https://oktelugu.com/

Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ ఓటీటీ బూతు బాగోతం: 120 మందితో ఎఫైర్ అంటా.. ఆ కంటెస్టెంట్ పరువు పాయే!

Bigg Boss OTT Telugu:  బిగ్ బాస్ మొదలైన నాలుగో రోజే కంటెస్టెంట్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు పొడచూపుతున్నాయి. దానికి తోడు చాలెంజర్స్ వర్సెస్ వారియర్స్ అనే టాస్కులతో బిగ్ బాస్ కూడా కాస్తంత పెట్రోల్ పోసి చలి కాచుకుంటున్నారు. అది ప్రేక్షకులకు బాగానే వినోదాన్ని పంచుతున్నా ఇంటి సభ్యుల మధ్య మాత్రం గొడవలతో బూతు బాగోతం నడుస్తోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ లో పాత కంటెస్టెంట్లు , కొత్త […]

Written By:
  • NARESH
  • , Updated On : March 2, 2022 / 10:57 AM IST
    Follow us on

    Bigg Boss OTT Telugu:  బిగ్ బాస్ మొదలైన నాలుగో రోజే కంటెస్టెంట్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు పొడచూపుతున్నాయి. దానికి తోడు చాలెంజర్స్ వర్సెస్ వారియర్స్ అనే టాస్కులతో బిగ్ బాస్ కూడా కాస్తంత పెట్రోల్ పోసి చలి కాచుకుంటున్నారు. అది ప్రేక్షకులకు బాగానే వినోదాన్ని పంచుతున్నా ఇంటి సభ్యుల మధ్య మాత్రం గొడవలతో బూతు బాగోతం నడుస్తోంది.

    natraj master

    బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ లో పాత కంటెస్టెంట్లు , కొత్త వారితో యమరంజుగా సాగుతోంది. గత సీజన్లలో పాల్గొన్న వారిని వారియర్స్ అని.. కొత్త వాళ్లను చాలెంజర్స్ అని రెండు టీంలుగా విభజించి చిచ్చుపెట్టాడు. వీళ్లకు పోటాపోటీగా టాస్కులు ఇస్తున్నారు. దీంతో ఈ రెండూ గ్రూపులు కొట్టుకోవడమే తక్కువ అన్నట్టుగా గేమ్ ఆడుతున్నాయి. షో ఆరంభం నుంచే ఈ రచ్చ రచ్చ కొనసాగుతోంది.

    Also Read:   బ‌య‌ట గొడ‌వ‌ల‌ను హౌస్ లో చూపించుకుంటున్న కంటెస్టెంట్లు.. ముమైత్ అలాంటిదే అంటున్న శ్రీరాపాక‌..!

    ఈసారి ఓటీటీలోకి బిగ్ బాస్ ఎక్కడంతో గతంలో లేనట్టుగా బోల్డ్ టాస్కులు కూడా బిగ్ బాస్ పెట్టేశాడు. తాజాగా కంటెస్టెంట్లకు ‘నో ఫిల్టర్’ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో కంటెస్టెంట్లు ఎంతో బోల్డుగా ఉన్న ప్రశ్నలను ఎదుర్కొంటారు. దారుణం ఏంటంటే.. యాంకర్ శివకు ‘మీరు ఎప్పుడైనా పెళ్లైన మహిళతో డేట్ చేశారా?’ అన్న ప్రశ్న ఎదురైంది. అందరికీ ఇలాంటి కామ, ఎఫైర్, లవ్ ప్రశ్నలే వేశారు.

    Bigg Boss OTT Telugu

    నటరాజ్ మాస్టర్ కు అయితే ‘మీకు పెళ్లికి ముందు ఎంతమందితో ఎఫైర్’ ఉంది లాంటి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన మొహమాట పడకుండా 120 మందితో ఉండేది. వాళ్లందరూ నన్ను ప్రేమించారు. కానీ నేను చేయలేదు’ అని అంతే బోల్డ్ గా సమాధానం ఇచ్చాడు. తర్వాత నోరుజారి సరిదిద్దుకున్నాడు. ఇక కమెడియన్ మహేష్ విట్టా ఇందులో కలగజేసుకొని ‘వాళ్లందరూ ఇప్పుడు ఓట్లు వేస్తే మీరు టాప్ 5కి వచ్చేస్తారు’ అని పంచ్ కూడా వేశాడు.ఇలా బిగ్ బాస్ ఓటీటీ ఇదివరకూ ఎప్పుడూ లేనంతగా.. కావాల్సినంత బోల్డ్ తనాన్ని, ఎంటర్ టైన్ మెంట్ పంచుతూ ముందుకెళుతోంది.

    Also Read: భీమ్లానాయక్ ను కొట్టే సినిమా ఏది?

    Tags