Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Non Stop: బ‌య‌ట గొడ‌వ‌ల‌ను హౌస్ లో చూపించుకుంటున్న కంటెస్టెంట్లు.. ముమైత్ అలాంటిదే...

Bigg Boss Non Stop: బ‌య‌ట గొడ‌వ‌ల‌ను హౌస్ లో చూపించుకుంటున్న కంటెస్టెంట్లు.. ముమైత్ అలాంటిదే అంటున్న శ్రీరాపాక‌..!

Bigg Boss Non Stop: ఇన్ని రోజులు టీవీ లో ప్రసారం అయిన బిగ్ బాస్ లో చాలా వరకు బోల్డ్ కంటెంట్ మిస్ అయ్యేది. దీనికి సెన్సార్ ఉంటుంది కాబట్టి కొంచెం సాఫ్ట్ గా ఉండేది. అయితే గొడవలు, కొట్లాటలకు ఏం తక్కువగా ఉండేవి కాదు. ఇప్పుడు ఎలాంటి సెన్సార్ రూల్స్ లేని ఓటీటీటీ రిలీజ్ అవుతుండటంతో బోల్డ్ కంటెంట్ కు కొదవ లేకుండా పోయింది. మొదటి రోజు చప్పగా సాగినట్లు అనిపించినా.. రెండో రోజు నుంచి టాస్క్ లు పెట్టడంతో కంటెస్టెంట్స్ మధ్యలో గొడవలు స్టార్ట్ అయిపోయాయి. ఒకరిపై ఒకరు ఓ రేంజ్ లో తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు.

Bigg Boss Non Stop
sri rapaka, mumaith khan

ఇంకా చెప్పాలంటే బయట వారి మధ్య ఉన్న గొడవలను హౌస్ లో చూపించుకుంటున్నారు. మొన్న ముమైత్ ఖాన్, తేజస్విని కలిసి సిగరెట్ తాగుతూ ఎంత రచ్చ చేశారో చూశాం. ఇక హౌస్ లో ఉన్న పాత‌వారిని ఛాలెంజర్స్ గా కొత్తవారిని వారియర్స్ గా మార్చేసి వారి మధ్యలో డేర్ చాలెంజ్ టాస్క్ ను పెట్టాడు బిగ్ బాస్. ఇందులో చాలెంజర్స్ విజయం సాధించే దిశగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కొబ్బరికాయ పొట్టు తీసే టాస్క్ లో ఆర్ జె చైతు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ టాస్క్ లో ముమైత్, శ్రీ రాపాక మధ్య పెద్ద వార్ నడిచింది.

Also Read:  బిగ్ బాస్ ఓటీటీ: అవినాష్ -అరియానా కామెడీ ట్రాక్.. అజయ్ తో రిపీట్

శ్రీ రాపాక మాట్లాడుతూ గతంలో తనకు ముమైత్ ఖాన్ కు జరిగిన గొడవలను పబ్లిక్ గా చెప్పేసింది. వాటిని మనసులో పెట్టుకుని తనను టార్గెట్ చేస్తోందంటూ నిప్పులు చెరిగింది. అయితే ముమైత్ ఖాన్ చేస్తున్న పనుల వల్ల ఆమెనే అందరికీ టార్గెట్ అవుతుందంటూ సెటైర్ వేసింది. ఇక మధ్యలో నటరాజు మాస్టర్ వచ్చి కొబ్బరికాయ పిలక తీయడంలో వారియర్స్ సరిగా చేయడం లేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇక అఖిల్ మధ్యలో కలుగజేసుకోవటం పైన శ్రీ రాపాక మండిపడింది.

Bigg Boss Non Stop
Bigg Boss Non Stop

అంతకుముందు గుడ్ వైబ్స్ టాస్క్ లో కూడా ఎక్కువమంది తనను తాను థ‌మ్స్ డౌన్ అంటూ చెప్పార‌ని రాపాక‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా అందరూ తనను టార్గెట్ చేస్తున్నారు అంటూ వాపోయింది. అయితే శ్రీ రాపాక మాటలపై ముమైత్ ఖాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇద్దరూ కాసేపు మాటల యుద్ధం సాగించారు. రెండో రోజే ఇలా పాత గొడవలను తీసుకొచ్చి కంటెస్టెంట్ మధ్యలో చిచ్చు పెడుతున్నారు అంటే.. ఇక రాబోయే రోజుల్లో మరింత మసాలా గ్యారెంటీ అంటున్నారు బిగ్ బాస్ ప్రియులు. అసలే బోల్డ్ కంటెంట్ ఇవ్వడానికి రెడీగా చాలా మంది పాత కంటెస్టెంట్ లు ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో బిగ్ బాస్ అభిమానులకు ఎలాంటి డోకా ఉండదని అంటున్నారు.

Also Read: భీమ్లానాయక్ ను కొట్టే సినిమా ఏది?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

2 COMMENTS

  1. […] Bigg Boss Non Stop: రెండో రోజు నుంచే బిగ్ బాస్ రసవత్తరంగా మారుతోంది. బిగ్ బాస్ అభిమానులు కోరుకున్నట్టుగానే కావాల్సినంత బోల్డ్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు గొడవలు నడుస్తున్నాయి. అయితే గతంలో టెలివిజన్ లో వచ్చినప్పటి కంటే కూడా ఈసారి ఓ రేంజ్ లో కంటెస్టెంట్ మధ్యలో గొడవలు నడిచేలా క‌నిపిస్తోంది. ఇక ఈ సీజన్లో 17 మందిని హౌస్ లోకి పంపించాడు బిగ్ బాస్. ఇందులో సరికొత్త టాస్క్ లను సృష్టిస్తున్నాడు. […]

  2. […] OKtelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోను క్రేజ్ సంపాదించుకున్న సన్నీ లియోన్… తాజాగా నటించిన వెబ్ సిరీస్ ‘అనామిక’. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ షోలో సన్నీ “స్పై” పాత్రలో కనిపించనుంది. విక్రమ్ భట్ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ‘MX ప్లేయర్’లో మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ఉచితంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, హిందీ భాషల్లో అందరికి అందుబాటులో ఉండనుంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular