Kajal Aggarwal: బాడీ షేమింగ్‌కు పాల్పడిన వారిపై కాజల్ అగర్వాల్ స్పందించిన తీరుకు మద్దతుగా హీరోయిన్లు స్పందించారు. ‘నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అందంగానే ఉన్నావ్’ అని సమంత చెప్పుకొచ్చింది. ‘నువ్వు ప్రతిదశలో పర్‌ఫెక్ట్, నీ చుట్టూ చాలా ప్రేమ ఉంది బేబీ’ అని మంచు లక్ష్మీ సపోర్ట్ చేసింది. ‘నిజమే.. ఇంతకంటే మాటల్లో చెప్పలేం! నా గార్జియస్’ అని నిషా అగర్వాల్ చెప్పుకొచ్చింది.

ఇంతకీ అసలు ఏమి జరిగింది అంటే… గర్భవతిగా ఉన్న కాజల్ అగర్వాల్ తన బేబీ బంప్ ఫోటోను రీసెంట్ గా అభిమానులతో పంచుకుంది. దాంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ బాగా లావుగా కూడా కనిపిస్తుంది. దీంతో ప్రెగ్నెంట్ గా ఉన్న కాజల్ అగర్వాల్ పై కొంతమంది ఆకతాయిలు నెట్టింట్లో ట్రోల్ చేస్తూ అసభ్యకరంగా మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు.
Also Read: హిజాబ్ వివాదం: ఏమిటీ మత మౌఢ్యం?
కాజల్ ఆంటీ అని ఒకరు, కాజల్ అగర్వాల్ తన కడుపును దాచుకుంటుంది అని మరొకరు.. కాజల్ ఫిజిక్ చెడిపోయింది అని ఇంకొకరు.. ఇలా ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా తన గురించి బ్యాడ్ గా కామెంట్లు పెడుతున్న వారి గురించి కాజల్ స్పందించింది. ‘నాపై బాడీ షేమింగ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నేను నా శరీరంలో, నా జీవితంలో కలిగిన మార్పులను ఎంజాయ్ చేస్తున్నా.

అర్థం చేసుకోలేని మూర్ఖుల కోసం చెబుతున్నా. గర్భవతి అయ్యాక హార్మోనుల వల్ల శరీరంలో మార్పులు జరుగుతాయి. ఫలితంగా బరువు పెరగటం సహజం’ అని కామెంట్ చేసేవారికి కౌంటర్ ఇచ్చింది. అయితే, ఈ కౌంటర్ కు మిగిలిన హీరోయిన్లు సపోర్ట్ చేస్తూ పై విధంగా మెసేజ్ లు చేశారు.
Also Read: రవితేజ ఖిలాడి ఎలా ఉంది..? ట్విట్టర్ రివ్యూ
[…] […]