Sarayu : బిగ్ బాస్ అంతా ఫేక్, జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు… మాజీ కంటెస్టెంట్ సరయు సంచలన కామెంట్స్!

తాజాగా ఈ షో పై షాకింగ్ కామెంట్స్ చేసింది సరయు. బిగ్ బాస్ నన్ను, నిన్ను షో చూస్తున్న ప్రతి ఒక్కరిని మోసం చేస్తారు. ఇక్కడ డబ్బులు ఎదురు ఇచ్చి మరి హౌస్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు.

Written By: Shiva, Updated On : July 23, 2023 1:25 pm
Follow us on

Sarayu : బిగ్ బాస్ 7 సీజన్ సందడి షురూ అయ్యింది. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ మా బిగ్ బాస్ తెలుగు 7 మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ విడుదల చేయటం దానికి మంచి రెస్పాన్స్ రావడం తెలిసిందే, అయితే బిగ్ బాస్ అంటేనే వివాదాలకు నిలయం అనే చెప్పాలి. అయితే సీజన్ స్టార్ట్ కాకముందే వివాదాలు మొదలయ్యాయి. బిగ్ బాస్ ఒక ఫేక్ షో అంటూ సంచలన కామెంట్స్ చేసింది, ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ సరయు.

7 ఆర్ట్స్ యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన సరయు బిగ్ బాస్ 5 వ సీజన్ కి, బిగ్ బాస్ OTT సీజన్ కి హౌస్ లోకి వెళ్ళింది. సీజన్ 5 లో మొదటి వారంలోనే బయటకు వచ్చిన సరయు, OTT సీజన్ లో నాలుగో వారంలో బయటకు వచ్చింది. తాజాగా ఈ షో పై షాకింగ్ కామెంట్స్ చేసింది సరయు. బిగ్ బాస్ నన్ను, నిన్ను షో చూస్తున్న ప్రతి ఒక్కరిని మోసం చేస్తారు. ఇక్కడ డబ్బులు ఎదురు ఇచ్చి మరి హౌస్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇంటర్నల్ గా చాలా సపోర్ట్ ఉంటుంది. అలాంటి వాళ్లతో మనం పోటీ పడితే మన గురించి రాంగ్ గా  చూపిస్తానంటూ బాంబ్ పేల్చింది.

నిజానికి బిగ్ బాస్ షో.. నిర్వహించే తీరు కానీ.. ఎలిమినేషన్స్‌ కానీ.. నామినేషన్స్ కానీ.. చివరికి విన్నర్‌ని ప్రకటించడం కానీ.. కంటెస్టెంట్స్‌ని తీసుకోవడం కానీ.. ఓటింగ్ కానీ ఫెయిర్‌గా జరగదని , దాని వెనుక చాలా లెక్కలు ఉంటాయనేది అనుమానాలు చాలామందిలో ఉన్న అనుమానం. అది నిజమే అన్నట్లు తాజాగా సరయు కామెంట్స్ చేసింది. నిజానికి బిగ్ బాస్ షో కి వెళ్ళిన వాళ్లతో అనేక రకాలైన అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇందులో భాగంగా షో గురించి కానీ, అందులో జరిగే విషయాలు కానీ, అక్కడ ఇచ్చే రెమ్యూనరేషన్ గురించి బయట మాట్లాడకూడదు. కానీ సరయు ఏకంగా ఈ బిగ్ బాస్ షోనే ఒక ఫేక్ అంటూ హాట్ కామెంట్స్ చేసింది.

ఈ షో కి వెళితే వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వడం పక్కన పెడితే, కొందరు డబ్బులిచ్చి మరి హౌస్ లోకి వస్తారు. దీంతో అలాంటి వాళ్ళని షో లో ముందుకు తీసుకోని వెళ్తారు, అదే విధంగా పీఆర్ టీమ్స్ కూడా వాళ్ళ కోసం వర్క్ చేస్తాయి. అక్కడ జరిగేది మొత్తం మోసం, ఇలాంటి షోలు చూసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు అంటూ సంచలన ఆరోపణలు చేసింది సరయు. ప్రతి సీజన్ కి ముందు బిగ్ బాస్ మీద ఇలాంటి ఆరోపణలు రావడం సహజం, కానీ ఇదేమి కూడా షో మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం తక్కువే, ఎవరు అవునన్నా కాదన్నా బిగ్ బాస్ అనేది బుల్లితెర మీద సూపర్ హిట్ అనే చెప్పాలి. మరి ఈ సీజన్ ఎలా ఉండబోతుందో చూడాలి.