Bigg Boss Keerthi Bhat: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ కీర్తి భట్ మూడు ముళ్ల బంధంలో అడుగుపెడుతుంది. ఆమె నిశ్చితార్థం వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోరుకున్న ప్రియుడితో ఏడడుగులు వేయనుంది. పరిశ్రమలోని తన సన్నిహితులు, స్నేహితులను ఎంగేజ్మెంట్ కి ఆహ్వానిస్తుంది. కన్నడ పరిశ్రమకు చెందిన కీర్తి తెలుగులో మనసిచ్చి చూడు, కార్తీకదీపం సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం మధురానగరిలో సీరియల్ చేస్తుంది. ఈమెకు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు.
బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న కీర్తి మరింత పాపులారిటీ రాబట్టారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి వెళ్లి టాప్ ఫైవ్ ప్లేస్ రాబట్టింది. ఈ సీజన్లో ఫైనల్ కి వెళ్లిన ఒకే ఒక అమ్మాయి కీర్తి. తన ఆటతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కాగా కీర్తి కొంతకాలంగా నటుడు విజయ్ కార్తీక్ ని ప్రేమిస్తున్నారు. వీరి ప్రేమను పెద్దలకు తెలియజేశారు. కీర్తికి ఎవరూ లేరు. విజయ్ కార్తీక్ పేరెంట్స్ కీర్తిని కోడలు చేసుకునేందుకు అంగీకరించారు. మరో ట్విస్ట్ ఏంటంటే కీర్తికి పిల్లలు పుట్టరట. అయినప్పటికీ కోడలు చేసేందుకు కార్తీక్ ఫ్యామిలీ ముందుకు వచ్చారు.
కీర్తి తన కుటుంబాన్ని ఒక ప్రమాదంలో కోల్పోయింది. కుటుంబ సభ్యులు చనిపోవడంతో కీర్తి అనాథ అయ్యింది. అయినవాళ్లు కూడా చేరదీయలేదట. ఒక్కటే స్వశక్తితో నటిగా ఒక స్థాయికి ఎదిగింది. కీర్తి కాబోయే భర్తతో పాటు జానకి కలగనలేదు సెట్స్ కి వచ్చి ప్రియాంక సింగ్, అమర్ డీప్ చౌదరిని ఎంగేజ్మెంట్ కి ఆహ్వానించింది. ఆగస్టు 20న కీర్తి ఎంగేజ్మెంట్ అని సమాచారం.
తెలుగు, కన్నడ పరిశ్రమలకు చెందిన సన్నిహితులు, మిత్రులను ఆహ్వానిస్తున్నారు. ప్రియాంక సింగ్ తన యూట్యూబ్ ఛానల్ లో కీర్తి ఆహ్వానిస్తున్న వీడియో పోస్ట్ చేశారు. ఆ విధంగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో అభిమానులు కీర్తికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.