https://oktelugu.com/

అందమైన అమ్మాయిలతో డేటింగ్ అంటూ దోచేస్తారు..

‘‘మా ఫ్రెండ్ షిప్ క్లబ్లో సభ్యులుగా చేరండి.. అందమైన అమ్మాయిలతో చాటింగ్, డేటింగ్ చేయండి..గోల్డ్ మెంబర్ షిప్ తీసుకుంటే హోటల్ లో బుకింగ్ .. మీరిచ్చే అమౌంట్ ను బట్టి   మస్త్  మజా..”అంటూ బ్యూటిఫుల్ అమ్మాయిల బొమ్మలతో  బోల్తా కొట్టించి లక్షలు లాగేస్తోంది ఓ సైబర్ ముఠా.. ఈ ముఠా బారిన పడ్డారంటే చాలు.. ఫిగర్ మాట పక్కనపెట్టు..జేబులు గుల్ల చేసుకోవడం ఖాయం.. Also Read: చైనావోడి బరితెగింపు.. భారత్ ఆక్రమించిందంట.. అసలు కథేంటి? కోల్కతాలోని […]

Written By:
  • NARESH
  • , Updated On : October 14, 2020 1:57 pm
    Follow us on

    ‘‘మా ఫ్రెండ్ షిప్ క్లబ్లో సభ్యులుగా చేరండి.. అందమైన అమ్మాయిలతో చాటింగ్, డేటింగ్ చేయండి..గోల్డ్ మెంబర్ షిప్ తీసుకుంటే హోటల్ లో బుకింగ్ .. మీరిచ్చే అమౌంట్ ను బట్టి   మస్త్  మజా..”అంటూ బ్యూటిఫుల్ అమ్మాయిల బొమ్మలతో  బోల్తా కొట్టించి లక్షలు లాగేస్తోంది ఓ సైబర్ ముఠా.. ఈ ముఠా బారిన పడ్డారంటే చాలు.. ఫిగర్ మాట పక్కనపెట్టు..జేబులు గుల్ల చేసుకోవడం ఖాయం..

    Also Read: చైనావోడి బరితెగింపు.. భారత్ ఆక్రమించిందంట.. అసలు కథేంటి?

    కోల్కతాలోని  జోద్పూర్ గార్డెన్కు చెందిన ఆనంద్ కర్(31), పశ్చిమ బంగాలోని 24పరగణాల జిల్లాలోని చైతన్యపూర్ సౌత్ 24లో నివసించే బుద్ధదేవ్ పాల్(24) యూత్న టార్గెట్ చేసుకుని వారిని షోన్ ఫోన్, డేటింగ్ యాప్ల ద్వారా సంప్రదించి.. మా క్లబ్లో చేరితే  అందమైన అమ్మాయిలతో డేటింగ్, చాటింగ్ చేయవచ్చని వలపు వల విసురుతారు. అందమైన అమ్మాయిల హాట్హాట్ ఫొటోలను వాట్సాప్‌ కు పంపిస్తారు. అలాగే గోల్డ్ షిప్ మెంబర్గా చేరితే హోటల్లో రూం కూడా బుకింగ్ చేయిస్తామంటూ ఊరిస్తారు.. ఒక్కో దానికో రేటు చెప్పి  వేలు, లక్షల రూపాయలను ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు.

    ఈ ముఠా వలలో ఈ ఏడాది జనవరి 7న డేటింగ్ యాప్లో  హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి చిక్కాడు. అమ్మాయిలను సరఫరా చేస్తామని.. వారితో డేటింగ్, చాటింగ్ చేయవచ్చని నమ్మబలికి రూ.48వేలు ఆన్లైన్ ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన నగర వాసి.. తనకు జరిగిన మోసంపై జనవరి 22న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  అతనిచ్చిన ఆధారాలతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

    Also Read: టైమ్స్ నౌ-సీఓటర్ సర్వే: బిహార్ లో గెలుపు ఎవరిదంటే?

    ఇన్స్పెక్టర్ గంగాధర్ ఆధ్వర్యంలో సైబర్ టీం కోల్ కతాకు వెళ్లింది.  నిందితులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంది… తమదైన శైలిలో విచారించి , అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్పై మంగళవారం హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఈ వివరాలను ఏసీపీ కె.వి.ఎం. ప్రసాద్ వెల్లడించారు.  ఈ ముఠా దేశవ్యాప్తంగా డేటింగ్ యాప్ పేరుతో యువకులను మోసం చేస్తోందని చెప్పారు.