https://oktelugu.com/

Bigg Boss Non Stop Telugu: అత‌ని మీదే మ‌న‌సు పారేసుకుంటున్న అమ్మాయిలు.. బిగ్ బాస్‌లో కొత్త టాస్క్‌

Bigg Boss Non Stop Telugu: ఇప్పటివరకు టీవీలో ఒక గంటపాటు అలరించిన బిగ్ బాస్.. ఇక నుంచి 24 గంటల పాటు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయిపోయింది. అయితే బిగ్ బాస్ అంటేనే కంటెస్టెంట్స్ మధ్యలో ఏదో ఒక గొడవలు జరగడం చాలా కామన్. బిగ్ బాస్ ఏదో ఒక మెలిక పెట్టి వారి మధ్యలో చిచ్చు పెడుతూ ఉంటాడు. ఎప్పుడు ఎలాంటి టాస్క్ ఇస్తాడో, ఎలాంటి సర్ ప్రైజ్ లు ప్లాన్ […]

Written By: , Updated On : March 1, 2022 / 11:01 AM IST
Follow us on

Bigg Boss Non Stop Telugu: ఇప్పటివరకు టీవీలో ఒక గంటపాటు అలరించిన బిగ్ బాస్.. ఇక నుంచి 24 గంటల పాటు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయిపోయింది. అయితే బిగ్ బాస్ అంటేనే కంటెస్టెంట్స్ మధ్యలో ఏదో ఒక గొడవలు జరగడం చాలా కామన్. బిగ్ బాస్ ఏదో ఒక మెలిక పెట్టి వారి మధ్యలో చిచ్చు పెడుతూ ఉంటాడు. ఎప్పుడు ఎలాంటి టాస్క్ ఇస్తాడో, ఎలాంటి సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తాడో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. మరి ఇప్పుడు 24 గంటల పాటు ఎలాంటి టాస్క్ లు విధిస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Bigg Boss Non Stop Telugu

Bigg Boss Non Stop Telugu

అయితే ఈసారి గతంలో పాల్గొన్న కంటెస్టెంట్స్ తో పాటు కొత్తవారు కూడా జాయిన్ అయ్యారు. పాతవారిని ఛాలెంజర్స్ గా కొత్తవారిని వారియర్స్ గా మార్చి ఒక టాస్క్ కూడా పెట్టేశాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే సరికొత్తగా గుడ్ వైబ్స్ వర్సెస్ బ్యాడ్ వైబ్స్ అనే టాస్క్ ను ఇచ్చాడు. ఈ టాస్క్ లో అందరు అమ్మాయిలు ఒక అబ్బాయి మీదనే ఫోకస్ పెట్టారు. అతని మీదనే గుడ్ వైబ్స్ ఉన్నాయంటూ చెప్పేస్తున్నారు.

Also Read:  జాతీయ రాజకీయాలపై ‘కేసీఆర్’ అసలు ప్లాన్ ఇదే!

అతని పేరు అజయ్. మొదటిరోజు ఓటీటీలో ప్రసారం అయిన షోలో ముమైత్ ఖాన్ మాట్లాడుతూ అజయ్ మీద చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయంటూ చెప్పింది. అరియానా కూడా అజయ్ పేరునే చెప్పింది. అతని స్పాండిటీ చాలా బాగుంది అంటూ నవ్వేసింది. ఇక అఖిల్ కూడా అజయ్ పేరునే మోశాడు. అతనితో ఫ్రెండ్ షిప్ బాగుంది అంటూ మెచ్చుకున్నాడు.

Bigg Boss Non Stop Telugu

Bigg Boss Non Stop Telugu

ఇక బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి, హమీద కలిసి పెద్ద రచ్చనే చేశారు. గట్టిగా హ‌గ్ చేసుకుంటూ అషు రెడ్డికి లైక్ కొట్టింది హమీద. ఇక తేజస్వి మదివాడ గుడ్డలు నచ్చే లైక్ చేస్తున్నట్టు బిందుమాధవి కూడా తెలిపింది. ఈ లేడీస్ అందరూ కలిసి చాలా బోల్డ్‌ కంటెంట్ ను పండించారు. అయితే అమ్మాయిలు అందరూ కలిసి ఎక్కువగా అజయ్ ను లైక్ చేయడం ఇక్కడ విశేషం. ఈ టాస్క్ కంటెస్టెంట్స్ మధ్యలో ఇగోను పెంచింది అనే చెప్పుకోవాలి. మరి ముందు ముందు బిగ్ బాస్ ఇలాంటి సరికొత్త టాస్క్ లు ఇంకెన్ని పెడతాడో చూడాలి.

Also Read:  పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో కూడా హీరోనే!

 

Bheemla Nayak 5th Day Total Collections | Bheemla Nayak Sensational Box Office Collections

Tags