Amardeep
Amardeep: బిగ్ బాస్ సీజన్ 7 పదిహేను వారాల పాటు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కాగా గత ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో షో ను ఘనంగా ముగించారు. కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు.ఇక అమర్ రన్నర్ అయ్యాడు. అయితే తాజాగా అమర్ దీప్ తన కుటుంబంతో కలిసి తన సొంత ఊరు అనంతపురం వెళ్ళాడు. అలాగే అమర్ అనంతపురంలో తన ఫ్యామిలీతో కలిసి కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అక్కడ ఓ ట్రస్ట్ తరఫున పేద విద్యార్థులకు, మహిళలకు దుప్పట్లు అందజేశారు. తర్వాత చిన్న పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అమర్ తో పాటు తన భార్య తేజు, అతని తల్లి ఉన్నారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన వారికి భోజనం వడ్డించారు. అమర్ మాట్లాడుతూ .. దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు సాయం చేస్తూనే ఉంటానని అమర్ అన్నాడు. కాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నపుడు అమర్ దీప్ ..’ బయటకు అంటూ పోతే కప్పు తోనే పోతా ‘ అని అనేవాడు.
బిగ్ బాస్ 7 గెలిచి కప్పు పట్టుకుని సొంత ఊరు అనంతపురం వెళ్త అంటూ ఛాలెంజ్ చేసాడు అమర్. కానీ అందరూ ఊహించినట్టే రైతు బిడ్డ గెలిచాడు. టైటిల్ కొట్టాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న అమర్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయితే ఓడిపోయినందుకు తనకు ఏమి బాధ లేదు అని అమర్ అన్నాడు. అతను కోరుకున్న దానికంటే గొప్ప విజయం దక్కిందని చెప్పాడు.
తన అభిమాన నటుడు రవితేజ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. ఇంత కంటే పెద్ద విజయం నాకు మరొకటి లేదు అని వెల్లడించారు అమర్ దీప్. కానీ ఫినాలే రోజు అతనిపై జరిగిన దాడి గురించి ఆవేదన వ్యక్తం చేశారు. అమర్ దీప్ బిగ్ హౌస్లో ప్రశాంత్ పై దురుసుగా ప్రవర్తించాడు. దాంతో ఆవేశంగా ఉన్న పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్ కారు అద్దాలు పగలగొట్టారు. బూతులు తిట్టారు.