Inaya Sultana: ఇనాయ సుల్తానాకు గతంలో ఎలాంటి ఫేమ్ లేదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆమెను పాప్యులర్ చేశాడు. ఓ ప్రైవేట్ పార్టీలో వర్మతో ఆల్కహాల్ సేవిస్తూ ఇనాయ సుల్తానా కనిపించింది. గతంలో ఆమె కొన్ని చిత్రాల్లో నటించింది. అవి చిన్న సినిమాలు కావడంతో జనాలకు వాటి గురించి తెలియదు. వర్మను కలిసిన ఇనాయ అతనితో పార్టీ చేసుకుంది . ఆ ఫోటోలు వర్మ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం తో వైరల్ అయ్యాయి. అలా ఇనాయ సుల్తానా వెలుగులోకి వచ్చింది.
ఇదే ఆమెకు బిగ్ బాస్ షోలో ఆఫర్ వచ్చేలా చేసింది. బిగ్ బాస్ సీజన్ 6లో ఇనాయ సుల్తానా కంటెస్ట్ చేసింది. ఇనాయ హౌస్లో బోల్డ్ యాటిట్యూడ్ మైంటైన్ చేసింది. ఆమె ఓపెన్ గా ఓ కంటెస్టెంట్ తో ఎఫైర్ నడిపింది. ఆర్జే సూర్య ప్రేమలో పడిపోయింది. కన్ఫెషన్ రూమ్ లో బిగ్ బాస్ కి నేరుగా తనకు సూర్య అంటే ఇష్టమని చెప్పింది. ఆర్జే సూర్య-ఇనాయ ఒకే కంచంలో తినేవారు. ఎప్పుడూ కలిసి ఉండేవారు.
ఒక దశలో ఇనాయ సుల్తానా గేమ్ కూడా వదిలేసి ఆర్జే సూర్యతో రొమాన్స్ లో మునిగిపోయింది. దాంతో నాగార్జున ఇద్దరినీ హెచ్చరించాడు. దూరంగా ఉంటున్నట్లు నటించాలని ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. దానిలో భాగం ఇనాయ ఆర్జే సూర్యను నామినేట్ చేసింది. అనూహ్యంగా ఆ వారమే ఆర్జే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. ఆర్జే సూర్య ఎలిమినేషన్ ని ఇనాయ తట్టుకోలేకపోయింది. గట్టిగా ఏడ్చేసింది.
సూర్య ఎలిమినేట్ అయ్యాక ఇనాయ సుల్తానా గేమ్ మెరుగైంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అవతరించింది. ఇనాయ ఒంటరిగా గేమ్ ఆడింది. ఎవరు తప్పు చేసినా ప్రశ్నించేది. పది వారాలకు పైగా ఇనాయ హౌస్లో ఉంది. ఇనాయ ఎలిమినేషన్ పై విమర్శలు వినిపించాయి. ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఫైనల్ కి వెళ్లకున్నా ఇనాయ ఫేమ్ రాబట్టింది.
ఇప్పుడు ఆమెకు సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఫైడే పేరుతో ఒక సినిమా చేస్తుంది. కాగా ఇనాయ సుల్తానా జిమ్ ట్రైనర్ ప్రేమలో పడింది. అతని పేరు గౌతమ్ కొప్పిశెట్టి అని తెలుస్తుంది. ఇద్దరూ విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇష్టమైన ప్రదేశాలకు విహారాలకు చెక్కేస్తున్నారు. ఇనాయ ప్రియుడితో పబ్లిక్ లో రొమాన్స్ చేస్తుంది. ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. ఇనాయ తీరుకు జనాలు మండిపడుతున్నారు. అలాంటి ఫోటోలు షేర్ చేయడం అవసరమా అంటున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా ఇనాయ అన్ లిమిటెడ్ గా ప్రియుడితో ఎంజాయ్ చేస్తుంది.
Web Title: Bigg boss inaya sultana latest photos are going viral on social media 2
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com