Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఫినాలే అస్త్ర గెలుచుకునేందుకు రేస్ మొదలైంది. ఇందుకోసం ఇప్పటికే వీల్ ఛాలెంజ్ ఒకటి నిర్వహించారు. ఇప్పుడు తాజాగా విడుదలైన ప్రోమోలో ఫ్లవర్ ఛాలెంజ్ అంటూ మరో గేమ్ పెట్టారు బిగ్ బాస్.’ పువ్వులే సేకరించాలట’ ఈ టాస్క్ లో భాగంగా యాక్టివిటీ ఏరియాలో ఉన్న పువ్వులు వీలైనన్ని ఎక్కువ సేకరించి గార్డెన్ ఏరియా లో వేయాలి. ఇలా ఎండ్ బజర్ మోగే వరకు ఎవరైతే తక్కువ పువ్వులు తెస్తారో వాళ్ళు రేస్ నుంచి తప్పుకుంటారు.
ఇక బజర్ మోగగానే అందరూ పరుగెత్తుకుంటూ వెళ్లి పూలు సేకరించారు. ఇక శోభా దొరికిన పూలు అన్నీ టీ షర్ట్ లో కుక్కేసింది. దాదాపు అందరూ పూలు టీ షర్ట్ లో తోసేశారు. ఇక శివాజీ మాత్రం దోసిట్లో తీసుకుని వచ్చాడు. ఇక యావర్ శోభా దగ్గరకు రావడం తో ‘ప్లీజ్ .. యావర్ పక్కకి వెళ్లి తీసుకో .. అక్కడ కూడా పూలు ఉన్నాయి’ అంటూ గోల చేసింది. ఇక ఎండ్ బజర్ సమయానికి శివాజీ, శోభా తక్కువ తేవడంతో రేస్ నుంచి అవుట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు.
అయితే వాళ్ళు తెచ్చిన పూలు పోటీలో ఉన్న ఒకరికి ఇవ్వొచ్చు అని బిగ్ బాస్ చెప్పారు. దీంతో అమర్ ‘ అన్నా హెల్ప్ చేస్తానని మాటిచ్చావ్ .. టికెట్ టూ ఫినాలే కోసం నాకు ఒక సాయం చేస్తానన్నావ్ గుర్తుంచుకో’ అంటూ శివాజీ ని అడిగాడు. నీకు శోభా ఇస్తుంది కదరా .. తాను ఇవ్వక పోతే నీకే ఇచ్చేవాడిని అంటూ తప్పించుకోవాలని చూసాడు శివాజీ. ఇంతలో టాస్క్ లో ఓడిపోయినందుకు శోభా ఏడ్చేసింది. తెగ బాధ పడుతూ కన్నీరు పెట్టుకుంది.
ఇంతలోనే బిగ్ బాస్ భలే షాక్ ఇచ్చాడు. ఇద్దరు కలిసి ఒక్కరికి మాత్రమే మీ పాయింట్స్ ఇవ్వాలి అంటూ మెలిక పెట్టారు. దీంతో శివాజీ షాక్ అయ్యాడు. మరి ఈసారైనా అమర్ కి సపోర్ట్ చేస్తాడా .. లేదంటే పోయిన వారంలో చేసినట్టు ఇచ్చిన మాట తప్పి ఎవరికైనా ఇస్తాడో చూడాలి మరి.
Today’s promo 2 Finale Astra#BiggBossTelugu7 pic.twitter.com/Ilm4YGBGZ9
— BiggBossTelugu7 (@TeluguBigg) November 28, 2023