https://oktelugu.com/

Pawan Kalyan- Allu Arjun: ప‌వ‌న్‌ను బ‌న్నీ మ‌ర్చిపోయాడా.. సోష‌ల్ మీడియాలో ఏందీ ర‌చ్చ‌..!

Pawan Kalyan- Allu Arjun: టాలీవుడ్ లో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఎవరికి వారు తమ జోనర్ లో సినిమాలు చేస్తూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరూ పెద్ద బ్యాగ్రౌండ్ నుండి వచ్చినా కూడా తమ సొంత ఇమేజ్ ను డెవలప్ చేసుకున్నారు. వారిలో ఉన్న కష్టపడే తత్వమే వారిని స్టార్లుగా మార్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒకప్పుడు వీరందరూ కూడా మెగాహీరోలుగానే గుర్తింపు పొందినా.. […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 2, 2022 / 10:48 AM IST
    Follow us on

    Pawan Kalyan- Allu Arjun: టాలీవుడ్ లో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఎవరికి వారు తమ జోనర్ లో సినిమాలు చేస్తూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరూ పెద్ద బ్యాగ్రౌండ్ నుండి వచ్చినా కూడా తమ సొంత ఇమేజ్ ను డెవలప్ చేసుకున్నారు. వారిలో ఉన్న కష్టపడే తత్వమే వారిని స్టార్లుగా మార్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

    Pawan Kalyan- Allu Arjun

    అయితే ఒకప్పుడు వీరందరూ కూడా మెగాహీరోలుగానే గుర్తింపు పొందినా.. ఆ తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ల మధ్యలో ఈగో క్లాషేస్ వచ్చాయి అంటున్నారు వారి అభిమానులు. చాలాసార్లు వీరి ఇద్దరి అభిమానుల మధ్య పెద్ద వారే నడిచింది. చాలా ఈవెంట్లలో లో ఆ వార్ స్పష్టంగా కనిపించింది. అయితే పైకి మాత్రం మేమంతా మెగాహీరోలమే, ఒక్కటే అంటూ చెబుతున్నా కూడా చాలా సార్లు వారి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనేది బయట పడుతుంది.

    Also Read:   భీమ్లానాయక్ ను కొట్టే సినిమా ఏది?

    ఇక ఇప్పుడు బన్నీ చేసిన పని పవన్ అభిమానులకు మండేలా చేసింది. భీమానాయక్ విషయంలో మెగా హీరోలు అందరూ సోషల్ మీడియాలో విష్ చేశారు. పవన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కానీ బన్నీ మాత్రం ఎలాంటి పోస్ట్ చేయలేదు, కనీసం విషెస్ కూడా చెప్పలేదు. దీంతో పవన్ అభిమానులు బన్నీపై విరుచుకుపడుతున్నారు. వ‌రుస బ్లాక్ బస్టర్ లతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు అని, ఇప్పుడు అతనికి పవన్ కళ్యాణ్ అంటే గుర్తుకు రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Pawan Kalyan- Allu Arjun

    ఒకప్పుడు బన్నీ సినిమాల ఆడియో ఫంక్షన్లకు పవన్ వచ్చి సపోర్ట్ చేశాడని, ఆ విషయాలన్నీ ఇప్పుడు బన్నీ మర్చిపోయాడంటూ సోషల్ మీడియాలో ప‌వ‌న్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఐకాన్ సార్ గా మారిపోయాడు కాబట్టి మెగా హీరోలను పక్కన పెడుతున్నాడంటున్నారు. ఇక ఈ విషయంపై బన్నీ ఫాన్స్ కూడా ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు. బ‌న్నీ సొంతంగా ఎదిగాడని, కష్టపడే తత్వం అతన్ని ఐకాన్ స్టార్ గా మార్చింది అంటూ చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో మెగా హీరోలకు ఎవరికీ లేనంత ఫాలోయింగ్ ఒక్క‌ బన్నీకే ఉందని గుర్తు చేస్తున్నారు. ఇలా భీమ్లా నాయక్ విషయంలో పవన్ ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ అన్నట్టు రగడ జరుగుతుంది సోషల్ మీడియాలో. అయితే ఫ్యాన్స్ వరకే జరుగుతున్న ఈ వార్ మీద హీరోలు మాత్రం స్పందించలేదు. మరి ఈ రగడ ఇంకెంత ముందుకు వెళ్తుందో చూడాలి.

    Also Read:  రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, సర్కారి వారి పాట, ఆచార్య లలో ఏది సూపర్ హిట్ సినిమా?

    Tags