https://oktelugu.com/

Bigg Boss Non Stop: హౌస్‌లో హంగామా సృష్టిస్టున్న ముమైత్‌.. ఛాలెంజ‌ర్స్ టీమ్‌తో పెద్ద గొడ‌వ‌

Bigg Boss Non Stop: రెండో రోజు నుంచే బిగ్ బాస్ రసవత్తరంగా మారుతోంది. బిగ్ బాస్ అభిమానులు కోరుకున్నట్టుగానే కావాల్సినంత బోల్డ్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు గొడవలు నడుస్తున్నాయి. అయితే గతంలో టెలివిజన్ లో వచ్చినప్పటి కంటే కూడా ఈసారి ఓ రేంజ్ లో కంటెస్టెంట్ మధ్యలో గొడవలు నడిచేలా క‌నిపిస్తోంది. ఇక ఈ సీజన్లో 17 మందిని హౌస్ లోకి పంపించాడు బిగ్ బాస్. ఇందులో సరికొత్త టాస్క్ లను సృష్టిస్తున్నాడు. పాతవారిని […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 2, 2022 / 11:14 AM IST
    Follow us on

    Bigg Boss Non Stop: రెండో రోజు నుంచే బిగ్ బాస్ రసవత్తరంగా మారుతోంది. బిగ్ బాస్ అభిమానులు కోరుకున్నట్టుగానే కావాల్సినంత బోల్డ్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు గొడవలు నడుస్తున్నాయి. అయితే గతంలో టెలివిజన్ లో వచ్చినప్పటి కంటే కూడా ఈసారి ఓ రేంజ్ లో కంటెస్టెంట్ మధ్యలో గొడవలు నడిచేలా క‌నిపిస్తోంది. ఇక ఈ సీజన్లో 17 మందిని హౌస్ లోకి పంపించాడు బిగ్ బాస్. ఇందులో సరికొత్త టాస్క్ లను సృష్టిస్తున్నాడు.

    Bindu Madhavi

    పాతవారిని వారియర్స్ గా మార్చి కొత్తవారిని ఛాలెంజర్స్ గా రంగంలోకి దింపాడు. ఈ రెండు టీముల మధ్య టాస్క్ లు పెడుతూ ప్రతి టీమ్ నుంచి ముగ్గురు పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నాడు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో స్టిక్కర్లను అంటించే టాస్క్ ను పెట్టాడు. రెండు టీములు కలిసి ఒకరిమీద మరొకరు స్టిక్కర్లను అంటించుకోవాలి.

    Also Read:   బిగ్ బాస్ ఓటీటీ బూతు బాగోతం: 120 మందితో ఎఫైర్ అంటా.. ఆ కంటెస్టెంట్ పరువు పాయే!

    రూల్ ప్రకారం ఒక్కో టీమ్ నుంచి ముగ్గురు చొప్పున టాస్క్ ను ఆడారు. అయితే వారియర్స్ టీంకి ముమైత్ ఖాన్ సంచాల‌క్‌గా వ్యవహరించగా చాలెంజర్స్ టీంకి యాంకర్ శివ సంచాలక్ గా ఉన్నాడు. టాస్క్ లో భాగంగా స్టిక్కర్లను లెక్కించేందుకు ముమైత్ ఖాన్ ఛాలెంజర్స్ టీం వద్దకు వెళ్లినప్పుడు అంద‌రు అనుకున్న‌ట్టుగానే వారితో గొడవకు దిగింది. స్టిక్కర్లను లెక్కించే సమయంలో బిందుమాధవి వచ్చి మధ్యలో ముమైత్ ఖాన్ తో వారించింది.

    Mumaith Khan

    ఇంకేముంది ముమైత్ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. తన వారియర్స్ టీం నుంచి స్టిక్కర్లను లెక్కించే టైంలో ఎవరూ గొడవకు దిగలేదని.. కానీ ఛాలెంజర్స్ టీమ్ నుంచి బిందు మాట్లాడడం ఏంటి అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇలా రెచ్చిపోతున్న ముమైత్ ను సర్దిచెప్పడానికి అఖిల్ ఎంత ట్రై చేసినా ముమైత్ మాత్రం తగ్గేదే లే అన్నట్టు వారిపై ఫైర్ అయిపోయింది. చూస్తుంటే రానురాను ముమైత్ మరింత‌గా చెల‌రేగిపోయి గొడ‌వ ప‌డేట్టు క‌నిపిస్తోంది.

    Also Read:  భీమ్లానాయక్ కి నైజాంలో తిరుగులేని రికార్డ్

    Tags