Pragathi: సాధించాలనే తపన ఉండాలి కానీ వయసు అడ్డు కాదని నిరూపించింది నటి ప్రగతి. సినిమాల్లో అమ్మ పాత్రలు చేసే ప్రగతి నిజ జీవితంలో ఎంత స్ట్రాంగ్ అనేది తెలియజేసింది. ఏకంగా నేషనల్ వైడ్ కాంపిటీషన్ లో ప్రైజ్ కొట్టి అందరినీ షాక్ కి గురి చేసింది. కొన్నాళ్లుగా నటి ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యారు. ఆమె గంటల తరబడి జిమ్ లో గడుపుతున్నారు. డాన్స్ వీడియోలు చేస్తూ ఆకర్షిస్తున్నారు. ఏదో ఫిట్నెస్ కోసం వ్యాయామం అనుకుంటే ఏకంగా స్పోర్ట్స్ కి సిద్ధమైంది.
బెంగుళూరు వేదికగా జరిగిన 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిప్టింగ్ ఛాంపియన్ షిప్ జరిగింది. ఈ పోటీల్లో ప్రగతి పాల్గొంది. ప్రొఫెషనల్ లిఫ్టర్స్ తో పోటీ పడిన ప్రగతి ఏకంగా 3వ స్థానం అందుకుంది. దీనికి సంబందించిన వీడియో ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. అభిమానులు, చిత్ర ప్రముఖులు, సన్నిహితులు ప్రగతిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ప్రగతి ఫిట్నెస్, డాన్స్ వీడియోలపై అనేక ట్రోల్స్ వచ్చాయి. ఎగతాళి చేసిన వాళ్ళకు చెంపెట్టులా ప్రగతి ఒక అద్భుతమైన విజయం అందుకుంది. ప్రగతి కెరీర్ హీరోయిన్ గా మొదలైంది. 1994లో విడుదలైన వీట్ల విశేషంగా ఆమె డెబ్యూ మూవీ. ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. 1997 వరకు ఆమె హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది. కెరీర్లో ఎదుగుతున్న రోజుల్లో ఆమె పెళ్లి చేసుకుని పరిశ్రమకు దూరమైంది.
2002లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చింది. మహేష్ బాబు-ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన బాబీ మూవీలో మహేష్ బాబు మదర్ రోల్ చేసింది. తక్కువ వయసులోనే ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ప్రగతి భర్తతో విడిపోయింది. ఒక కూతురు కాగా ప్రగతి వద్దే పెరుగుతుంది. ప్రగతి రెండో వివాహం చేసుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ పుకార్లను ఆమె ఖండించారు.
View this post on Instagram