస్ట్ నాగార్జున బిగ్ బాస్ కు రిక్వెస్ట్ చేయడంతో ఆమె షో నుంచి బయటికి వెళ్లింది.