Bigg Boss 7 Telugu Promo: తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ మరో సీజన్ కు సిద్ధం అవుతుంది. ఇప్పటికే వరుసగా ఆరు సీజన్లు పూర్తిచేసుకొని ఏడో సీజన్ కోసం ముస్తాబవుతోంది బిగ్ బాస్. మొదటి లో ఇలాంటి షోలు తెలుగులో అంతగా ఆదరణ దక్కించుకోవు అనే మాటలు వినిపించినా కానీ ఒన్స్ షో స్టార్ట్ కావడం ఆలస్యం. తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ కి కనెక్ట్ అయ్యి ఆ షో ను సూపర్ హిట్ చేశారు.
కానీ గత రెండు మూడు సీజన్ల అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదనే చెప్పాలి. బిగ్ బాస్ షో ప్యాట్రన్ గురించి ఒక ఐడియా రావటంతో షో కి వచ్చే కాంటెస్టెంట్స్ ఒక ప్లాన్ ప్రకారం హౌస్ లోకి వచ్చి గేమ్స్ ఆడుతున్నారు. అదే సమయంలో బిగ్ బాస్ టీం కూడా అనుకున్న స్థాయిలో షో ని నిర్వహించటంలో సక్సెస్ కాలేదు. దానికి తోడు బిగ్ బాస్ అంటేనే ఒక బూటకం అని, అక్కడ అంత ప్రీ ప్లాన్ గా జరుగుతుందని, ఓటింగ్ లాంటివి కేవలం ప్రేక్షకులను ఇన్వాల్ చేయడానికి తప్ప, వారి అభిప్రాయాలకు విలువ ఉండదు అంటూ ఆరోపణలు వచ్చాయి.
దీంతో ఈ సీజన్ ను ఎలాగైనా సక్సెస్ చేసి బిగ్ బాస్ తిరిగి పూర్వ వైభవం తీసుకు రావాలని బిగ్ బాస్ టీం గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మంచి కాంటెస్టెంట్స్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా షో ను సరికొత్తగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బిగ్ బాస్ 7 సీజన్ ప్రోమో వీడియో రిలీజ్ చేశారు. రాధ – రమేష్ పాత్రలతో ప్రోమో అదిరిపోయింది.
వీళ్లిద్దరు ఒక ప్రేమ జంట రమేష్ కొండ మీద నుంచి జారి పడబోతుంటే రాధ తన చున్నీ ఇచ్చి పట్టుకోమంటుంది. ఇది మన నాగార్జున కు నచ్చలేదు. ఇలాంటి క్లైమాక్స్ లో ఎన్నో చూశాం. ఎండింగ్ మార్చేద్దాం అంటూ చిటికేస్తే, రాధకు తుమ్ము వచ్చి చున్నీ వదిలేస్తుంది రమేష్ పడిపోతాడు. దీనిని బట్టి చూస్తే ఈ సారి బిగ్ బాస్ ఊహించని ఎండింగ్ లు ఉండేలా డిజైన్ చేస్తున్నట్లు అర్ధం అవుతుంది. మోహన భోగరాజు, బ్యాంకాక్ పిల్ల. స్వాతి నాయుడు, వర్ష, బుల్లెట్ భాస్కర్, ఈటీవీ ప్రభాకర్, శోభా శెట్టి, మై విలేజ్ షో అనిల్ లాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నారని సమాచారం .
https://www.youtube.com/watch?v=mpBjYkgZQMg