https://oktelugu.com/

Christmas Movies: క్రిస్మస్ కు విడుదలై హిట్ కొట్టిన సినిమాలు ఇవే

రెండు భారీ బడ్జెట్‌ సినిమాలు కావడం, అంచనాలు ఎక్కువగానే ఉండడంతో ఈ క్రిస్మస్‌ క్లాష్‌పై ఆసక్తి పెరిగింది. ఈ రెండు సినిమాలు బాగుంటే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 2, 2023 / 11:51 AM IST
    Follow us on

    Christmas Movies: పండుగలు వస్తున్నాయంటే దర్శకనిర్మాతలు ఆ రోజునే రిలీజ్ చేయాలని ఎక్కువగా ఆలోచిస్తుంటారు. పండుగలకు సినిమాల మధ్య పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇందులో సంక్రాంతి, క్రిస్మస్ పండుగలకు పోటీ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే త్వరలో క్రిస్మస్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పండుగ కోసం కూడా పోటీ నెలకొంది. త్వరలో ఈ పర్వదినం సందర్భంగా పలు సంస్థలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటిస్తారు. కొన్ని సంస్థలు, పాఠశాలలు 3 నుంచి 4 రోజుల వరకు హాలీడేస్‌ ఇస్తారు. దీంతో చాలా మంది కుటుంబ సమేతంగా సినిమాలకు వస్తుంటారు. ఇప్పుడు ప్రభాస్ నటించిన ‘సలార్’, షారుఖ్ ఖాన్ నటించిన ‘డుంకీ’ ఈ ఏడాది క్రిస్మస్‌ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రెండు భారీ బడ్జెట్‌ సినిమాలు కావడం, అంచనాలు ఎక్కువగానే ఉండడంతో ఈ క్రిస్మస్‌ క్లాష్‌పై ఆసక్తి పెరిగింది. ఈ రెండు సినిమాలు బాగుంటే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తాయి. గతంలో క్రిస్మస్ సందర్భంగా విడుదలైన పలు హిందీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. అన్నిటికంటే మించి సలార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ గతంలో తెరకెక్కించిన కేజీఎఫ్‌ పార్ట్‌ వన్‌ కూడా క్రిస్మస్‌కు విడుదలై భారీ కలెక్షన్లు సాధించింది. ఇక డుంకీ డైరెక్టర్‌ రాజ్‌ కుమార్‌ హీరాణి తన సూపర్‌హిట్‌ సినిమా పీకేను కూడా క్రిస్మస్‌ సెలవుల్లోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇక అల్లు అర్జున్‌ పుష్ప కూడా ఈ జాబితాలో ఉంది. మరి గతంలో క్రిస్మస్ సందర్భంగా విడుదలై బ్లాక్‌ బస్టర్‌హిట్‌గా నిలిచిన సినిమాలపై ఓ లుక్కేద్దాం రండి.

    పుష్ప: అల్లు అర్జున్ ను పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ ను చేసిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. అయితే పుష్ప సినిమా డిసెంబర్ 2021లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా హిందీలో కూడా విడుదలైంది. తెలుగులోనే కాదు హిందీలో కూడా మంచి కలెక్షన్లు సాధించింది. ఇంతకీ ఎంత అనుకుంటున్నారా? బాలీవుడ్ లో ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది పుష్ప సినిమా.అది మన టాలీవుడ్ సినిమాల రేంజ్ అంటే అని మరో సినిమా కూడా నిరూపించింది.

    కేజీఎఫ్: ‘కేజీఎఫ్’ సినిమా డిసెంబర్ 21, 2018న విడుదలైంది. యష్ నటనకు తోడు ప్రశాంత్ నీల్ డిఫరెంట్‌ టేకింగ్‌తో ఈ సినిమా భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంది. హిందీలో కూడా ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌హిట్‌గా నిలిచింది.

    టైగర్ జిందా హై: సల్మాన్ ఖాన్ తన సినిమాలను ఎక్కువగా రంజాన్‌, క్రిస్మస్‌ పండగ సమయాల్లోనే రిలీజ్‌ చేస్తుంటాడు. ఆయన నటించిన ‘టైగర్ జిందా హై’ 22 డిసెంబర్ 2017న విడుదలైంది. ఈ చిత్రం 570 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.

    పీకే: దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ఇప్పుడు ‘డంకీ’ చిత్రాన్ని క్రిస్మస్‌కు విడుదల చేస్తున్నారు. గతంలో అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ కూడా ఇదే సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం డిసెంబర్ 9, 2014న విడుదలై ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.769 కోట్లు వసూలు చేసింది.

    దిల్‌వాలే , బాజీరావ్ మస్తానీ: షారుఖ్ ఖాన్, కాజోల్ నటించిన దిల్‌వాలే అలాగే రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే జోడీగా నటించిన బాజీరావ్ మస్తానీ రెండు సినిమాలు 2015 డిసెంబర్ 18న విడుదలయ్యాయి. ‘బాజీరావ్ మస్తానీ’ రూ.355 కోట్లు వసూలు చేస్తే, ‘దిల్‌వాలే’ రూ.376 కోట్లు రాబట్టింది.

    సింబ’: కమర్షియల్‌ సినిమాలు చేయడంలో రోహిత్‌ శెట్టిది ప్రత్యేక శైలి. ఆయన దర్శకత్వం వహించిన ‘సింబా’ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం 2018 డిసెంబర్‌ 28 న విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది.

    ‘దబాంగ్ 2’: ‘దబాంగ్ 2’ 21 డిసెంబర్ 2012న విడుదలైంది. ఈ చిత్రం 255 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. సినిమాలో సల్మాన్ ఖాన్ మ్యానరిజం అందరిని ఆకట్టుకుంది.

    దంగల్’: అమీర్ ఖాన్ కెరీర్‌లో ‘దంగల్’కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రం 2016 డిసెంబర్ 23 న విడుదలై రూ. 2,024 కోట్లు వసూలు చేసింది. ‘ధూమ్ 3’: ‘ధూమ్’ సిరీస్‌లోని రెండు చిత్రాలు విడుదలై విజయవంతమయ్యాయి. ఈ క్రమంలోనే మూడో సినిమా వచ్చింది. అమీర్ ఖాన్ ‘ధూమ్ 3’లో ద్విపాత్రాభినయం చేశాడు. డిసెంబర్ 20, 2013న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.558 కోట్లు వసూలు చేసింది.

    డాన్ 2: షారుఖ్ ఖాన్ ‘డాన్ 2’తో కూడా క్రిస్మస్ సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం 203 కోట్ల రూపాయలను రాబట్టింది. ఈ చిత్రం 2011లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా పేరు తెచ్చుకుంది.